Steve Jobs: స్టీవ్ జాబ్స్ కారుకు నెంబర్ ప్లేట్ ఎందుకో లేదో తెలుసా ?

కాలిఫోర్నియా వాహన చట్టాల్లోని((California Vehicle Rules) ) లొసుగును స్టీవ్ జాబ్స్((Steve Jobs) ) కనుగొన్నారు. దాంతోనే తన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా ఎంచక్కా రోడ్ల మీద తిరగగలిగాడు…ఇది ఎలా సాధ్యమైందో చూద్దాం రండి.. స్టీవ్ జాబ్స్(Steve Jobs) విడుదల చేసే ప్రతి ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ప్రతి టెక్నాలజీ ప్రియులకు తెలుసు. ఆపిల్(Apple) వ్యవస్థాపకుడు చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అర్థాన్ని వెతుక్కోవచ్చు. అచ్చం అలాంటిదే… ఈ నెంబర్ ప్లేట్(Number Plate) […]

Share:

కాలిఫోర్నియా వాహన చట్టాల్లోని((California Vehicle Rules) ) లొసుగును స్టీవ్ జాబ్స్((Steve Jobs) ) కనుగొన్నారు. దాంతోనే తన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా ఎంచక్కా రోడ్ల మీద తిరగగలిగాడు…ఇది ఎలా సాధ్యమైందో చూద్దాం రండి..

స్టీవ్ జాబ్స్(Steve Jobs) విడుదల చేసే ప్రతి ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ప్రతి టెక్నాలజీ ప్రియులకు తెలుసు. ఆపిల్(Apple) వ్యవస్థాపకుడు చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అర్థాన్ని వెతుక్కోవచ్చు. అచ్చం అలాంటిదే… ఈ నెంబర్ ప్లేట్(Number Plate) లేకుండా కారును జాబ్స్ నడపడం. చట్టానికి దొరక్కుండా దర్జాగా చట్టం ముందే ఈ కారులో తిరుగుతూ వచ్చాడు. అయినప్పటికీ చట్టం స్టీవ్ జాబ్స్‌ను ఏమీ చేయలేకపోయింది. స్టీవ్ బాజ్స్ ఇలా ఎలా చేయగలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా అతనికున్న పేరు, పలుకుబడితో పోలీసులు ఇతన్ని టచ్ చేయలేకపోయారా అని చాలా మందే ప్రశ్నించారు. కాని చట్టాన్ని ఏ మాత్రం తప్పుదోవపట్టించకుండా దర్జాగా తన మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్55(Mercedes Benz SL55) ఏఎమ్‌జిలో తిరిగాడు.

ఎలా సాధ్యమైందంటే ఆపిల్ సంస్థ యొక్క స్లోగన్ ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా వెహికల్ చట్టం(Vehicle Act)లోని లొసుగును ఆసరాగా చేసుకుని ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా కారుని వినియోగించాడు. అయితే చట్ట ప్రకారం అక్కడి పోలీసులు ఇతన్ని ఏమీ చేయలేకపోయారు. 

చట్ట ప్రకారమే, కారును రిజిస్ట్రేషన్ చేయకుండా ఎలా వాడుకోవచ్చో ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎలా వివరించాడో ఈ ఆర్టికల్ లో  తెలుసుకుందాం.. 

నిజానికి కాలిఫోర్నియా వెహికల్ రూల్స్(California Vehicle Rules) ప్రకారం, షోరూమ్ నుండి బయటికి వచ్చిన కారును ఆరు నెలల కాల వ్యవధిలోపు రిజిస్ట్రేషన్(Registration) చేయించుకోవాల్సి ఉంటుది. అయితే శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించకుండానే కారును వినియోగిస్తూ వచ్చాడు. స్టీవ్ జాబ్స్ ఓ కార్ రెంటల్(Car Rental) సంస్థ నుండి ఈ రిజిస్ట్రేషన్ కాని కారును ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాడు. కాలిఫోర్నియా రూల్స్ ప్రకారం కొత్త కారును కొన్న వారు ఆరు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

సరిగ్గా ఆరు నెలలు(Six Months) గడిచే సమయానికి అద్దె ముగియటంతో కార్లను అద్దెకిచ్చే సంస్థలు ఈ కారును తీసుకెళ్లిపోతారు. యథావిధిగా మరో రిజిస్ట్రేన్ కాని మరో కారును కార్ రెంటల్ సంస్థ నుండి అద్దెకు తీసుకుంటాడు.  ముగింపు లేని కార్ల సప్లే తీసుకునే కస్టమర్ ఉన్నందుకు సంభందిత కార్ లీసింగ్ కంపెనీ సంతోషంగా ఉంది. అయితే కాలిఫోర్నియా యొక్క అర్థం లేని వెహికల్ రూల్ ద్వారా కస్టమర్లు ఎన్నిరోజులయినా రిజిస్ట్రేషన్ చేయించకుండా చట్టబద్దంగా నడుపుకోవచ్చని స్టీవ్ జాబ్స్(Steve Jobs) నిరూపించాడు.

అయితే, అనారోగ్యం కారణాల రీత్యా ఆగస్టు 24, 2011న, జాబ్స్ తన పదవీ విరమణను ప్రకటించాడు. ఫలితంగా ఆయన వారసుడిగా టిమ్ కుక్(Tim Cook) రంగంలోకి వచ్చాడు. చివరికి ఎనిమిది సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి 56 ఏళ్ల వయసులో అక్టోబర్ 5, 2011 ఈ లోకాన్ని వీడాడు జాబ్స్‌.  2011లో ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2011 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్టీవ్ జాబ్స్ నికర ఆస్తులను 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 

అమెరికా బిలియనీర్ల ర్యాంకింగ్‌లో అతడిని 39 వ స్థానంలో నిలిపింది. 2007లో, ఫార్చ్యూన్ మ్యాగజైన్(Fortune Magazine) జాబ్స్‌ని వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. 2010లో అతను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 17 వ స్థానంలో నిలిచాడు. 2011 లో, స్టీవ్ జాబ్స్ కాంస్య విగ్రహాన్ని(Bronze statue) ఆవిష్కరించారు. 2012 లో, స్టీవ్ జాబ్స్ “మన కాలంలోని గొప్ప పారిశ్రామికవేత్త” గా ఖ్యాతి దక్కించుకున్నాడు. మరణానంతరం గ్రామీ ట్రస్టీస్(Grammy Trustees) అవార్డును అందుకున్నారు. డిస్నీ చిత్రం “జాన్ కార్టర్”, పిక్సర్ కార్టూన్ “బ్రేవ్” అతనికి అంకితం ఇచ్చింది.. స్టీవ్ జాబ్స్ గురించి 10 పుస్తకాలు. 6 డాక్యుమెంటరీలు, 3 ఫీచర్ ఫిల్మ్‌లు రావడం విశేషం.