మరో కొత్త ఫీచ‌ర్ తీసుకువచ్చిన ట్విట్టర్

మనం జాబ్ కోసం నౌకరీ, మాన్స్టర్, లింక్డ్ ఇన్ ఇలా ఎన్నో ఆప్షన్స్ చూస్తూ ఉంటాం.. అయితే ఇదే విధంగా ట్విట్టర్ అధినేత మస్క్, జాబ్ అందించే ఆర్గనైజేషన్ కోసం, అదే విధంగా జాబ్ వెతుక్కునే వారి కోసం ఒక చక్కని ఆప్షన్ ట్విట్టర్ లో ఆడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆర్గనైజేషన్ తమకి సరిపోయే మంచి క్యాండిడేట్ వెతకడానికి చాలా బాగా సహాయపడుతుంది ట్విట్టర్. అంతే కాకుండా, ఒక చక్కని అవకాశం కోసం ఎదురుచూస్తున్న […]

Share:

మనం జాబ్ కోసం నౌకరీ, మాన్స్టర్, లింక్డ్ ఇన్ ఇలా ఎన్నో ఆప్షన్స్ చూస్తూ ఉంటాం.. అయితే ఇదే విధంగా ట్విట్టర్ అధినేత మస్క్, జాబ్ అందించే ఆర్గనైజేషన్ కోసం, అదే విధంగా జాబ్ వెతుక్కునే వారి కోసం ఒక చక్కని ఆప్షన్ ట్విట్టర్ లో ఆడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆర్గనైజేషన్ తమకి సరిపోయే మంచి క్యాండిడేట్ వెతకడానికి చాలా బాగా సహాయపడుతుంది ట్విట్టర్. అంతే కాకుండా, ఒక చక్కని అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాండిడేట్స్ కి తమకు సరిపోయే చక్కని జాబ్ నోటిఫికేషన్స్ వెళ్తాయి. ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చిన ఉయ్ ఆర్ హైరింగ్ అనే ఆప్షన్ ద్వారా ఈజీగా జాబ్ వెతుక్కునే వెసులుబాటు కల్పిస్తోంది. 

ఎవరికి వర్తిస్తుంది?: 

ట్విట్టర్ తీసుకువచ్చిన ఈ అద్భుతమైన ఆప్షన్ ప్రత్యేకించి ప్రీమియం యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైతే ప్రీమియం యూజర్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ చక్కని సదవకాశం అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది ట్విట్టర్. అంతే కాకుండా ఈ ప్రీమియం యూజర్ అకౌంట్ పొందేందుకు, జాబ్ అవకాశాలు ప్రత్యేకించి కొట్టేందుకు, నెలకి సుమారు 82,000 రూపాయలు ట్విట్టర్ కి చెల్లించాల్సి ఉంటుంది. 

స్టార్ట్ అప్ సలహా: 

లాస్కీ అనే జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ ద్వారా కొత్త ఫీచర్‌ను రూపొందించడంలో మరియు విడుదల చేయడంలో ముఖ్యంగా ట్విట్టర్ కంపెనీకి సహాయపడింది. ముందుగా ట్విట్టర్ ని సొంతం చేసుకున్న ట్విట్టర్ అధినేత అలాన్ మస్క్, ట్విట్టర్ ఒక ప్రత్యేకమైన ఆప్ అవుతుందని, అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయని ముందు చెప్పిన విధంగానే, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆప్షన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇతర ఫ్లాట్ ఫామ్ లకు మంచి పోటీ ఇచ్చేందుకు కూడా ట్విట్టర్ తన వైపు నుంచి కృషి చేస్తుంది అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. 

ట్విట్టర్ ఆప్ లో ఇప్పటికే అనేక మార్పులు: 

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలోన్ మస్క్. అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్.  అన్నట్టుగానే నెక్స్ట్ రోజు నుంచి ట్విట్టర్ లోగోలో X అనే ఆకారం కనిపించింది.

Twitter ప్రైవేటీకరణ చేయడమే కాకుండా, X Corp అనే కొత్త సంస్థలో విలీనం అయింది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ తక్షణమే మునుపటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను ఎవరూ ఊహించని విధంగా విధుల నుంచి తొలగించారు. మస్క్ ట్విట్టర్‌కు అనేక కొత్త మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించాడు మరియు కంపెనీలో సగం మందిని తొలగించాడు.”అత్యంత హార్డ్‌కోర్” పనికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో వందలాది మంది ఉద్యోగులు మానేసి కంపెనీకి రాజీనామా చేశారు.

గత సంవత్సరం ట్విట్టర్ యజమానిగా మస్క్ మారినప్పటి నుంచి, ఆయన ట్విట్టర్ ఆప్ లో తీసుకువచ్చిన మార్పులలో ఇదే చాలా పెద్ద మార్పు అని అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న లిండ యాకరినో తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను కంపెనీలో లోగో X ట్విట్టర్ ఆప్ లో స్థానాన్ని పొందుకునేందుకు ఆమె హస్తం ఎంతో ఉన్నట్లు చెప్పాడు మస్క్. అంతేకాకుండా తన ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ ఆప్ ని ఒక ప్రత్యేకమైన సూపర్ ఆప్ గా చేయాలని అంతేకాకుండా చైనాలో ప్రావీణ్యం పొందిన ‘wechat’ మాదిరిగ మార్చాలనేదే తన నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకొచ్చాడు మస్క్.