ట్విట‌ర్‌లో కంటెంట్ క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం

ట్విట్టర్ ఇప్పుడు సరికొత్త ఆఫర్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, వాళ్లు ఇప్పుడు నుంచి అడ్వర్టైజింగ్ రెవెన్యూ ని సంపాదించుకోవచ్చు అని చెప్పి తెలియజేసింది. ట్విట్టర్ తన కంపెనీ కంటెంట్ క్రియేటర్స్కి షేర్  ఇస్తున్నట్లు తెలిపింది. కొంత కాలం ముందు వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే ట్విట్టర్ వినియోగదారులు ఉంటారు వారికి పేడ్ సబ్స్క్రిప్షన్ ఉండేది. వారు ఏదైనా కంటెంట్ ని పోస్ట్ చేయాలన్న వారు సబ్స్క్రిప్షన్ ని ముందుగా యాక్టివేట్ చేసుకోవాలి. అలోన్ […]

Share:

ట్విట్టర్ ఇప్పుడు సరికొత్త ఆఫర్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, వాళ్లు ఇప్పుడు నుంచి అడ్వర్టైజింగ్ రెవెన్యూ ని సంపాదించుకోవచ్చు అని చెప్పి తెలియజేసింది. ట్విట్టర్ తన కంపెనీ కంటెంట్ క్రియేటర్స్కి షేర్  ఇస్తున్నట్లు తెలిపింది. కొంత కాలం ముందు వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే ట్విట్టర్ వినియోగదారులు ఉంటారు వారికి పేడ్ సబ్స్క్రిప్షన్ ఉండేది. వారు ఏదైనా కంటెంట్ ని పోస్ట్ చేయాలన్న వారు సబ్స్క్రిప్షన్ ని ముందుగా యాక్టివేట్ చేసుకోవాలి.

అలోన్ మాస్క్ ఆలోచన: 

అలోన్ మాస్క్ ట్విట్టర్ని గత అక్టోబర్ నెలలో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్లకి, గేట్వే చార్జెస్ తప్పిస్తే మొత్తం సబ్స్క్రిప్షన్ రెవెన్యూ వారికే చెందుతుంది అని చెప్పాడు. వాళ్ల రెవెన్యూ మొత్తం వాళ్ళ సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కొన్ని రోజులు తర్వాత తమ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత మార్క్ జూకర్ బర్గ్ మెటా ప్లాట్ ఫామ్ ని ఆన్ చేశాడు అది ట్విట్టర్ కు ఒక ఛాలెంజ్ గా మారింది. అప్పుడు ట్విట్టర్ లో పనిచేసే ఎంప్లాయిస్ ని మెటా హైర్ చేసుకుంటుందని ట్విట్టర్ కు సంబంధించిన రహస్యాలను మరియు వారి కంపెనీ సమాచారాన్ని బయటకు రాకూడదని హెచ్చరించింది.

గత వారంలో ట్విట్టర్ వినియోగదారులకు టెంపరరీ లిమిట్ పెట్టింది కేవలం కొన్ని ట్వీట్స్ మాత్రమే ట్విట్టర్ వినియోగదారులు ఒక రోజుకు చొప్పున చూడగలరు. ఎందుకంటే ట్విట్టర్ కు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మరియు వేరే కంపెనీస్ తో సంబంధాలు పెట్టుకోవడం వల్ల కొంతవరకు అంతరాయం కలిగింది. అందువల్లనే ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. చాలావరకు ట్విట్టర్లో లోటుపాట్లను సరిచేసి కొత్త కంటెంట్ ను తయారు చేసే పనిలో ఉంది.

ట్విట్టర్ లో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, వారికి రెవెన్యూ అనేది వాళ్ళు ఏవైతే యాడ్స్ వాళ్ల రిప్లై మీద ఆధారపడి నుండి రెవెన్యూ జనరేట్ అవుతుందని తెలిపింది. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్లు కనీసం ఐదు మిలియన్ల ఇంప్రెషన్స్ వాళ్ల పోస్ట్లు మీద చూపించాలి. అవి కనీసం మూడు నెలల పాటు నిలవాలి అప్పుడే వాళ్లకు స్ట్రైట్ పేమెంట్ అకౌంట్ అనేది వస్తుందని తెలిపింది.

గత కొంతకాలంగా చూసుకుంటే ట్విట్టర్ తన కంటెంట్ క్రియేటర్స్ నీ కేవలం పెయిడ్ సబ్స్క్రిప్షన్లో మాత్రమే వాళ్ల రెవెన్యూ జనరేట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పటినుంచి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ల రెవెన్యూ వాళ్లే జనరేట్ చేసుకునేలా అవకాశం కల్పించింది. కానీ దానికోసం కొన్ని షరతులు మాత్రం పాటించాల్సి ఉంది.

త్రెడ్ వర్సెస్ ట్విట్టర్: 

వెరిఫైడ్ ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్ తమ రిప్లేస్ లో యాడ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని ట్విట్టర్ తెలిపింది. క్రియేటర్స్ వాళ్లకి స్ట్రైట్ పేమెంట్ అకౌంట్ ఉండాలని కూడా తెలిపింది. గత వారం మెటా ప్లాట్ఫామ్స్ లాంచ్ చేసిన త్రెడ్స్ ఆప్ ట్విట్టర్ కు అంతరాయం కలిగించింది. దానివల్ల ట్విట్టర్ వినియోగదారులకు మరియు ట్విట్టర్ కంపెనీ దారులకు ఇబ్బంది కలిగినట్లు తెలియజేసింది. ట్విట్టర్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ట్విట్టర్ లో జరిగిన మార్పులకు మరియు కొత్త రూల్స్ వలన తమ అడ్వర్టైజర్స్ కి ఎలాంటి ఇబ్బంది  కానీ అంతరాయం కానీ కలగచేయుదని ట్విట్టర్ తెలిపింది.