Charger: మొబైల్ చార్జర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Charger: ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ నాలుగు మించిన మొబైల్ (Mobile) ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి.. కొన్ని సందర్భాలలో మొబైల్ (Mobile) కొనేటప్పుడు ఇచ్చిన చార్జర్ (Charger) పాడైన తర్వాత, సెపరేట్ చార్జర్ (Charger) కొనడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ సందర్భాల్లోనే మనం పలు జాగ్రత్తలు (Tips) తీసుకోవాలంటున్నారు నిపుణులు.. లేదంటే ప్రాణానికి ముప్పు తప్పదు అంటున్నారు. చార్జర్ (Charger) కొనేటప్పుడు జాగ్రత్తలు (Tips) తీసుకోకపోతే, అది మన ప్రాణాల మీదకే వస్తుంది అంటున్నారు నిపుణులు. […]

Share:

Charger: ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ నాలుగు మించిన మొబైల్ (Mobile) ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి.. కొన్ని సందర్భాలలో మొబైల్ (Mobile) కొనేటప్పుడు ఇచ్చిన చార్జర్ (Charger) పాడైన తర్వాత, సెపరేట్ చార్జర్ (Charger) కొనడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ సందర్భాల్లోనే మనం పలు జాగ్రత్తలు (Tips) తీసుకోవాలంటున్నారు నిపుణులు.. లేదంటే ప్రాణానికి ముప్పు తప్పదు అంటున్నారు. చార్జర్ (Charger) కొనేటప్పుడు జాగ్రత్తలు (Tips) తీసుకోకపోతే, అది మన ప్రాణాల మీదకే వస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఏ జాగ్రత్తలు (Tips) తీసుకోవాలో తెలుసుకుందామా.. 

రిస్కు వద్దు.. ప్రాణాలకు ముప్పు: 

ఇంట్లో మొబైల్ (Mobile) ఫోన్‌లను ఛార్జ్ చేయడం కొన్నిసార్లు ప్రమాదకరం. ఇటీవలి నెలల్లో మొబైల్ (Mobile) ఫోన్ ఛార్జింగ్ (Charging)‌లో పేలుడు సంభవించిన అనేక కేసులు వివిధ రాష్ట్రాల నుండి నివేదించబడ్డాయి. కొంతమంది వ్యక్తులు ఛార్జింగ్ (Charging) కోసం తమ ఫోన్‌లను ప్లగ్ ఇన్ చేసి నిద్రపోతారు, ఇది చాలా ప్రమాదకరమైనది కావచ్చు. ఛార్జింగ్ (Charging)‌లో ఉన్నప్పుడు మొబైల్ (Mobile) ఫోన్‌లు కొన్ని సమయాల్లో పేలిపోతాయి. మీ మొబైల్ (Mobile) ఫోన్ ఛార్జింగ్ (Charging) కోసం ప్లగిన్ చేసి ఉన్నప్పుడు మీరు కాల్ మాట్లాడేటప్పుడు కూడా పేలుడు ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రమాదాలను నివారించడానికి, సరైన ఛార్జర్‌ (Charger)ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Read More: Apple: చనిపోయిన వారి ఐఫోన్ అన్లాక్ చేయొచ్చా?

ఇటువంటి సంఘటనలకు కారణం తరచుగా నాణ్యత లేని లేదా నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం. తయారీదారు అందించిన మొబైల్ (Mobile) ఛార్జర్‌ (Charger)ను ఉపయోగించడం లేదా కంపెనీ సిఫార్సు చేసిన ఛార్జర్‌ (Charger)ను కొనుగోలు చేయడం మంచిది. మీరు కొత్త మొబైల్ (Mobile) ఫోన్ ఛార్జర్‌ (Charger)ని కొనుగోలు చేస్తున్నట్లయితే, ఉత్పత్తిని ఖరారు చేసే ముందు కొన్ని భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడం మంచిది. “your_kumar_sir” పేరుతో Instagram ఎకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో, మొబైల్ (Mobile) ఛార్జర్ యొక్క ప్రామాణికతను గుర్తించడానికి చిట్కాలను అందిస్తుంది. మీరు ఛార్జర్‌ (Charger)ను కొనేటప్పుడు, మీరు ఛార్జర్‌ (Charger)పై రెండు స్టిక్కర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, 8-అంకెల కోడ్ మరియు ఇంటి గుర్తు కోసం వెతకాలని వీడియోలో చెప్పడం జరిగింది. ఈ గుర్తులు ఛార్జర్ మంచి నాణ్యతతో ఉన్నాయని సూచిస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కేర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, చార్జర్ (Charger) గురించిన వివరాలను కోడ్‌ను నమోదు చేయడం ద్వారా చెక్ చేయాలని వీడియో ప్రకారం సిఫార్సు చేస్తున్నాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో ఈ వీడియో ఆకర్షించింది. ఛార్జర్‌ (Charger)లు కాకుండా, మొబైల్ (Mobile) ఫోన్ బ్లాస్ట్‌లను నివారించడానికి, రాత్రిపూట ఫోన్‌ను ఛార్జ్ చేయకుండా ఉండటం, ఫోన్‌ను 100% ఛార్జింగ్ (Charging) చేయకుండా.. బ్యాటరీపై నిఘా ఉంచడం వంటి కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం మంచిది. 

యాపిల్ హెచ్చరిక: 

ఆపిల్ తన ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో కొత్త హెచ్చరిక నోటీసును జారీ చేసింది, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను పట్టుకుని నిద్రపోయే వాళ్ల గురించి అదే విధంగా, ఐఫోన్ ఛార్జింగ్ (Charging) ప్రాసెస్ గురించి హెచ్చరికలో పేర్కొంది. ఆపిల్ వినియోగదారులు తమ మొబైల్ (Mobile) ఛార్జింగ్ (Charging) విషయంలో పలు జాగ్రత్తలు (Tips) తీసుకోవాలని వెల్లడించింది ఆపిల్ సంస్థ. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు చార్జింగ్ పెట్టి నిద్రపోవడం లాంటివి చేయకూడదని, పరుపులు మీద దిండ్లు మీద మొబైల్ (Mobile) ఛార్జింగ్ (Charging) పెట్టకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మొబైల్ (Mobile) ఛార్జింగ్ (Charging) పెట్టి మన శరీరం మీద మొబైల్ (Mobile) పెట్టుకోకూడదని గుర్తు చేసింది. ఒకవేళ ఇలాంటివి జరిగినట్లయితే ఫైర్ ఆక్సిడెంట్ వంటివి జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అందుకే తప్పనిసరిగా చార్జింగ్ పెట్టేటప్పుడు ఒక టేబుల్ మీద, వెంటిలేషన్ బాగా ఉన్న చోటులో మాత్రమే ఐ ఫోన్ ఛార్జింగ్ (Charging) పెట్టాలని ఆపిల్ సూచిస్తుంది.