21 కొత్త ఎమోజీలు.. నెంబర్ల బదులు పేర్లు.. వాట్సాప్ అదిరిపోయే అప్డేట్స్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ లేకుంటే పొద్దే గడవదు. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌హై క్లాస్ ఫీచర్లతో ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్లను సంపాదించుకుంటుంది. బంధువులు, స్నేహితులు కుటుంబ సభ్యులతో సులువుగా కమ్యూనికేట్ కావడానికి, మీడియా షేర్ చేసుకోవడానికి వాట్సాప్‌లో ఎన్నో ఆప్షన్స్‌ను అందిస్తోంది. హై ప్రైవసీ ఫీచర్స్ మంచి సెక్యూరిటీ కూడా అందిస్తోంది. అలాగే యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు వరుసగా […]

Share:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ లేకుంటే పొద్దే గడవదు. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌హై క్లాస్ ఫీచర్లతో ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్లను సంపాదించుకుంటుంది. బంధువులు, స్నేహితులు కుటుంబ సభ్యులతో సులువుగా కమ్యూనికేట్ కావడానికి, మీడియా షేర్ చేసుకోవడానికి వాట్సాప్‌లో ఎన్నో ఆప్షన్స్‌ను అందిస్తోంది. హై ప్రైవసీ ఫీచర్స్ మంచి సెక్యూరిటీ కూడా అందిస్తోంది. అలాగే యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. వాట్సాప్ 21 కొత్త ఎమోజీలను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా చిన్నచిన్న మార్పులతో కూడిన 8 ఏమోజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.. అంతేకాకుండా మరో కొత్త ఫీచర్‌ని కూడా పరిచయం చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

21 ఏమోజీలు

వాట్సాప్ ట్రాకర్ WABetaInfo బీటా ఇన్ఫో  చెప్పిన ప్రకారం.. ఆండ్రాయిడ్ డివైస్‌లలో ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా ఇన్స్టాల్ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న బీటా టెస్టర్‌లకు కొత్త ఎమోజీలు అందుబాటులోకి వస్తాయి. కాకపోతే ఈ ఎమోజీలు ప్రతి ఒక్కరికి కనిపించవు. ఇవి దశలవారీగా మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

యూనికోడ్ 15.0 నుంచి 21 కొత్త ఎమోజీల గురించి సరికొత్త సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేసింది. అయితే 21 ఎమోజీలు డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉండడంతో కీబోర్డ్‌లో కనిపించలేదు. ఆల్టర్నేటివ్ కీబోర్డ్‌ను ఉపయోగించి వాటిని సెండ్ చేయాలని తెలిపాము. కానీ, ఇప్పుడు బీటా టెస్టర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ 2.23.5.13 వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇందులో అఫీషియల్ వాట్సాప్ కీబోర్డ్‌లో బీటా టెస్టర్‌లు కొత్త ఎమోజీలను చూడవచ్చు అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, మీరు కూడా ఈ 21 ఎమోజిల ఫీచర్‌ని యూస్ చేస్తూ ఎంజాయ్ చేయమని కంపెనీ తెలిపింది. యూజర్లు కొత్త ఎమోజీలను రిసీవ్ చేసుకున్నారు. అయితే వాటిని పంపించడానికి ఏమైనా అడ్డంకులు ఎదురైతే బీటా ఇన్ఫో‌కి సమాచారం అందించమని తెలిపింది. 

మరో లేటెస్ట్ ఫీచర్

వాట్సాప్.. కొత్త గ్రూప్ చాట్ ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. కొత్త పార్టిసిపెంట్లను ఎలా అప్రూవ్ చేయాలో.. మెసేజ్ చేయడానికి గ్రూప్ సెట్టింగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ వారి గ్రూప్‌లలో కొత్త సభ్యుల అప్రూవల్ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకోవచ్చు. వారికి మేనేజ్ కూడా చేయవచ్చు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే గ్రూప్‌లో ఎవరైనా కొత్తగా చేరాలని ప్రయత్నిస్తే.. అడ్మినిస్ట్రేటర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. అలాగే కొత్త వారు మెసేజ్ చేసినప్పుడు వారి పేరు కూడా కనిపించే విధంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపై గ్రూపుల్లో వారి ఫోన్ నెంబర్లకు బదులు, అక్కడ వారి పేరు మీకు కనిపిస్తుంది. ఇక ఎవరు పంపారో అవతలి వ్యక్తి పేరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ అప్డేట్‌తో మీకు మెసేజ్ చేసినా వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. అక్కడ వారి ఫోన్ నెంబర్ బదులు డైరెక్ట్‌గా పేరే కనిపిస్తుంది. వ్యక్తిగత చాట్‌లో ఈ ఫీచర్ పనిచేయదు. గ్రూప్ చాట్‌లో సౌలభ్యం కోసం మాత్రమే ఈ అప్డేట్ తీసుకొచ్చింది.