ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్

యూజర్లకు ఎడిట్ మెసేజ్  ఫీచర్‌ తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రముఖ మెసేజ్ యాప్ WhatsApp గురించి పరిచయం అక్కర్లేదు. ప్రతిరోజు కోట్లాదిమంది ఈ యాప్‌ను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇక రోజు రోజుకీ వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్ అనేక కొత్త అప్డేట్స్ ను కూడా యూజర్ల కోసం తీసుకువస్తోంది.ఈ నేపథ్యంలోనే యూజర్లకు ఎడిట్ మెసెజ్  ఫీచర్‌ తీసుకు రానున్నట్లు వాట్సాప్ యాజమాన్యం వాట్సాప్ బీటా నివేదికలో తెలిపింది. ఎడిట్ మెసేజ్ అనేది యూజర్లు అవతలి వ్యక్తికి […]

Share:

యూజర్లకు ఎడిట్ మెసేజ్  ఫీచర్‌ తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది.

ప్రముఖ మెసేజ్ యాప్ WhatsApp గురించి పరిచయం అక్కర్లేదు. ప్రతిరోజు కోట్లాదిమంది ఈ యాప్‌ను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇక రోజు రోజుకీ వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్ అనేక కొత్త అప్డేట్స్ ను కూడా యూజర్ల కోసం తీసుకువస్తోంది.ఈ నేపథ్యంలోనే యూజర్లకు ఎడిట్ మెసెజ్  ఫీచర్‌ తీసుకు రానున్నట్లు వాట్సాప్ యాజమాన్యం వాట్సాప్ బీటా నివేదికలో తెలిపింది.

ఎడిట్ మెసేజ్ అనేది యూజర్లు అవతలి వ్యక్తికి పంపిన తర్వాత కూడా మెసేజ్ మార్పు చేయడానికి సహాయపడుతుందని వాట్సాప్ పేర్కొంది. కాగా.. ఈ ఫీచర్ ముందుగా ఐఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెస్తామని తెలిపింది. 

వాట్సాప్ iOS యూజర్ల కోసం కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై పని చేస్తున్నామని, ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని, అతి కొద్ది మంది బీటా యూజర్లకు మాత్రమే అంటే అందులో పని చేసే వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని, రానున్న రోజుల్లో ఐఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ వివరించింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. మెటాకు చెందిన ఈ వాట్సాప్.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త అప్డేట్స్ తెస్తామని తెలిపింది.

అత్యంత ఎక్కువగా ఎదురుచూసే ఫీచర్లలో ఎడిట్ ఫీచర్ ఒకటి, ఎడిట్ మెసేజ్..  ఐఫోన్ యూజర్లు పంపిన తర్వాత ఆ మెసెజ్‌లను సవరించడానికి సహాయపడుతుంది. కాగా ఈ అప్డేట్‌ కావాలనుకునే వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్ట్‌ఫ్లైట్ యాప్‌  iOS 23.6.0.74 వెర్షన్  WhatsApp బీటాలోని వెబ్‌సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చని సమాచారం ఇచ్చింది. అయితే ఇది అన్ని ఐఫోన్లలో పని చేస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం వాట్సాప్ తెలపలేదు.

కాగా.. రాబోయే ఈ కొత్త ఫీచర్.. యూజర్ల ఇతరులకు క్షమాపణలు చెప్పే మెసేజ్ పంపకుండానే.. పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులుంటే పరిష్కరించడంలో సహాయపడుతుంది. వాట్సాప్ యూజర్లు తమ సందేశాలు స్పష్టంగా, తప్పులు, అనవసర పొరపాట్లు లేకుండా ఉండేలా చూసుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుందని తెలిపింది. అయితే, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ లాగానే, ఎడిట్ మెసేజ్‌కి కూడా కొంత టైమ్ లిమిట్ ఉంటుందని పేర్కొంది. WaBetaInfo నివేదించిన ప్రకారం, యూజర్లు సందేశాన్ని పంపిన సమయం నుండి ఎడిట్ చెయ్యడానికి  కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సవరించిన మెసేజ్ బబుల్‌లో ఎడిట్ చేసినట్లుగా.. పంపిన వారికి మరియు అవతలి వ్యక్తికి తెలియజేస్తుంది. ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని పేర్కొంది.

వాట్సాప్ తన ప్రత్యర్థి చాట్ యాప్‌‌లకు దీటుగా తన రేసును కొనసాగించడానికి ఇంకా ఎన్నో ఫీచర్లపై పని చేస్తోంది. వాట్సాప్‌లోని కాంటాక్ట్స్‌కి వీడియో మెసేజ్ పంపే ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. కాగా.. ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం అభివృద్ధి స్టేజ్‌లో ఉంది. వాయిస్ మెసేజ్ లాగా, కెమెరా బటన్‌ నొక్కగానే 60 సెకన్ల నిడివి గల వీడియోలను రికార్డ్ చేయడానికి, పంపడానికి ఈ ఫీచర్ యూజర్లకు అవకాశమిస్తుంది. అయితే, ప్రైవసీ కారణాల వల్ల యూజర్లు ఈ వీడియో సందేశాలను సేవ్ చేయలేరు. ఫార్వార్డ్ కూడా చేయలేరు.

ఐఫోన్ యూజర్లకు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఇది ఫోటోలలో ఉన్న టెక్స్ట్‌ని కన్వర్ట్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. 

మరోవైపు వాట్సాప్ డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్ స్క్రీన్ లాక్ చేసి సరికొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది.