యూట్యూబ్‌లో కొత్త ఫీచర్..  గేమర్స్‌కు పండగే..

 యూట్యూబ్‌ “ప్లేబుల్స్” అనే కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది, ఇందులో తమ వినియోగదారులు నేరుగా ఆన్లైన్ గేమ్ ఆడటానికి ఆప్షన్ ఉటుందని చెప్పారు. వీడియో షేరింగ్ లో అతి పెద్ద యాప్ అయినా యూట్యూబ్ ఇప్పుడు మింగ్ పరిశ్రమలో తొలిఅడుగు వేయనుంది. తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు ఈ ఫీచర్ ని టెస్ట్ చేయడానికి ఆహ్వానించాము అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు ఎంగాడ్జెట్ చెప్పారు. వెబ్‌బ్రౌజర్, ఆండ్రాయిడ్ మొబైల్స్, యాపిల్ ఐఫోన్ […]

Share:

 యూట్యూబ్‌ “ప్లేబుల్స్” అనే కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది, ఇందులో తమ వినియోగదారులు నేరుగా ఆన్లైన్ గేమ్ ఆడటానికి ఆప్షన్ ఉటుందని చెప్పారు. వీడియో షేరింగ్ లో అతి పెద్ద యాప్ అయినా యూట్యూబ్ ఇప్పుడు మింగ్ పరిశ్రమలో తొలిఅడుగు వేయనుంది. తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు ఈ ఫీచర్ ని టెస్ట్ చేయడానికి ఆహ్వానించాము అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు ఎంగాడ్జెట్ చెప్పారు. వెబ్‌బ్రౌజర్, ఆండ్రాయిడ్ మొబైల్స్, యాపిల్ ఐఫోన్ యూజర్లందరికీ ఈ గేమింగ్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.దీని వల్ల యూట్యూబ్‌లో వీడియోలు చూడటమే కాకుండా ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట.

టెస్టింగ్ కోసం అందుబాటులో ఉన్న గేమ్‌ల  సంఖ్య ఖచ్చితమైన తెలియనప్పటికీ, రిపోర్ట్ లో  హైలైట్ చేయబడిన ఒక గేమ్ స్టాక్ బౌన్స్ అని తెలిసింది. ఈ ప్రకటన-మద్దతు గల ఆర్కేడ్ గేమ్‌లో బౌన్స్ బాల్‌తో ఇటుకలను బాల్ తో పగలకొడుతుంటుంది. యూట్యూబ్‌లో ఆన్‌లైన్ గేమ్‌ల పరిచయం ద్వారా తమ వినియోగదారులు కొత్త తరహా వినోదాన్ని ఇవ్వడం మరియు కంటెంట్ క్రియేటర్లు వారి  యూజర్స్ ఒకరితో ఒకరు మాట్లాడే అదనపు అవకాశాలను అందిస్తుంది. 

గేమింగ్ ఫీచర్‌తో పాటు, యూట్యూబ్ కొత్త ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్  (AI)- పవర్ డబ్బింగ్  సాధనాన్ని కూడా  ప్రకటించింది ఇది వివిధ భాషల్లో వీడియో డబ్బింగ్‌ను సులభతరం చేస్తుంది. Google యొక్క ఏరియా 120 ఇంక్యుబేటర్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సాధనాన్ని “అలౌడ్” అంటారు. ఇది వీడియోలను అనువదించాడనికి ఉపయోగపడేలా AI ని రూపొందించారు. క్రియేటర్ సులభంగా రివ్యూ మరియు ఎడిట్ చేయగల ట్రాన్స్‌క్రిప్షన్‌ను అందించారు. ఈ ఫీచర్ వీడియోల డబ్బింగ్ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా మొదలుపెట్టారు.  దీని వలన క్రియేటర్స్ ప్రపంచం లోని యూజర్స్ అందరితో మరింత అందుబాటులో ఉండగలరు. 

ఇప్పటికే తమ ఉద్యోగులతో యూట్యూబ్‌లో గేమింగ్ ఫీచర్‌ను గూగుల్ టెస్ట్ చేయిస్తోంది. ఈ ఫీచర్ వస్తే ఆన్‌లైన్స్ గేమర్స్ యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు.దీని వల్ల యూట్యూబ్‌కు కూడా మంచి యాడ్ రెవెన్యూ వస్తుంది.అలాగే యూట్యూబ్ నుంచి సరికొత్త షాపింగ్ ఛానెల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్ గేమింగ్‌లో YouTube యొక్క వెంచర్ మరియు AI-ఆధారిత డబ్బింగ్ టూల్ యొక్క పరిచయం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు క్రియేటర్స్ కి కొత్త ఫీచర్స్ ఇవ్వడం కొరకు వారు చేస్తున్న ప్రయత్నాలను చూపించారు. గేమింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టడం ద్వారా, YouTube పెద్ద గేమింగ్ కమ్యూనిటీని సమర్థవంతంగా ట్యాప్ చేయగలదు మరియు వీడియో కంటెంట్ మరియు గేమింగ్ అనుభవాలు రెండింటికీ కలిగి ఉన్న ఒక గొప్ప ప్లాట్‌ఫారమ్‌ను అవ్వనుంది. మరోవైపు AI-ఆధారిత డబ్బింగ్ టూల్, బహుభాషా కంటెంట్ అవసరాన్ని తెలియజేస్తుంది మరియు దీని వలన క్రియేటర్స్ ప్రపంచం లోని యూజర్స్ అందరికి సులభముగా లభిచనుంది. 

 ఇక్కడ ప్లేయబుల్స్ మరియు AI డబ్బింగ్ టూల్ టెస్టింగ్ దశ ప్రస్తుతం YouTube ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయబడినప్పటికీ,   ఈ టెస్టింగ్ నుండి వచ్చే సానుకూల స్పందన మరియు ఫీడ్‌బ్యాక్  ద్వారాఈ ఫీచర్లను సాధారణ ప్రజలకు అందుబాటులో వెళ్లే లోపు మార్గం సుగమం చేస్తుంది. దాని ఆఫర్‌లను అభివృద్ధి చేయడం మరియు వైవిధ్యపరచడం కొనసాగిస్తున్నందున, భవిష్యత్తులో వినియోగదారులందరు మరియు క్రియేటర్స్ అందరికి మరిన్ని ఆకర్షణీయమైన కంటెంట్  అనుభవాన్ని అందించనున్నారని చెప్పారు.