Windows కోసం WhatsApp యొక్క కొత్త డెస్క్‌టాప్ యాప్: దీన్ని మీ PCలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

వెబ్ బేస్‌డ్ WhatsAp కాకుండా, డెస్క్‌టాప్ Windows కోసం WhatsApp యాప్ ని డెవలప్ చేసింది మెటా యాజమాన్యం. వాట్సాప్ అనేది చాలా మంది వ్యక్తులు చాట్ చేయడానికి మరియు ముఖ్యమైన డేటాను పంచుకోవడానికి ఉపయోగించే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్. WhatsApp అనేది ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఒక గొప్ప యాప్. ఇటీవల.. వాట్సాప్‌ను కలిగి ఉన్న మెటా సంస్థ వినియోగదారులకు ముఖ్యమైన కొత్త ఫీచర్లను జోడించింది. వాట్సాప్‌లో మనం ప్రతిరోజూ […]

Share:

వెబ్ బేస్‌డ్ WhatsAp కాకుండా, డెస్క్‌టాప్ Windows కోసం WhatsApp యాప్ ని డెవలప్ చేసింది మెటా యాజమాన్యం.

వాట్సాప్ అనేది చాలా మంది వ్యక్తులు చాట్ చేయడానికి మరియు ముఖ్యమైన డేటాను పంచుకోవడానికి ఉపయోగించే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్. WhatsApp అనేది ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఒక గొప్ప యాప్. ఇటీవల.. వాట్సాప్‌ను కలిగి ఉన్న మెటా సంస్థ వినియోగదారులకు ముఖ్యమైన కొత్త ఫీచర్లను జోడించింది. వాట్సాప్‌లో మనం ప్రతిరోజూ ఉపయోగించే అనేక ఫీచర్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల వాట్సాప్ మరింత సౌకర్య వంతంగా ఉంటుంది. 

మెసేజింగ్ యాప్ WhatsApp Windows కోసం స్థానిక డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేసింది. కొత్త విండోస్ బేస్‌డ్ యాప్ మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అదే విధంగా ప్రస్తుతం Mac కోసం కూడా అభివృద్ధి చేస్తోంది.

WhatsApp ఇపుడు డెస్క్‌టాప్ పీసీలలో కూడా అందుబాటులో ఉంది. WhatsApp వెబ్ అనేది ఏదైనా బ్రౌజర్లలో ఉపయోగించే వాట్సాప్, WhatsApp డెస్క్‌టాప్.. “ఏదేని డెస్క్ టాప్ లో ఉపయోగించే యాప్.. అంటే ఇది బ్రౌజర్ తో సంబంధం లేకుండా పని చేస్తుంది. అంటే ఈ యాప్ వెబ్ ఆధారితంగా కాకుండా స్థానికంగా ఉంటుంది, కనుక ఇది వేగంగా మరియు మరింత విశ్వసనీయంగా ఉంటుంది” అని కంపెనీ సహాయ కేంద్రంలో పోస్ట్ చేసింది.

Windows కోసం WhatsApp డెస్క్‌టాప్ యాప్‌ను ఎలా పొందాలి

Windows కోసం కొత్త డెస్క్‌ టాప్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ ఫోన్‌కి లింక్ చేయాలని మీకు ఆసక్తి ఉంటే, ఏమి చేయాలో ఇక్కడ తేలుకుందాం. 

1. మీ పీసీలో Microsoft Store ఓపెన్ చెయ్యండి

2. అందులో వాట్సాప్ అని టైప్ చెయ్యండి

3. మీకు వాట్సాప్ కనిపిస్తుంది, ఇంస్టాల్ పైన క్లిక్ చెయ్యండి. క్లిక్ చెయ్యగానే Windows పీసీలో యాప్‌ డౌన్‌లోడ్ అవుతుంది.

4. ఒకవేల మీ ఫోన్ లో వాట్సాప్ లేకపతే.. ప్లే స్టోర్ నుండి WhatsAppని మీ ఫోన్లో కూడా డౌన్లొడ్ చేసుకొండి.

5. మొబైల్ లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చెయ్యండి.

6. మీరు ఐఫోన్‌లో ఉన్నట్లయితే , సెట్టింగ్‌లను నొక్కండి. మీరు Android లో ఉన్నట్లయితే.. యాప్ కుడి వైపున మూడు చుక్కలు కనబడతాయి.. అక్కడ క్లిక్ చెయ్యండి

7. మూడు చుక్కలను క్లిక్ చెయ్యగానే.. మూడో ఆప్షన్ గా.. లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 

8. లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యగానే.. లింక్ ఎ డివైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చెయ్యగానే మీ కెమెరా ఓపెన్ అవుతుంది

9. ఇప్పుడు.. మీరు విండోస్ లో డౌన్ లోడ్ చేసిన డెస్క్‌టాప్ యాప్‌ ఓపెన్ చెయ్యగానే  QR కోడ్ పాప్ అప్ అవుతుంది. మీ ఫోన్ లో ఓపెన్ అయి ఉన్న కెమెరాతో దానిపై QR కోడ్ స్కాన్ చెయ్యగానే మీ డెస్క్‌టాప్ యాప్‌ లో వాట్సాప్ యాక్టివేట్ అవుతుంది.