యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో స్లీప్ టైమర్ ఫీచర్

యూట్యూబ్ తన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మ్యూజిక్కి “స్లీప్ టైమర్” ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం యాప్‌లో ప్లే అవుతున్న పాటలకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. మీరు నిర్దిష్ట సమయం కోసం టైమర్‌ను సెట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు, ఆపై పాట ఆటోమ్యాటిక్‌గా ప్లే అవడం ఆగిపోతుంది. మ్యూజిక్ వింటూనే నిద్రపోవాలనుకునే వ్యక్తులకు ఈ  స్లీప్ టైమర్ ఫీచర్ సహాయ కరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్లీప్ టైమర్ ఫీచర్ మీరు […]

Share:

యూట్యూబ్ తన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మ్యూజిక్కి “స్లీప్ టైమర్” ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం యాప్‌లో ప్లే అవుతున్న పాటలకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. మీరు నిర్దిష్ట సమయం కోసం టైమర్‌ను సెట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు, ఆపై పాట ఆటోమ్యాటిక్‌గా ప్లే అవడం ఆగిపోతుంది.

మ్యూజిక్ వింటూనే నిద్రపోవాలనుకునే వ్యక్తులకు ఈ  స్లీప్ టైమర్ ఫీచర్ సహాయ కరంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

స్లీప్ టైమర్ ఫీచర్ మీరు నిద్రపోతున్నప్పుడు మ్యూజిక్ ప్లేయర్‌ని నిరంతరం ప్లే చేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి.. అది చేసే డిస్టబెన్స్ గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఈ ఫీచర్ అందరు యూజర్లకు అందుబాటులో లేదని, ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగిస్తున్నారని ఒక నివేదిక పేర్కొంది.

మరోవైపు యూట్యూబ్ “రియల్ టైమ్ లిరిక్స్” అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది, ఇది మీరు వింటున్న మ్యూజిక్‌తో పాటు పాడే పదాలను మీకు స్క్రీన్ పైన చూపుతుంది.

కొంతమంది యూట్యూబ్ మ్యూజిక్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ఫీచర్‌ యాక్సెస్‌ ఉంది. అయినప్పటికీ, ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల అందరికి అందుబాటులోకి రాలేదు. 

ఈ ఫీచర్ వల్ల పాట ప్లే అయ్యేటప్పుడు పాట యొక్క లిరిక్స్ మనకి కనిపిస్తుంది. Spotify మరియు యాపిల్ మ్యూజిక్ లలో ఈ ఫీచర్‌ ఇప్పటికే ఉంది. ఇది కూడా అటువంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసే.

యూట్యూబ్ మ్యూజిక్ అనేది యూట్యూబ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్. దీనిలో జోనర్, ప్లేలిస్ట్ మరియు ఇతర సిఫార్సుల ఆధారంగా పాటలు మరియు మ్యూజిక్ వీడియోల ద్వారా బ్రౌజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం, మ్యూజిక్ యాప్‌తో సహా యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్ మొత్తాన్ని కవర్ చేసే పెద్ద సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌‌గా నిలిచింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా సంగీతాన్ని వినే వినియోగదారుల కోసం ఈ యాప్ రూపొందించబడింది.

మే 17, 2018న వెబ్ ఆధారిత డెస్క్‌టాప్ ప్లేయర్ లాంచ్ చేశారు. పాటల ఆధారంగా గూగుల్ సెర్చ్, కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఉపయోగించడంతో సహా యూట్యూబ్ మ్యూజిక్ సర్వీస్ యొక్క కొత్త వెర్షన్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అదనంగా యూట్యూబ్ మ్యూజిక్ ఒక ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ సేవగా మారింది, అంటే ఇది యాపిల్ మ్యూజిక్ మరియు Spotifyకి మరింత కాంపిటీటర్  ఉంది. యూట్యూబ్ మ్యూజిక్ ఏప్రిల్ 18, 2019న గూగుల్ అసిస్టెంట్ స్మార్ట్ స్పీకర్‌లలో అందుబాటులోకి వచ్చింది. 

యూట్యూబ్ మ్యూజిక్ మరియు గూగుల్ ప్లే మ్యూజిక్ రెండు విభిన్న సంగీత సేవలు. గూగుల్ ప్లే మ్యూజిక్ డిసెంబర్ 2020లో షట్ డౌన్ అయ్యింది. యూట్యూబ్ మ్యూజిక్‌ను ఇప్పుడు గూగుల్ ప్లే మ్యూజిక్‌లా మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది.
సెప్టెంబర్ 2019లో యూట్యూబ్ మ్యూజిక్ కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌లలో గూగుల్ ప్లే సంగీతాన్ని ప్రధాన సంగీత  రీప్లేస్ చేసింది. అయితే.. మే 2020వరకు మీరు కొనుగోలు చేసిన పాటలు మరియు మీరు సృష్టించిన ప్లే లిస్ట్ జాబితాలతో మొత్తం డేటాని గూగుల్ ప్లే మ్యూజిక్ నుండి  యూట్యూబ్ మ్యూజిక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొనే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ రెండింటి ఫీచర్లలో కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి యూట్యూబ్ ట్రై చేస్తోంది.