గూగుల్ ఫోటోలలో మ్యాజిక్ ఎరేజర్ గురించి మీకు తెలుసా.. ఎలా వాడాలంటే..?

ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ముందుగా గూగుల్ పిక్సెల్ పరికరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ఫొటోస్ లో మనకు నచ్చని ఫోటోలను, లేదా.. ఫోటోలలో మనకి నచ్చని వ్యక్తులను, వస్తువులను డిలీట్ చేయడానికి ఈ మ్యాజిక్ ఎరేజర్ చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ముందుగా గూగుల్ పిక్సెల్ పరికరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ తో సహా ఇతర స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావడం […]

Share:

ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ముందుగా గూగుల్ పిక్సెల్ పరికరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

గూగుల్ ఫొటోస్ లో మనకు నచ్చని ఫోటోలను, లేదా.. ఫోటోలలో మనకి నచ్చని వ్యక్తులను, వస్తువులను డిలీట్ చేయడానికి ఈ మ్యాజిక్ ఎరేజర్ చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ముందుగా గూగుల్ పిక్సెల్ పరికరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ తో సహా ఇతర స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక ఆప్షన్ కేవలం స్మార్ట్ ఫోన్ ఫీచర్ మాత్రమే. ఇది యూజర్స్ యొక్క అనుభవాలను పూర్తిగా మెరుగుపరుస్తుంది.

స్మార్ట్ ఫోన్లో ఫోటోగ్రఫీ ఫీచర్ల గురించి ఎక్కువగా మాట్లాడే వాటిలో ఇది కూడా ఒకటి.  2021 లోనే గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లోకి అందుబాటులోకి వచ్చినా.. ఈ ఫీచర్ ఇప్పుడు అటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ఫోటోగ్రాఫ్ లేదా ఫోటోలలో చోటు లేని వస్తువులు, వ్యక్తులు లేదా ఇతర వస్తువులను గుర్తించి వాటిని తొలగించాలని మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు చూసిన ఫోటోలలో మీకు ఏదైనా తొలగించాలని అనిపించిన, లేదా.. తీసి వేయాలని అనిపించినా సరే ఆ ప్రాంతాన్ని మాన్యువల్ గా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ప్రాంతాన్ని మ్యాజిక్ ఎరేజర్ తొలగించేస్తుంది. ఒకవేళ మ్యాజిక్ ఎరేజర్ మీరు పేర్కొన్న ప్రాంతాన్ని తొలగించే ముందు వస్తువు లేదా దృశ్యం లేకుండా ఉంటే ఆ ఫోటో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తుంది. ఆ తర్వాత మీరు దానిని ఎరేజ్ చేసుకోవచ్చు.

ఒకరకంగా చెప్పాలంటే ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ఫోటోలను మభ్య పెట్టడం లాంటిది అని చెప్పవచ్చు. అక్కడ ఉన్నది లేనట్టుగా. లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. ఫోటోలలోని నిర్దిష్ట వస్తువుల రంగును మార్చడంలో ఈ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ ని ఉపయోగించే వినియోగదారులు ఖచ్చితమైన, అందమైన ఫోటోలను సృష్టించవచ్చు. ఇకపోతే గూగుల్ ఫోటోలలో మ్యాజిక్ ఎరేజర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1: ముందుగా గూగుల్ ఫోటోలు అప్లికేషన్ను ఓపెన్ చేయండి.

స్టెప్2: మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని.. బలమైన అల్లికలతో మీరు ఫోటోను ఎంచుకోవాలి.

స్టెప్ 3 : స్క్రీన్ దిగువన ఎడిట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి, టూల్స్ కేటగిరీలో మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.

స్టెప్ 4: ఇప్పుడు ఫోటోను స్కాన్ చేసి మీరు తొలగించాలనుకున్న విషయాలను అందులో సూచించండి. ఒక్కొక్కటిగా విడివిడిగా నొక్కవచ్చు లేదా అన్నీ ఒకేసారి ఎరేజ్ చెయ్యి అని కూడా చెప్పవచ్చు. టాపిక్  పై స్ట్రోక్ చేయడం ద్వారా మీరు తీసివేయాలనుకుంటున్న వస్తువును లేదా వ్యక్తిని మాన్యువల్ గా హైలెట్ చేయవచ్చు.

స్టెప్ 5: ఇప్పుడు దానిని ఉపయోగించడానికి ఎరేజ్ కి బదులుగా మభ్యపెట్టడం అనే ఆప్షన్ను ఎంచుకోండి.  ఈ ఫీచర్ మీ నేపథ్యానికి సరిపోయేలా వస్తువు లేదా వ్యక్తి యొక్క రంగును మారుస్తుంది.

స్టెప్ 6: గూగుల్ వన్ కి సభ్యత్వం పొందడం వల్ల వినియోగదారులు ఈ గూగుల్ పిక్చర్స్ లో ఈ ఫీచర్ కి యాక్సెస్ పొందుతారు. గూగుల్ వన్,  మ్యాజిక్ ఎరేజర్ తో పాటు అదనపు క్లౌడ్ నిల్వ మరియు పోర్ట్రైట్ లైట్ ని కూడా అందిస్తుంది.

ఇకపోతే ఈ ఫీచర్ను యాక్సెస్ చేయడానికి ఖర్చు అవుతుంది.  కానీ గూగుల్.. మార్చిలో గూగుల్ వన్ యొక్క ఉచిత ట్రయల్ ను అందించడం ప్రారంభించింది.  ఈ ట్రయల్ ఇప్పటికే సభ్యత్వం పొందని ఎవరికైనా సరే అందుబాటులో ఉంటుంది.