వాట్సాప్ నుంచి ఆడియో చాట్ ఫీచర్..

ఇకనుంచి వాట్సాప్  మెసేజ్ చేయాలంటే టైప్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ చాట్ వివరాలివే…  ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఫీచర్ లను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది తాజాగా మరో లేటెస్ట్ ఫీచర్స్ తో తన వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడటం తప్పనిసరి.. ఇక వాట్సాప్ అన్న తర్వాత చాటింగ్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. ఇక ఆ చాటింగ్‌ని కూడా సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్‌ని […]

Share:

ఇకనుంచి వాట్సాప్  మెసేజ్ చేయాలంటే టైప్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ చాట్ వివరాలివే… 

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఫీచర్ లను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది తాజాగా మరో లేటెస్ట్ ఫీచర్స్ తో తన వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడటం తప్పనిసరి.. ఇక వాట్సాప్ అన్న తర్వాత చాటింగ్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. ఇక ఆ చాటింగ్‌ని కూడా సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ ఆ విశేషాలు, వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

నో టైపింగ్..

వాట్సాప్‌లో చాటింగ్ చేసేందుకు ఇక నుంచి టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టైప్ చేసే అవసరం లేకుండానే చాటింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఆ కొత్త ఫీచర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆడియో చాట్స్..

వాట్సాప్ ఇప్పుడు ఆడియో చాట్స్ పేరుతో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. త్వరలో ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో అందుబాటులో రానుంది. చాచ్ హెడర్‌లో కొత్తగా వేవ్‌ఫార్మ్ యాడ్ చేయనున్నట్లు Wabetainfo తెలిపింది. వాట్సాప్‌లో ఈ ఏడాది కొత్త పీచర్లు చాలా వరకూ రానున్నాయి. ఈ నెలలో కూడా కొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టనునట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ సహాయంతో చాటింగ్ శైలి పూర్తిగా మారనుంది. వాట్సాప్ ఇప్పుడు ఆడియో చాట్స్ ఫీచర్‌‌పై పనిచేస్తోంది. దీని సహాయంతో యూజర్లు ఆడియో చాట్ చేయవచ్చు.

ఫీచర్స్.. 

Wabetainfo తెలిపిన వివరాల ప్రకారం..  వెవ్‌ ఫార్మ్ ఐకాన్ రియల్ టైమ్ ఆడియో విజ్యువలైజేషన్ సాధ్యాసాధ్యాల్ని ప్రతిబింబిస్తుంది. కొత్త ఫీచర్ ఒక ఇంటర్‌ ఫేస్ అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందనే వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్‌ పై ఇంకా పని జరుగుతోంది. విండోస్ కోసం కూడా మెటా కొత్త వాట్సప్ అప్లికేషన్ అందిస్తోంది. వాట్సప్ యూజర్లు ఇప్పుడు గరిష్టంగా 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయవచ్చు. కనిష్టంగా 32 మందితో ఆడియో కాల్ హోస్ట్ చేయవచ్చు..

రియల్ టైమ్ ఆడియో విజువలైజేషన్..

వాట్సాప్ ఆడియో చాట్ ఫీచర్‌‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను వాట్సాప్‌ బీటా ఇన్‌ ఫో షేర్ చేసింది. దాన్ని బట్టి చూస్తే..  క్లిక్ చేస్తే స్పెషల్ ఆడియో చాట్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌ కేవలం గ్రూప్ చాట్స్‌‌లోనే ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. వాయిస్ కాల్స్ ఎండ్ బటన్‌ ఒక పక్కకు ఉన్నట్లు స్క్రీన్‌ షాట్స్‌లో కనిపిస్తోంది. దీంతో వాయిస్ చాట్స్ రన్ అవుతున్నప్పుడు వేవ్‌ ఫారమ్స్ కనిపించేలా తగినంత స్పేస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక వేవ్‌ ఫారమ్స్‌ లైవ్‌లోకి వస్తే.. యూజర్లు సంభాషణ చేస్తున్నప్పుడు రియల్ టైమ్ ఆడియో విజువలైజేషన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఆడియో విజువలైజేషన్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. యూజర్లు సంభాషణ చేస్తున్నప్పుడు ఆడియో వేవ్‌ ఫారమ్‌‌లు చూసేందుకు వినియోగదారులకు మినిమలిస్టిక్ ఇంటర్‌‌ఫేస్‌‌ను వాట్సాప్ అందిస్తుంది. ఇతర యుటిలిటీ ఫంక్షన్స్‌ కోసం డెవలపర్లు మిగిలిన స్పేస్‌ను వాడనున్నట్లు స్క్రీన్‌‌షాట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లకు ఏ మేరకు మంచి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.