వాట్సప్ సరికొత్త ఫీచర్

ఇన్ స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్లను పరిచయం చేస్తున్న వాట్స్అప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో వినియోగదారులను మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల వాట్సప్ తన యూజర్ లందరికీ హై క్వాలిటీ ఫోటోలను పంపించేందుకు వీలు కల్పించింది. తాజాగా హై క్వాలిటీ వీడియోలను పంపే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తుంది. వాట్సప్ యూసర్లకు మెరుగైన మల్టీ మీడియా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ […]

Share:

ఇన్ స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్లను పరిచయం చేస్తున్న వాట్స్అప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో వినియోగదారులను మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల వాట్సప్ తన యూజర్ లందరికీ హై క్వాలిటీ ఫోటోలను పంపించేందుకు వీలు కల్పించింది. తాజాగా హై క్వాలిటీ వీడియోలను పంపే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తుంది. వాట్సప్ యూసర్లకు మెరుగైన మల్టీ మీడియా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటాలో టెస్టింగ్ లో ఉండగా ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూసర్లు ప్రయత్నించవచ్చు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

హై క్వాలిటీ ఫోటోలను పంపే విధంగానే వీడియోల కోసం అప్డేట్ చేసిన వాట్సాప్ వర్షన్ కూడా యాప్ డ్రాయింగ్ ఎడిటర్ లో HD బటన్ ను చూపిస్తుంది. ఈ వీడియోను పంపే ముందు యూసర్లు రెండు వీడియో క్వాలిటీ సెట్టింగ్ల మధ్య ఎంచుకునే అవకాశం ఉంటుంది . డిఫాల్ట్ గా డేటా వినియోగం స్టోరేజ్ స్పేస్ తగ్గాలంటే వాట్సాప్ వీడియోలను కంప్రెస్ చేస్తుంది. అయితే హై క్వాలిటీ తో వీడియోలను పంపేందుకు యూజర్లను అనుమతిస్తుంది. రియల్ క్వాలిటీ మాదిరిగా లేకపోయినప్పటికీ క్వాలిటీ వీడియో మాత్రం నాణ్యతతో ఉంటుంది. 

ఉదాహరణకు ప్రామాణిక క్వాలిటీలో వీడియో స్క్రీన్ షాట్ ల రూపంలో 416 × 880 పిక్సెల్ ల కొలతలు, 6.3 MB  సైజ్ కలిగి ఉండవచ్చు. కానీ HD వెర్షన్ 608 × 1296 పిక్సెల్ ల కొలతలు, 12MB  సైజ్ కలిగి ఉంటుంది ఈ కొత్త ఫీచర్ ను యాక్సిస్ చేసేందుకు వాట్స్అప్ యూసర్లు బీటా వెర్షన్ ను ఆండ్రాయిడ్ 2.23.14.10  కు అప్డేట్ చేసుకోవాలి. వాట్సప్ ఇప్పుడు బేటా టెస్ట్లను కాంటాక్ట్లతో 100 ఫోటోల వరకు షేర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. ఫీచర్ యాప్ స్టేబుల్ వర్షన్ లో ఇంకా రాలేదు . వాట్సప్ యూసర్లు ఒకేసారి చాలా ఫోటోలను షేర్ చేయడం చాలా సులభం. ప్రస్తుతం ఈ లిమిట్ 30 కి సెట్ చేసింది . వాట్స్అప్ యూసర్లు కొన్ని ఈవెంట్లను షేర్ చేసేందుకు వందలాది ఫోటోలను కలిగి ఉంటే షేరింగ్ లిమిట్ చాలా తక్కువ ఉన్నందున ఫోటోలను షేర్ చేసే ప్రక్రియను రీస్టార్ట్ చేయాలి. 

HD ఫొటోస్ ఫీచర్ తో కూడా యూసర్లు ఒరిజినల్ డిమాండ్లతో క్వాలిటీ ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ తో ఫోటో సెండ్ చేసినప్పుడు మెసేజ్ బబుల్ లో హెచ్డి అనే ఓ టాక్ అనిపిస్తుంది. తద్వారా అది హై క్వాలిటీ ఫోటోగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ ట్యాగ్ వీడియోల మెసేజ్ బబుల్లో కూడా కనిపించడాన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సప్ బీటా టెస్టర్ లు కనుగొన్నారు. వీడియోలను వాటి ఒరిజినల్ క్వాలిటీలో షేర్ చేయలేకపోయినా కొత్త ఫీచర్ తో వీడియోల ఫైనల్ క్వాలిటీ ఇప్పటితో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే కొత్తగా ఇవ్వటం వలన అందుబాటులోకి వచ్చిన వీడియోల షేరింగ్ విషయంలో డిఫాల్ట్ సెట్టింగ్ స్టాండర్డ్ క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి యూజర్ మెరుగైన నాణ్యతతో వీడియోను షేర్ చేయాలనుకున్న ప్రతిసారి HD క్వాలిటీ ఆప్షన్ ను మాన్యువల్ గా ఎంచుకోవాలి. ఈ ఫీచర్ తమకు కూడా లాంచ్ అయిందో లేదో చెక్ చేయడానికి యూజర్లు లార్జ్ సైజ్ వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న వీడియోలకు హెచ్డి క్వాలిటీ ఆప్షన్ కనిపించకపోవచ్చు. ముందుగా చెప్పినట్టు యూజర్స్ HD క్వాలిటీ ఆప్షన్ ను ఉపయోగించి వీడియోను షేర్ చేసినప్పుడు అది కన్వర్జేషన్ లో HD వీడియో గా లేబుల్ అయి కనిపిస్తుంది. హై క్వాలిటీ ఫోటోల మాదిరిగానే వీడియో మెసేజ్ బబుల్ కు ట్యాగ్ ఆటోమేటిగ్గా యాడ్ అవుతుంది. ఇది వీడియో మెరుగైన క్వాలిటీ తో సెండ్ అయినట్లు సూచిస్తుంది. అయితే స్టేటస్ అప్డేట్ల ద్వారా హై క్వాలిటీ వీడియోలను షేర్ చేయడానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. హై క్వాలిటీ ఫీచర్ ద్వారా మెరుగైన క్వాలిటీతో వీడియోలను షేర్ చేయగల సామర్థ్యం ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ వాట్సప్ బీటాను ఇన్స్టాల్ చేసిన బీటా టెస్టర్లకు రిలీజ్ అవుతుంది . మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.