టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ఛార్జ్ చేయనున్న ట్విట్టర్

టెక్స్ట్ మెసేజ్‌.. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ఛార్జ్ చేయనుందని ట్విట్టర్‌ సపోర్ట్ నుంచి వచ్చిన ట్వీట్ లో పేర్కొంది, “మార్చి 20, 2023 నుండి.. ట్విట్టర్‌  బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించగలరని” ట్వీట్ చేసింది. మిగిలిన యూజర్‌లు 2FA కోసం అథెంటిక్ యాప్ లేదా సెక్యూరిటీ కీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడం ఈ రోజుల్లో చాలా మందికి ప్రధాన సమస్య. అటువంటి పరిస్థితిలో ట్విట్టర్  ప్రస్తుతం యూజర్లకు మూడు […]

Share:

టెక్స్ట్ మెసేజ్‌.. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ఛార్జ్ చేయనుందని ట్విట్టర్‌ సపోర్ట్ నుంచి వచ్చిన ట్వీట్ లో పేర్కొంది, “మార్చి 20, 2023 నుండి.. ట్విట్టర్‌  బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించగలరని” ట్వీట్ చేసింది. మిగిలిన యూజర్‌లు 2FA కోసం అథెంటిక్ యాప్ లేదా సెక్యూరిటీ కీని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడం ఈ రోజుల్లో చాలా మందికి ప్రధాన సమస్య. అటువంటి పరిస్థితిలో ట్విట్టర్  ప్రస్తుతం యూజర్లకు మూడు రకాల భద్రతను అందిస్తుంది. ఇందులో టెక్స్ట్ సందేశాల క్రింద టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA), అథెంటికేషన్ యాప్ మరియు సెక్యూరిటీ కీ (కీ) వంటి ఎంపికలు ఉన్నాయి.

ముఖ్యంగా.. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉందని పదేపదే మాట్లాడుతున్న ఎలన్ మస్క్, మొదటి రోజు నుండి ఆదాయాన్ని పెంచుకునే తొందరలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగానే ఇప్పుడు కంపెనీ ఆదాయం సంపాదించడానికి కొత్త ప్లాన్ ను ప్రారంభించింది.

వచ్చే నెల 20వ తేదీ నుంచి నాన్-ట్విట్టర్ బ్లూ యూజర్లు టెక్స్ట్ మెసేజ్‌లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెథడ్‌గా ఉపయోగించుకోలేరని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. ఇందుకోసం వారు ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ట్విట్టర్‌లో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి తాము కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ సపోర్ట్ తెలిపింది. అందుకే వ్యక్తుల ఖాతాలను సురక్షితంగా ఉంచడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఇవ్వబడింది. కేవలం పాస్‌వర్డ్‌కు బదులుగా, 2FAకి ఇప్పుడు యూజర్‌లు కోడ్‌ను నమోదు చేయడం లేదా లాగిన్ చేయడానికి సెక్యూరిటీ కీని ఉపయోగించడం అవసరం.

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏమిటి?

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరు మాత్రమే మీ ఖాతాను యాక్సెస్ చేయగలరని నిర్ధారించడంలో సహాయపడుతుంది. ట్విట్టర్‌ ఇప్పటివరకు 2FA యొక్క మూడు పద్ధతులను అందిస్తోంది. ఇందులో టెక్స్ట్ మెసేజ్, అథెంటికేషన్ యాప్ మరియు సెక్యూరిటీ కీ ఉంటాయి.

ఎవరైనా తమ పాస్‌వర్డ్‌ను దొంగిలించినా కూడా వారి ఖాతాలను రక్షించుకోవడానికి, యూజర్‌ల యొక్క అకౌంట్ ని రికవర్ చేసుకోవడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సహాయపడుతుంది.

ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే 2FA ఎస్ఎమ్ఎస్ పద్ధతిలో నమోదు చేసుకోవడానికి ఇకపై ఏ ఖాతాను అనుమతించడం లేదని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పాత్రికేయులు మరియు ఇతర పబ్లిక్ ఫిగర్‌ల కంఫర్మ్ అయిన ఖాతాలకు గతంలో ఉచిత బ్లూ చెక్ మార్క్ లు ఇచ్చేవారు. ఇప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కామన్ ప్రజలకి కూడా బ్లూ చెక్ మార్క్ ఇవ్వనుంది. గత నెలలో ఆండ్రాయిడ్ కోసం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ల ధరను iOS సబ్‌స్క్రైబర్‌ల మాదిరిగానే నెలకు $11గా ఉంచుతామని ట్విట్టర్ తెలిపింది.

ఈ ప్రకటనతో పాటు.. సంస్థ తన బ్లాగ్ పోస్ట్‌లో మరో విషయాన్ని తెలిపింది. కంపెనీ ప్రకారం.. చాలా మంది దుర్మార్గులు ఫోన్-నంబర్ ఆధారిత టూ-ఫాక్టర్ ప్రమాణీకరణ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది.

ట్విట్టర్ యొక్క కొత్త యజమాని ఎలన్ మస్క్ ఒక యూజర్ యొక్క ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ, “కొన్ని టెలికాం కంపెనీలు ‘టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్’తో ఎస్ఎమ్ఎస్ సంఖ్యను పెంచడానికి బాట్‌లను ఉపయోగిస్తున్నందున కంపెనీ తన విధానాన్ని మారుస్తోందని మరియు దీని కారణంగా ట్విట్టర్ సంవత్సరానికి $60 మిలియన్ల వరకు నష్టపోతోందని చెప్పారు.