వాట్సప్ అందుబాటులోకి తీసుకొస్తున్న జోంబీ గ్రూప్స్ ప్రత్యేకత ఏంటంటే.!?

కొత్త వాట్సాప్ తయారీ ఏమిటి? ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ తప్పనిసరి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎక్కడ చూసినా కూడా.. ప్రతి చిన్న పనికి వాట్సాప్ గ్రూపులే.. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, అంటూ రక రకాల ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్, ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్, ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఏ పిక్నిక్ ఓ ఫంక్షన్ కో, టూర్ కో వెళ్లాలంటే.. అందుకోసం వాటికి  సంబంధించిన […]

Share:

కొత్త వాట్సాప్ తయారీ ఏమిటి?

ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ తప్పనిసరి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎక్కడ చూసినా కూడా.. ప్రతి చిన్న పనికి వాట్సాప్ గ్రూపులే.. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, అంటూ రక రకాల ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్, ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్, ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఏ పిక్నిక్ ఓ ఫంక్షన్ కో, టూర్ కో వెళ్లాలంటే.. అందుకోసం వాటికి  సంబంధించిన విషయాలన్నీ చర్చించడం కోసం మరో వాట్సాప్ గ్రూప్. అకేషన్ ఏదైనా సరే.. వాట్సాప్ గ్రూప్ లో చర్చించడం తప్పనిసరి అయింది. ఇలా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న వాట్సాప్ గ్రూపులను.. ఆ పని అయిపోయిన తర్వాత వాటిని డిలీట్ చేయడం కూడా మర్చి పోతున్నారు. వారి కోసమే వాట్సాప్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది..

జోంబీ గ్రూప్స్

డిస్ అప్పియరింగ్ మెసేజెస్, వ్యూ వన్స్ ఫ్యూచర్ తరహాలో ఎక్స్పైరింగ్ గ్రూప్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ తో.. యూజర్లు తాత్కాలిక గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ ఎంపిక చేసిన నిర్ణీత కాలవ్యవధి తరువాత ఆటోమేటిగ్గా ఆ గ్రూప్ లు డిలీట్ అయిపోతాయి. వాట్సాప్ గడువు ముగిసే గ్రూప్ ఆప్షన్ గ్రూప్ సమాచారంలో చూపబడుతుంది. గడువు తేదీని ఒక రోజు, ఒక వారం లేదా ఎవరైనా కోరుకునే ఏదైనా అనుకూల తేదీకి సెట్ చేసుకోవచ్చు. కొత్త ఎక్స్పైరింగ్ గ్రూపుల ఫీచర్ వినియోగదారులు, తమ గ్రూపుల కోసం నిర్దిష్ట గడువు తేదీని సెట్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇస్తుంది. గడువు తేదీకి చేరుకున్న తర్వాత గ్రూప్ మెంబర్షిప్ లు స్వయం చాలకంగా ముగుస్తాయి. గడువు ముగింపు తేదీ చేరుకున్న తరువాత సమూహాన్ని క్లీన్ చేయమని వినియోగదారులు ప్రాంప్ట్ చేయబడతారు అని నివేదికలో తెలిపింది. 

నిర్దిష్ట విక్రయ వ్యవధి కోసం గ్రూప్స్ ను రూపొందించే చిన్న తరహా వ్యాపారాలకు ఈ ఫ్యూచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న చిన్న ఈవెంట్స్ లేదా పార్టీ ఫంక్షన్.. ఇలాంటి వేటి కోసమైనా సరే ఈ గ్రూపును నిర్ధారించుకోవచ్చు. ఇంకా టైం కూడా సెట్ చేసుకోవచ్చు.  ఇక ఈ గ్రూప్ చాట్ లో ఏదైతే సమాచారం ఇవ్వాలనుకున్నారో.. అదంతా ముగిసిన తరువాత గ్రూప్ మెంబర్ షిప్ లు స్వయంచాలకంగా ముగిసేలాగా ఫీచర్ నిర్ధారిస్తుంది. వాట్సాప్ అనేది కమ్యూనికేషన్ కోసం వ్యక్తి, వృత్తిపరమైన స్థలంలో ఉపయోగించే అతిపెద్ద విస్తృత షార్ట్ ప్లాట్ఫామ్.. పెరుగుతున్న జనాదరణ జోంబీ సమూహాలు పెరుగుదలకు దారి తీసింది. జోంబీ గ్రూప్స్ ను అవాయిడ్ చేయడానికి.. ఇవి కేవలం వన్ టైం ఈవెంట్ కోసం ఏర్పాటు చేయబడిన గ్రూప్స్, ఇవి ఆ నిర్దేశిత ఈవెంట్ ముగియగానే.. ఈ గ్రూపులో ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. ఇక వారి చాట్ కూడా డిలీట్ అయిపోతుంది. అలాగే వాట్సాప్ లో కుప్పలు తెప్పలుగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లలో ఇది ఒక్కటి కాకుండా ఉండడానికే.. ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని బీటా అప్డేట్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫ్యూచర్ అందుబాటులోకి రానుంది.