ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ కార్ బ్యాటరీ

ప్ర‌పంచం రోజురోజుకీ ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. ఇదే క్రమంలో ఎలక్ట్రికల్ ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ గురించిన విశేషాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కేవలం పది నిమిషాల ఛార్జింగ్ తో సుమారు సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో 400 కిలోమీటర్లు దూసుకువెళ్లొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విశేషాలు మీకోసమే..  10 నిమిషాల ఛార్జింగ్ చాలు:  కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో దాదాపు 400 కి.మీల సుదూర ప్రయాణాన్ని అందించగల’సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్’ బ్యాటరీతో […]

Share:

ప్ర‌పంచం రోజురోజుకీ ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. ఇదే క్రమంలో ఎలక్ట్రికల్ ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ గురించిన విశేషాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కేవలం పది నిమిషాల ఛార్జింగ్ తో సుమారు సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో 400 కిలోమీటర్లు దూసుకువెళ్లొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విశేషాలు మీకోసమే.. 

10 నిమిషాల ఛార్జింగ్ చాలు: 

కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో దాదాపు 400 కి.మీల సుదూర ప్రయాణాన్ని అందించగల’సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్’ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసినట్లు చైనా కంపెనీ పేర్కొంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో. లిమిటెడ్ (CATL), కొత్త బ్యాటరీ ప్రపంచంలోనే మొట్టమొదటి 4C సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ LFP బ్యాటరీ, ఇది 10 ఎన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, 400 కి.మీ సుదూర ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 700 కి.మీ దూసుకువెళ్లొచ్చు.

లిథియం-అయాన్ బ్యాటరీ అభివృద్ధి-తయారీ సంస్థ EV, వినియోగదారులకు ఛార్జింగ్ పెట్టే సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. షెన్‌క్సింగ్ అని పేరుతో విడుదల అయిన కొత్త బ్యాటరీ అందించిన EV, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ప్రపంచాన్ని ప్రజలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలాంటి ఉష్ణోగ్రతలో అయినా పనిచేస్తుంది: 

నార్మల్ రూమ్ టెంపరేచర్ లో, Shenxing బ్యాటరీ కేవలం 10 నిమిషాల్లో 0 నుండి 80% SOC వరకు ఛార్జ్ అవుతుంది. ఇది సెల్ టెంపరేచర్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగించుకుని పని చేస్తోంది. సెల్స్ సరైన ఆపరేటింగ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వేగంగా చార్జింగ్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ -10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా కేవలం 30 నిమిషాల్లో 0 – 80% ఛార్జ్‌ చేసుకోవచ్చు

 చైనా E-కార్ బిజినెస్ కి సంబంధించి CTO గావో హువాన్ ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి షెన్‌క్సింగ్ బ్యాటరీల ఉత్పత్తి మొదలవుతుందని, షెన్‌క్సింగ్‌ బ్యాటరీ ఉపయోగించి నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. CATL తన కొత్త Shenxing సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని ఏ కార్ కంపెనీలు ఉపయోగించుకుంటాయో ఇంకా ప్రకటించనప్పటికీ, చైనీస్ కంపెనీ క్లయింట్‌లలో BMW, Mercedes-Benz, Hyundai, Honda, Tesla, Toyota, Volkswagen.. వంటి కంపెనీలు ఇప్పటికే లిస్టులో ఉన్నట్లు సమాచారం. 

ఎలక్ట్రిక్ బైక్ హవా: 

ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాలలో ఎలక్ట్రిక్ బైక్ లు దర్శనమిస్తున్నాయి. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వంటివి లేకుండా ఉండేందుకు ప్రత్యేకించి తయారు చేయబడిన ఎలక్ట్రిక్ బైకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్లాలి అన్న సరే, సౌండ్ లేకుండా స్మూత్ గా వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బైక్ ఒక అద్భుతమైన బైక్ అని చెప్పుకోవాలి. మొదట్లో ఎలక్ట్రిక్ బైకుల గురించి ప్రజలు భయపడినప్పటికీ, మెల్లమెల్లగా ఆ అపోహ పక్కకి వెళ్లిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు కొనుక్కునేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం కొద్ది సమయం చార్జింగ్ పెట్టుకుంటే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి, కంపెనీల ఎలక్ట్రిక్ బైకులు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్ బైక్లు వైపు మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు హయ్ ఎఫిషియన్సీ తో రాబోతున్న సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ కార్స్ వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరి, ఇవి ప్రజలలో ఎంత బాగా పేరు తెచ్చుకుంటాయో చూడాల్సి ఉంది.