Whatsapp: వాట్సప్ అందిస్తున్న కొత్త ఫీచర్

ఇకపై మరిన్ని ఆప్షన్స్..

Courtesy: Twitter

Share:

Whatsapp: ఒకప్పుడు మెసేజ్ పంపాలంటే చాలా కష్టంగా ఉండేది. అదే టైంలో వాట్సప్ (Whatsapp)  విడుదలైంది. వాట్సాప్ (Whatsapp) విడుదలయ్యాక వేరే సోషల్ మీడియా సైట్స్ అన్ని డౌన్ అయ్యాయి. ఇందులో సులువుగా మెసేజ్ చేయొచ్చు. మొబైల్ (Mobile) డేటా ఆన్ చేస్తే చాలు మనం చేసే మెసేజ్ వేరే వాళ్లకు వెళుతుంది. వాళ్లు మొబైల్ (Mobile) డేటా ఆన్ చేస్తే మనం పంపిన మెసేజ్ వాళ్లకు రీచ్ అవుతుంది. దీన్ని చాలా సులువుగా వాడొచ్చు. ఎన్నో ఫీచర్స్ (Feature) తీసుకు వచ్చిన వాట్సాప్ (Whatsapp) ఇప్పుడు మరో వెసులుబాటు కనిపిస్తోంది. మన వాట్సాప్ (Whatsapp) ఈమెయిల్ ఐడి తో లింక్ చేసుకునే వెసులుబాటు. 

వాట్సప్ అందిస్తున్న కొత్త ఫీచర్: 

ఇప్పటివరకు మన మొబైల్ (Mobile) ఫోన్ నెంబర్ ఉపయోగించి వాట్సాప్ (Watsapp) అకౌంట్ లో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు, మన ఈమెయిల్ ఐడి ద్వారా వాట్సాప్ (Watsapp) ఉపయోగించే వెసులుబాటు కనిపిస్తోంది వాట్సాప్ (Watsapp) కొత్త ఫీచర్ (Feature). అయితే ఈ కొత్త విధానం బట్టి, మన కాంటాక్ట్స్ లో ఉన్న ఇతరులకు మన ఈమెయిల్ అడ్రస్ కనిపించే అవకాశం ఉండదు. మీ వాట్సాప్ (Watsapp) అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ కి లింక్ చేసుకోవాలంటే, మీరు మీ iPhoneలోని యాప్ (App) స్టోర్ నుండి WhatsApp తాజా వెర్షన్‌ను యూస్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. . ఒకవేళ పాత వర్షన్ ఉపయోగిస్తున్నట్లయితే iOS 2.23.24.70 అప్‌డేట్ కోసం WhatsAppను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి, మీ ఇమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవడానికి > ఇమెయిల్ అడ్రస్ అంటే చేయండి అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఈ నెల ప్రారంభంలో ఆండ్రాయిడ్, iOS యాప్ (App) బీటా వెర్షన్‌లలో ఈ ఫీచర్ (Feature) అందుబాటులో ఉంది కాబట్టి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. 

ఈ కొత్త ఫీచర్ (Feature) ముఖ్యంగా వాట్సాప్ (Watsapp) తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఒకవేళ మీరు వాట్సాప్ (Watsapp) ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే, అదే సమయంలో మొబైల్ (Mobile) నెట్వర్క్ పరిధిలో లేకపోతే, అటువంటి సమయంలో మీ ఈమెయిల్ అడ్రస్ కు ఎస్ఎంఎస్ కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ మీరు సులువుగా వాట్సాప్ (Watsapp) లోకి లాగిన్ అవ్వచ్చు. 

వాట్సప్ గురించి మరింత: 

వాట్సాప్ (Watsapp) ఫీచర్లు (Feature) కూడా అందరికీ అర్థమవుతాయి. ప్రస్తుతం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు వాడే ఏకైక అప్లికేషన్ వాట్సప్. వాట్సప్ అందుబాటులోకి వచ్చాక ఫోన్లలో మెసేజ్ చేసుకోవడం తగ్గింది. ఏ అవసరం ఉన్నా అందరూ వాట్సాప్ (Watsapp) ఏ వాడుతున్నారు. ఇప్పుడు వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఎవరు ఉండరు. వాట్సప్ ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకుందాం. ముందుగా మనం వాట్సప్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మన మొబైల్ (Mobile) నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన మొబైల్ (Mobile) కి ఒక మెసేజ్ వస్తుంది. అదే ఓటీపీ. ఆ ఓటిపి వాట్సాప్ (Watsapp) లో ఎంటర్ చేస్తే మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం మన డీటెయిల్స్ ని కూడా ఈ అకౌంట్ కి జత చేయాలి. తర్వాత మన కాంటాక్ట్స్ లో ఎవరెవరు వాట్సాప్ (Watsapp) వాడుతున్నారో తెలుసుకోవాలంటే ముందు మనం సెర్చ్ బటన్ ఆన్ చేయాలి. వాట్సాప్ (Watsapp) ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపిస్తుంది. దీంతో మనం వాళ్లకు మెసేజ్ చేయొచ్చు. వాళ్లు మొబైల్ (Mobile) డేటా ఆన్ చేస్తే మన మెసేజ్ వాళ్లకు రీచ్ అవుతుంది. వేరే ఏ అప్లికేషన్ లో ఇంత సులువైన ఆప్షన్స్ లేవు. వాట్సాప్ (Watsapp) అందుకే గ్రేట్ అప్లికేషన్ అయింది. అందుకే వాట్సాప్ (Watsapp) మెసెంజర్ కింగ్ అయింది. ప్రస్తుతం అయితే వాట్సాప్ (Watsapp) ని మించిన యాప్ (App) లేదు. వాట్సప్ ఒక గొప్ప అప్లికేషన్. వీళ్ళు యూజర్ల కోసం అప్లికేషన్ ని మరింత అప్డేట్ చేస్తుండడం శుభపరిణామం. వాట్సాప్ (Watsapp) మన ముందుకు మరిన్ని ఫీచర్లు (Feature) తేవాలని కోరుకుందాం.