Elon Mask: భారీగా తగ్గిన ‘ఎక్స్’ విలువ..!

ప్రపంచ కుబేరుడు ‘ఎలాన్ మస్క్’ (Elon Mask) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. కంపెనీ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు, లోగో మార్చారు, ఆఖరికి పేరు కూడా మార్చేశాడు. ఇప్పుడు కంపెనీ విలువ భారీగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.  సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) (Social Media X) సోమవారం తమ ఉద్యోగులకు స్టాక్‌ గ్రాంట్స్‌ను […]

Share:

ప్రపంచ కుబేరుడు ‘ఎలాన్ మస్క్’ (Elon Mask) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. కంపెనీ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు, లోగో మార్చారు, ఆఖరికి పేరు కూడా మార్చేశాడు. ఇప్పుడు కంపెనీ విలువ భారీగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) (Social Media X) సోమవారం తమ ఉద్యోగులకు స్టాక్‌ గ్రాంట్స్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా జారీ చేసిన స్టాక్ గ్రాంట్స్‌ ప్రకారం కంపెనీ విలువ (X Value) కేవలం 19 బిలియన్‌ డాలర్లు మాత్రమే. బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) దీన్ని గత ఏడాది 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంటే ఎక్స్‌ విలువ (X Value) దాదాపు సగానికి పైగా పడిపోయిందన్నమాట!

Read More: Apple: ఆపిల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటున్న గవర్నమెంట్

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఒక్కో ట్విటర్‌ స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున చెల్లించారు. తాను కంపెనీకి దాని విలువ కంటే అధికంగా చెల్లించానని ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. మార్చిలో కంపెనీ ఉద్యోగులకు లేఖ రాస్తూ ఎక్స్‌ విలువ 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించినట్లయింది. స్టాక్‌ గ్రాంట్స్‌ విలువను కంపెనీ బోర్డు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తుంది. ఈ లెక్కన ఒక్కో షేరు విలువను 45 డాలర్లుగా లెక్కగట్టి ఉద్యోగులకు గ్రాంట్స్‌ జారీ చేసింది. అంటే తమ కంపెనీ విలువ 19 బిలియన్‌ డాలర్లే అని స్వయంగా వారే అంగీకరించినట్లయింది.

‘రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌ (RSU)’ కింద ఒక్కో షేరును 45 డాలర్ల విలువతో జారీ చేస్తున్నామని ఎక్స్‌ తమ ఉద్యోగులకు తెలిపింది. రానున్న రోజుల్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుంది. అయితే, పాత యాజమాన్యం ఆధ్వర్యంలో పొందిన షేర్లకు మాత్రం కొనుగోలు సమయంలో నిర్ణయించినట్లుగా ఒక్కో స్టాక్‌(Stock)పై 54.20 డాలర్లు చెల్లిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, కంపెనీ విలువ సగానికి పడిపోయినప్పటికీ.. షేరు విలువలో కూడా ఆ స్థాయి తగ్గుదల ఎందుకు నమోదు కాలేదనే విషయంపై స్పష్టత లేదు.

ప్రస్తుతం, ఎలోన్ మస్క్ 248.7బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎలోన్ మస్క్‌(Elon Mask) కి ప్రస్తుతం టెస్లాలో 23 శాతం వాటా ఉంది. అతని సంపదలో గణనీయమైన భాగం, దాదాపు మూడింట రెండు వంతులు, టెస్లా(Tesla) విజయంతో ముడిపడి ఉంది. ట్విటర్‌ను సొంతం చేసుకున్న వెంటనే కంపెనీలో మస్క్‌ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దాదాపు 80 శాతం ఉద్యోగులను తొలగించేశారు. వెరిఫికేషన్‌ ప్రక్రియను మార్చారు. కంటెంట్‌ మాడరేషన్‌లోనూ మార్పులు తీసుకొచ్చారు. పేరును ట్విటర్‌ నుంచి ‘ఎక్స్‌’గా మార్చారు. 

మరో వైపు విద్వేషపూరిత సమాచారం పెరిగిపోయిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం తగ్గిందని గత వేసవిలో మస్క్‌ స్వయంగా అంగీకరించారు. అయితే, రానున్న రోజుల్లో ‘ఎక్స్‌’ను ఒక పూర్తి స్థాయి ‘ఎవ్రీథింగ్‌ యాప్‌’(Everything app)గా మార్చనున్నట్లు ఇటీవల ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎక్స్‌ను ఒక వ్యక్తి ఆర్థిక జీవితానికి అడ్డాగా మార్చి అసలు బ్యాంకు ఖాతా అవసరమే లేకుండా చేస్తామని పేర్కొన్నారు. 2024 చివరకు చాలా మార్పులు రాబోతున్నాయని పరోక్షంగా ఉద్యోగులకు తదుపరి లక్ష్యాలను నిర్దేశించారు.