కొత్త ప్రోడక్ట్ మీద ప్రయోగాలు జరిపిస్తున్న యూట్యూబ్

YouTube తీసుకు వస్తున్న ‘ప్లేబుల్స్’ అనే కొత్త  ప్రోడక్ట్ ను పరీక్షించడానికి, కంపెనీ తన ఉద్యోగులను ఆహ్వానించింది మరియు టెస్టింగ్ లో భాగంగా ఇందులో స్టార్ బౌన్స్ అనే కొన్ని గేమ్స్ కూడా ఉండబోతున్నాయి. ప్రస్తుతం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకునేందుకు YouTube ఇంటర్నల్ గా ఒక ప్రోడక్ట్ మీద పరీక్షలు జరిపిస్తుంది, మెయిన్ సంస్థ Googleలోని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌ ఆధారంగా ఈ వార్త గురించి బయటికి వచ్చింది. యూట్యూబ్ గేమింగ్ అనేది చాలా కాలం క్రితమే […]

Share:

YouTube తీసుకు వస్తున్న ‘ప్లేబుల్స్’ అనే కొత్త  ప్రోడక్ట్ ను పరీక్షించడానికి, కంపెనీ తన ఉద్యోగులను ఆహ్వానించింది మరియు టెస్టింగ్ లో భాగంగా ఇందులో స్టార్ బౌన్స్ అనే కొన్ని గేమ్స్ కూడా ఉండబోతున్నాయి. ప్రస్తుతం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకునేందుకు YouTube ఇంటర్నల్ గా ఒక ప్రోడక్ట్ మీద పరీక్షలు జరిపిస్తుంది, మెయిన్ సంస్థ Googleలోని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌ ఆధారంగా ఈ వార్త గురించి బయటికి వచ్చింది.

యూట్యూబ్ గేమింగ్ అనేది చాలా కాలం క్రితమే చెక్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీ కొత్త ఫీచర్ల విషయంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎటువంటి విషయాలు ప్రకటించడానికి ఏలేదని పేర్కొంది. 

యూట్యూబ్ ప్రోడక్ట్ గురించి మరిన్ని విషయాలు:

YouTube తీసుకు వస్తున్న ‘ప్లేబుల్స్’ అనే కొత్త  ప్రోడక్ట్ ను పరీక్షించడానికి, కంపెనీ తన ఉద్యోగులను ఆహ్వానించింది మరియు టెస్టింగ్ లో భాగంగా ఇందులో స్టార్ బౌన్స్ అనే కొన్ని గేమ్స్ కూడా ఉండబోతున్నాయి అని నివేదిక పేర్కొంది.

గేమ్‌లను యూట్యూబ్ సైట్‌లో వెబ్ బ్రౌజర్‌లలో లేదా గూగుల్ ఆండ్రాయిడ్, అలాగే యాపిల్ ఐఓఎస్ మొబైల్ సిస్టమ్‌లతో నడుస్తున్న ఎటువంటి డివైసెస్ ద్వారా అయినా సరే ఆడుకోవచ్చు, అంటూ నివేదిక ఇందులో పేర్కొంది.

యూట్యూబ్‌కి సంబంధించిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ, గేమింగ్ సంబంధించిన ఐడియా అమల్లోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నట్లు, కంపెనీ కొత్త ఫీచర్‌ల విషయంలో ప్రయోగాలు చేస్తోందని మరియు “ప్రస్తుతం ప్రకటించడానికి ఏమీ లేదు” అని అన్నారు.

ఆన్‌లైన్ గేమ్‌స్ను యూట్యూబ్‌ హోస్ట్ చేయడం, వినియోగదారులకు గేమ్‌స్ను చక్కగా చూసేందుకు మరియు లైవ్ స్ట్రీమ్ చేసిన గేమ్ ఫుటేజీని చూసేందుకు వీలుపడే ఒక ప్రత్యేకమైన ప్రదేశం, అయితే అడ్వటైజ్మెంట్ యొక్క సమయం అనుకోకుండా కాస్త మందగించిన నేపథ్యంలో, CEO నీల్ మోహన్ కొత్త వృద్ధి రంగాల్లోకి దూసుకుపోతున్నట్లు WSJ నివేదిక తెలిపింది. 

యూట్యూబ్ విశేషాలు: 

ప్రస్తుతం ఉన్న కాలంలో, ఎక్కువ శాతం మంది యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కోటీశ్వరులుగా మారడం చూడొచ్చు. అంతే కాకుండా నూటికి 90% మంది యూట్యూబ్ తెలియని వాళ్ళు లేరు. యూట్యూబ్ ప్రత్యేకించి యువతకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో, గేమ్స్ విషయంలో, కొత్త కోర్సులు చేయడం విషయంలో, కొత్త జాబ్స్ వెతుక్కునే విషయంలో, అన్ని రంగాల గురించి తెలుసుకోవడంలో ఇలా మరెన్నో విషయాలలో సహాయం చేస్తుంది. 

యువతికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియని విషయాలను తెలుసుకోవడంలో యూట్యూబ్ ఎంతగానో సహాయం చేస్తుంది. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది లబ్ది పొందారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా గొప్ప వారిగా మారారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ హవా ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. కానీ ఎప్పటికప్పుడు యూట్యూబ్ కొత్త ఫీచర్స్ తో అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. యూట్యూబ్ చూస్తూనే మనం మన మొబైల్లో ఉన్న ఎటువంటి యాప్స్ అయినా ఉపయోగించవచ్చు. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు భరోసాగా నిలుస్తుంది యూట్యూబ్. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. ఆహ్లాదకరాన్ని, పాటలను, నిద్రపుచ్చే కథల నుంచి మోటివేషన్ అందించే మంచి విషయాలను గూర్చి యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు. 

కుట్లు అల్లికలు దగ్గర నుంచి పెద్దపెద్ద మిషన్ తయారీ వరకు మనం అన్ని కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. దీనికి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, కేవలం మన మొబైల్ డేటా ఆన్ లో ఉంటే సరిపోతుంది. కానీ మనిషి ఏదైనా మంచి కోసం ఉపయోగిస్తే వారికి మంచి జరుగుతుంది, చెడు కోసం ఉపయోగిస్తే చివరికి వాళ్ళకి చెడే జరుగుతుంది. అది వస్తువు విషయంలో కావచ్చు లేదంటే వాడే ఆప్(app) విషయంలో కూడా కావచ్చు.