ఇక ట్విట్టర్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్. అదేవిధంగా ప్రస్తుతం ట్విట్టర్ లోగో X గా మారిపోయింది. అయితే ఇప్పుడు ట్విట్టర్ సీఈఓగా ఉన్న యక్కరినో మరో కొత్త మార్పు గురించి వెల్లడించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో […]

Share:

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్. అదేవిధంగా ప్రస్తుతం ట్విట్టర్ లోగో X గా మారిపోయింది. అయితే ఇప్పుడు ట్విట్టర్ సీఈఓగా ఉన్న యక్కరినో మరో కొత్త మార్పు గురించి వెల్లడించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ఇప్పుడున్న ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ మాదిరిగానే ఇప్పుడు ట్విట్టర్ లో కూడా వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పడం జరిగింది.

మరో కొత్త అప్డేట్: 

ట్విట్టర్ సీఈఓగా ఉన్న యక్కరినో మరో కొత్త మార్పు గురించి వెల్లడించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ఇప్పుడున్న ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ మాదిరిగానే ఇప్పుడు ట్విట్టర్ లో కూడా వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పడం జరిగింది. గత సంవత్సరం ట్విట్టర్ యజమానిగా మస్క్ మారినప్పటి నుంచి, ఆయన ట్విట్టర్ ఆప్ లో తీసుకువచ్చిన మార్పులలో ఇదే చాలా పెద్ద మార్పు అని అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న లిండ యాకరినో తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను కంపెనీలో లోగో X ట్విట్టర్ ఆప్ లో స్థానాన్ని పొందుకునేందుకు ఆమె హస్తం ఎంతో ఉన్నట్లు చెప్పాడు మస్క్. అంతేకాకుండా తన ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ ఆప్ ని ఒక ప్రత్యేకమైన సూపర్ ఆప్ గా చేయాలని అంతేకాకుండా చైనాలో ప్రావీణ్యం పొందిన ‘wechat’ మాదిరిగ మార్చాలనేదే తన నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకొచ్చాడు మస్క్.

ఇటీవల ఎలాన్ మస్క్ చెప్పిన శుభవార్త: 

ట్విట్టర్ నీ తన సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఇప్పటివరకు షాక్కులు మీద షాక్కులు ఇస్తూనే ఉన్నాడు. తను ట్విట్టర్ బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి ఇప్పటివరకు తాను చెప్పిన విషయాలలో ఇప్పుడు ప్రస్తావించే విషయమే శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం చాలామంది తమ సొంత నిర్ణయాలను, మరికొందని విమర్శిస్తూ, మరికొందరు గురించి తెలియజేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపడుతూ, సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెట్టినప్పుడు అందులో వీరు వల్లే ఇలా జరిగింది అంటూ వారిని పోస్టులో లింక్ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలోనే చాలామంది తమ ఉద్యోగాలు కొట్టుకున్న వారు ఉన్నారు. పరువు నష్టం కింద డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ తన నిర్ణయాన్ని బయటపెట్టింది. 

ఒకవేళ తమ పోస్ట్ కారణంగా, ట్విట్టర్ వేదికగా ఎవరైనా వాళ్ళు చేసిన పోస్ట్ కారణంగా తమ యజమానుల నుంచి గాని, లేదంటే వాళ్లు పని చేసే సంస్థల ద్వారా గాని, పోస్ట్ చేసినవారు ఎలాంటి నష్టాన్ని చూసిన, వారికి చట్టపరమైన ఖర్చులను భరిస్తామని, అంటే తమ లీగల్ బిల్ మొత్తం ట్విట్టర్ భరిస్తుంది అని, దానికి లిమిట్ ఎంతైనా పర్లేదు అని ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. 

ఈ పోస్ట్ చేసిన అనంతరం చాలామంది అవాక్కవ్వరు. స్వయంగా ట్విట్టర్, ఇటువంటి ఆఫర్లు ఇస్తే, తమకు నచ్చన వారిని కించపరుస్తూ పోస్టులు పెడతారు అంటూ కొంతమంది ఫైర్ అవుతు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇది చాలా మంచి విషయం అంటూ పొగుడుతున్నారు. ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద ఎలాంటి స్వతంత్రాన్ని కల్పిస్తే, అన్యాయాన్ని ఈజీగా బయట పెట్టొచ్చు అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.