ఫార్వర్డెడ్ మెసేజ్‌కి కూడా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు: వాట్సాప్

మెటా-యాజమాన్యమైన వాట్సాప్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది, ఆండ్రాయిడ్‌లో ఫార్వార్డెడ్ ఇమేజ్‌లు, వీడియోలు, GIFలు మరియు డాక్యుమెంట్‌లకు డిస్క్రిప్షన్ యాడ్ చేసుకునేలా  యూజర్స్‌కి వెసులుబాటు కల్పించింది. కాగా.. ఇది ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. WABetaInfo ప్రకారం.. ఒకవేళ ఇప్పటికే పంపిన మెసేజ్ డిస్క్రిప్షన్ క్నాగ్ చెయ్యాలన్నా,  లేదా సరిగ్గా  డిస్క్రిప్షన్‌లో సరిగా వివరించనట్లయితే, మీరు వేరే డిస్క్రిప్షన్ జోడించాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మరోవైపు, ఇప్పటికే ఉన్న డిస్క్రిప్షన్ తీసివేసి, దాని […]

Share:

మెటా-యాజమాన్యమైన వాట్సాప్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది, ఆండ్రాయిడ్‌లో ఫార్వార్డెడ్ ఇమేజ్‌లు, వీడియోలు, GIFలు మరియు డాక్యుమెంట్‌లకు డిస్క్రిప్షన్ యాడ్ చేసుకునేలా  యూజర్స్‌కి వెసులుబాటు కల్పించింది. కాగా.. ఇది ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

WABetaInfo ప్రకారం.. ఒకవేళ ఇప్పటికే పంపిన మెసేజ్ డిస్క్రిప్షన్ క్నాగ్ చెయ్యాలన్నా,  లేదా సరిగ్గా  డిస్క్రిప్షన్‌లో సరిగా వివరించనట్లయితే, మీరు వేరే డిస్క్రిప్షన్ జోడించాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

మరోవైపు, ఇప్పటికే ఉన్న డిస్క్రిప్షన్ తీసివేసి, దాని స్థానంలో మీ స్వంత డిస్క్రిప్షన్‌ రాసి కూడా మెసేజ్ పంపవచ్చు. యూజర్లు  ఇప్పుడు వారు పంపే..  ఫార్వార్డ్ చేసిన మీడియాకు మరింత  డిస్క్రిప్షన్ జోడించగలరు.  ఇది వారు మీడియాను ఎందుకు ఫార్వార్డ్ చేశారనే దాని గురించి క్లుప్త వివరణను అందించడానికి మరియు కంటెంట్ గురించి వారి ఆలోచనలు, అభిప్రాయాలు లేదా భావాలను కూడా పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

అంతేకాకుండా.. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, కొంతమంది యూజర్లు స్టేటస్ అప్‌డేట్‌లను చూసేటప్పుడు మరియు వీడియోలను డౌన్‌లోడ్ చేసేటప్పుడు కొంతమేర  సమస్యలను ఎదుర్కొంటారని నివేదిక పేర్కొంది.

ఇంతలో.. వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో తన తాజా అప్‌డేట్‌లో అన్ని బీటా టెస్టర్‌లకు “కంపానియన్ మోడ్” ఫీచర్‌ను విడుదల చేసింది.

ఇంతకు ముందు, కంపానియన్ మోడ్ ఎంపిక చేయబడిన బీటా టెస్టర్‌లకి మాత్రమే అందుబాటులో ఉండేది.

ఈ ఫీచర్, మల్టిపుల్ డివైజ్ కు మద్దతు యొక్క పొడిగింపు. అంటే యూజర్లు వారి ప్రస్తుత WhatsApp అకౌంట్ ను మరొక మొబైల్ ఫోన్‌కి లింక్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్. 

WhatsApp అనేది మెసేజ్‌లు పంపడం, వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయడం, ఫైల్‌లను షేర్ చేయడం మరియు మరిన్నింటిని చేయడానికి వినియోగదారులను అనుమతించే ఒక ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్. 

దీనిని  2009లో ఇద్దరు మాజీ యాహూ ఉద్యోగులు, జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టన్ డెవలప్ చేశారు. ఆ తరువాత ఈ సంస్థను 2014లో Facebook సంస్థలో విలీనం చేసుకున్నారు. అప్పటి నుండి 2021 నాటికి WhatsApp రెండు బిలియన్లకు పైగా  యాక్టీవ్ యూజర్లతో ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజ్ యాప్‌లలో ఒకటిగా మారింది. 

వాట్సాప్ జనాదరణకు కారణం దాని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. ఈ యాప్ సరళమైనదే కాకుండా దీనిని ఉపయోగించడం చాలా సులువు. ఇది అన్ని వయసుల వారికీ, అన్ని సాంకేతిక- అవగాహనా స్థాయి గల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి తోడుగా, WhatsApp ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది, అంటే మెసేజస్ పంపినవారి డివైజ్‌లో  గుప్తీకరించబడతాయి.  రిసీవ్ చేసుకునే యూజర్ మాత్రమే డీక్రిప్ట్ చేయగలరు. కమ్యూనికేట్ చేయడానికి ఇది సాధారణ SMS కంటే కూడా సురక్షితంగా ఉంటుంది.

వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్ కంటే ఎక్కువ ఫీచర్లు కూడా అందిస్తుంది. యూజర్లు  ఒకరితో ఒకరు మరియు గ్రూప్‌లలో వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు మరియు డాక్యుమెంట్స్ వంటి ఫైల్‌లను షేర్ చెయ్యవచ్చు. అదనంగా WhatsApp “స్టేటస్” ఫీచర్‌ను కలిగి ఉంది, దీనిలో కూడా ఇన్‌స్టాగ్రామ్ లేదా స్నాప్‌చాట్ స్టోరీస్ మాదిరిగానే 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే అప్డేట్స్ పోస్ట్ చేసుకోవచ్చు.