వివో – Vivo ఫ్లాగ్‍షిప్ ఫోన్లు వచ్చేశాయి

Vivo స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడూ జనాల ఆసక్తిని రెట్టింపు చేస్తాయి. ఇందులో భాగంగా కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను X90 సిరీస్ క్రింద ఇటీవల ఆవిష్కరించింది. X90 సిరీస్ ప్రో వేరియంట్‌ను కలిగి ఉంది. తాజా Vivo X90 ప్రోలో పెద్ద కెమెరా మాడ్యూల్, వెనుక భాగం కళ్లు చెదిరే బ్లాక్ వేగన్ లెదర్‌ను కలిగి ఉంది. కాగా అదే ధరలో దొరికే Qualcomm-బేస్డ్ ఫోన్‌లతో వీవో ఎలా పోటీ పడుతుందో చూద్దాం.  Vivo X90 Pro […]

Share:

Vivo స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడూ జనాల ఆసక్తిని రెట్టింపు చేస్తాయి. ఇందులో భాగంగా కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను X90 సిరీస్ క్రింద ఇటీవల ఆవిష్కరించింది.

X90 సిరీస్ ప్రో వేరియంట్‌ను కలిగి ఉంది. తాజా Vivo X90 ప్రోలో పెద్ద కెమెరా మాడ్యూల్, వెనుక భాగం కళ్లు చెదిరే బ్లాక్ వేగన్ లెదర్‌ను కలిగి ఉంది. కాగా అదే ధరలో దొరికే Qualcomm-బేస్డ్ ఫోన్‌లతో వీవో ఎలా పోటీ పడుతుందో చూద్దాం. 

Vivo X90 Pro డిజైన్ మరియు కెమెరా పనితీరు

Vivo యొక్క తాజా ఫ్లాగ్‌షిప్, X90 ప్రో, రౌండ్ కెమెరా హౌసింగ్, వేగన్ లెదర్ బ్యాక్‌తో ప్రత్యేకమైన డిజైన్‌ కలిగి ఉంది. ఇది ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫోన్ కి ముందు, వెనుక ప్యానెల్‌లు, సున్నితమైన కర్ప్ తో  సన్నని మెటల్ ఫ్రేమ్‌ ఉంటుంది. ఇది ఫోన్‌‌కి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

 X90 ప్రో యొక్క వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడినప్పటికీ, పాత మోడళ్లలో కనిపించే సాంప్రదాయ గాజు మరియు సిరామిక్ బ్యాక్‌ ఇప్పుడు చెయ్యట్లేదు. దీని వెనుక భాగం లెదర్ మెటల్‌తో కవర్ అయ్యి ఉండటం చాలా అందంగా కనిపిస్తుంది. కాగా వీవోలో ఇటివల వచ్చిన మార్పులలో ఇది గొప్ప మార్పు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, X90 ప్రో దుమ్మును, నీటిని నిరోధించేలా IP68-రేట్ చేయబడింది.

ఫోన్ ముందు ప్యానెల్ పైభాగంలో చిన్న చిల్లులు ఉన్నాయి. అటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అదనంగా, X90 ప్రో రెండు స్పీకర్‌లను కలిగి ఉంది. ఒకటి డిస్ప్లే పైన మరియు ముందు వైపున ఉంటే, మరొకటి X90 ప్రో డిస్ప్లే వెనుక ఒక ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కింద ఉంది. ఇది ల్యాగ్ లేకుండా మంచిగా పనిచేస్తుంది. కింద SIM స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్, USB-C పోర్ట్ ఉన్నాయి.

కుడి వైపున, వాల్యూమ్ బటన్, పవర్ బటన్‌ ఉంటాయి. ఎడమ వైపు ఎటువంటి కంట్రోల్స్ లేవు. 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో మరియు 12MP అల్ట్రావైడ్ కెమెరాలు, అలాగే ఆటోఫోకస్ కోసం లేజర్ ఎమిటర్, రిసీవర్‌తో కూడిన పెద్ద, మందపాటి రౌండ్ కెమెరా మాడ్యూల్‌తో ఫోన్ వెనుక భాగం అమర్చబడి ఉంది.

Vivo X90 Pro యెక్క పనితీరు

మీరు ప్రత్యేకంగా వెతికితే తప్ప,ఈ ఫోనులో ఎలాంటి మైనస్‌ లేవు. 120Hz (LTPO కాని) రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.2K AMOLED డిస్‌ప్లే చక్కగాను, బ్రైట్ గాను ఉంటుంది. ప్యానెల్ 10 బిట్ కలర్ డెప్త్‌ను అవుట్‌పుట్ చేయగలదు మరియు HDR10+ ప్లేబ్యాక్‌కు మంచి మద్దతు ఇస్తుంది.

బ్యాటరీ:

కొత్త Vivo X90 Pro 4,870mAh బ్యాటరీ సామర్ధం కలిగి ఉంది . ఇది Vivo X80 Proలో 4,700mAh నుండి పెరిగింది. బ్యాటరీ రెండు వేర్వేరు సెల్‌లుగా విభజించబడింది కాబట్టి ఇది వేగవంతమైన 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సహకరిస్తుంది.

కాగా ఫోన్‌తో 120W ఛార్జర్‌తో పంపబడుతుంది. ఛార్జర్ దాదాపు అరగంటలో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయగలిగింది. ఫోన్ 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సహకరిస్తుంది.

Vivo X90 Pro యెక్క ధర

కాగా భారతదేశంలో Vivo X90 Pro 12GB/256GB ధర రూ.84,999గా నిర్ణయించినట్లు వీవో ప్రతినిధులు తెలిపారు.