బెంగళూరులో నీడ లేని రోజు. . అంతరిక్షంలో ఊహించని అద్భుతం

బెంగళూరులో నేడు అద్భుతం సంభవించింది. అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు సిటీలో ఎక్కడా కూడా నీడ వ్యక్తులకు సంబంధించి కానీ, వస్తువులకు సంబంధించి కానీ నీడలు కనిపించలేదట. చాలాసేపటి వరకు సిటీ మొత్తం ఇలాగే ఉందట. దీనిని శాస్త్రవేత్తలు ‘జీరో షాడో డే’ గా పరిగణిస్తున్నారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుక్కున్నారు. ఇదివరకు ఈ కేంద్రం ఎన్నో పరిశోధనలు విజయవంతంగా జరిపి […]

Share:

బెంగళూరులో నేడు అద్భుతం సంభవించింది. అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు సిటీలో ఎక్కడా కూడా నీడ వ్యక్తులకు సంబంధించి కానీ, వస్తువులకు సంబంధించి కానీ నీడలు కనిపించలేదట. చాలాసేపటి వరకు సిటీ మొత్తం ఇలాగే ఉందట. దీనిని శాస్త్రవేత్తలు ‘జీరో షాడో డే’ గా పరిగణిస్తున్నారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుక్కున్నారు. ఇదివరకు ఈ కేంద్రం ఎన్నో పరిశోధనలు విజయవంతంగా జరిపి అవన్నీ నిజం అని రుజువు చేసింది. అసలు ఇలా ఎందుకు జరిగింది అంటే సూర్యుడు మన భూమి ఉపరితలం మీద నేరుగా రావడం చేత ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి పరిణామం రెండేళ్లకు ఒకసారి అవుతుందని, నీడలు కారణమయ్యే మకర మరియు కర్కాటక నక్షత్రాలు ఆ సమయంలో పనిచేయవు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం భూమి ఈ సమయంలో తన చుట్టూ తాను తిరిగే ప్రక్రియని 23.5 డిగ్రీలకు పెంచుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, అందువల్ల సూర్యుడు పగలు పూట దక్షిణం నుండి ఉత్తరాయణం వైపు 23.5 డిగ్రీలకు జరిగినట్లు అనిపిస్తుందని, అలాగే ఉత్తరం నుండి దక్షిణాయనం వైపు 23.5 డిగ్రీలకు జరుగుతుందని, ఆ సమయంలో నీడ కనిపించకుండా పోతుందట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆట్రో ఫిజిక్స్ ఇందుకోసం నగరంలో అనేక సెమినార్స్ కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహనా కలిగించే ప్రయత్నం చేస్తుంది. సామాన్యులకు ఎవరికైనా ఇలాంటి శాస్త్రాల గురించి అవగాహనా పెంచుకోవాలంటే IIAలో జాయిన్ అవ్వొచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఇలాంటివన్నీ బాగా తెలుసుకొని, పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు కూడా అవ్వవచ్చేమో, ఎవరు చెప్పగలరు. దీని మీద ఈ సంస్థ ఎన్నో వందల పరిశోధనలు జరిపించింది. నీడ మరియు దాని స్వభావం ఎలా ఉంటుంది అనే దానిపై ఈ కేంద్రంలో ఎన్నో లైవ్ ఉదాహరణలతో కూడిన పరిశోధనలను చూడవచ్చు. 

ప్రతీ ఏడాదీ ఆస్ట్రో శాస్త్రవేత్తలు ఒక చోటకి చేరి, రౌండ్ సర్కిల్లో నిల్చొని తమ నీడలను గమనిస్తూ ఉంటారు. ఒక బాటిల్ నిండా నీళ్లు, గరిటె, PVC పైపులు, పేపర్ మరియు U హోల్స్ ఫ్లోర్ కి సెంటర్లో అమరుస్తారు. ఈ రోజు సరిగ్గా 12 గంటల 17 నిమిషాలకు నీడలు మాయం అవ్వడం, మళ్ళీ రావడం వంటివి గమనించారు. ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. నీడ లేని రోజు కూడా ఒకటి ఉంటుందనే విషయం మాకు ఇన్ని రోజులు తెలియలేదని, ఈసారి మేము కూడా ఇలాంటివి ప్రత్యేకంగా గమనిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మన దేశంలోని పరిశోధనా సంస్థలు ఇదేవిధంగా మరిన్ని అద్భుతాలు సాధిస్తారని ఆశిద్దాం. ఏదేమైనా మనం గమనించినా, గమనించక పోయినా మన ప్రకృతిలోను, అంతరిక్షంలోను ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఎంతో తెలుసుకున్నాం అనిపిస్తుంది. కానీ ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు మనకి మానవులు కనిపెట్టింది గోరంత, ఇంకా కనిపెట్టవలసినది కొండంత అని అనిపించక మానదు!