ట్విట్టర్ కి పోటీగా మెటా అప్లికేషన్

మెటా త్రెడ్ అనే కొత్త అప్లికేషన్ లాంచ్ చేసింది. నిజానికి ఇది ట్విట్టర్ తో పోటీ పడనుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ నుంచి నేరుగా థ్రెడ్ అప్లికేషన్ యూస్ చేయొచ్చు.  వివరాల్లోకి వెళ్దాం:  గడిచిన బుధవారం మెటా ఇన్స్టాగ్రామ్, త్రెడ్ అనే కొత్త అప్లికేషన్ ని లాంచ్ చేయడం జరిగింది. నిజానికి ఈ త్రెడ్ అనేది ట్విట్టర్ కి గట్టి పోటీ ఇవ్వన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ట్విట్టర్ అధినేతగా ఉన్న అలన్ మస్క్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలి […]

Share:

మెటా త్రెడ్ అనే కొత్త అప్లికేషన్ లాంచ్ చేసింది. నిజానికి ఇది ట్విట్టర్ తో పోటీ పడనుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ నుంచి నేరుగా థ్రెడ్ అప్లికేషన్ యూస్ చేయొచ్చు. 

వివరాల్లోకి వెళ్దాం: 

గడిచిన బుధవారం మెటా ఇన్స్టాగ్రామ్, త్రెడ్ అనే కొత్త అప్లికేషన్ ని లాంచ్ చేయడం జరిగింది. నిజానికి ఈ త్రెడ్ అనేది ట్విట్టర్ కి గట్టి పోటీ ఇవ్వన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ట్విట్టర్ అధినేతగా ఉన్న అలన్ మస్క్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. 

త్రెడ్ ఎలా పనిచేస్తుంది: 

కొత్తగా లాంచ్ అయిన థ్రెడ్‌ అప్లికేషన్ ద్వారా మనం టెక్స్ట్, లింక్ షేరింగ్ మరియు ఇంటరాక్షన్‌ని ఎనేబుల్, అంతేకాకుండా రిపోర్ట్స్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఇంచుమించు ట్విట్టర్ అప్లికేషన్ మాదిరిగానే ఉంటుంది. అంటే సుమారు ఇంస్టాగ్రామ్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ త్రెడ్ అప్లికేషన్ సులువుగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని థ్రెడ్ లోకి మైగ్రేట్ చేసుకోవచ్చు. 

“1 బిలియన్‌ కంటే ఎక్కువ మంది ఇప్పుడు ఆప్ యూస్ చేస్తున్నారు” అని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం థ్రెడ్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటివరకు ఉన్న వినియోగదారులు చాలా మంది టెక్స్ట్ ఆధారిత యాప్‌ను తయారు చేయమని కంపెనీని అడుగుతున్నారని ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కానర్ హేస్ పేర్కొన్నారు. 

ఇంటర్వ్యూ ప్రకారం: 

క్రియేటర్స్ చెప్పిన దాని ప్రకారం, “ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్ కావాలి అంటున్నారు. అంతేకాకుండా మళ్లీ మొదటి నుంచి అనగా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన పని లేదు.” అని హేస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

కస్టమర్స్ రివ్యూ: 

అయితే ఇప్పటికే ఎంతోమంది కొత్తగా వచ్చిన త్రెడ్ ఆప్ యూస్ చేసి హ్యాపీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఒక కస్టమర్ రివ్యూ ఇస్తూ,’ఈ త్రెడ్ ఆప్ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా ఇంటర్ ఫెస్ నిజానికి అద్భుతంగా ఉంది. ఈ యాప్ లో మరింత ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా అలన్ మస్క్ ట్విట్టర్ అధిపతికి మంచి కాంపిటేటర్ వచ్చింది’ అని అన్నారు. 

మరో కస్టమర్ మాట్లాడుతూ, ‘నిజంగా ఇది అద్భుతమైన యాప్. నిజానికి ఇ ట్విట్టర్లో పని చేసిన వారికి, ఈ కొత్త యాప్ థ్రెడ్ చూసి కుళ్లుకుంటారేమో! అంతేకాకుండా మనలో చాలామంది థర్డ్ పార్టీ ట్విట్టర్ యాప్ ఉపయోగించిన వారము లేకపోలేదు.’ 

మరికొంతమంది మాట్లాడుతూ, ‘కొన్ని కొన్ని సార్లు నేను యూట్యూబ్ షాట్స్ చూస్తూ టిక్ టాక్ లో ఉన్నానేమో అని భ్రమ పడినట్లు, ఇప్పుడు థ్రెడ్ ఉపయోగిస్తూ ట్విట్టర్ ఉపయోగిస్తున్నానే అని సందేహం కూడా వచ్చింది.’ 

ఇది మెటా టైం: 

అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మెటా టైం నడుస్తున్నట్లు మనకి కనిపిస్తుంది తర్వాత ఎంతో మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. అందులో కాస్త కంటెంట్ మోడరన్ పాలసీస్ లో కూడా మార్పులు కూడా జరిగాయి. అంతేకాకుండా ఫైనాన్షియల్ గా కూడా ట్విట్ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. 

Twitter ప్రైవేటీకరణ చేయడమే కాకుండా, X Corp అనే కొత్త సంస్థలో విలీనం అయింది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ తక్షణమే మునుపటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను ఎవరూ ఊహించని విధంగా విధుల నుంచి తొలగించారు. మస్క్ ట్విట్టర్‌కు అనేక కొత్త మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించాడు మరియు కంపెనీలో సగం మందిని తొలగించాడు.”అత్యంత హార్డ్‌కోర్” పనికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో వందలాది మంది ఉద్యోగులు మానేసి కంపెనీకి రాజీనామా చేశారు.

శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత కంపెనీలో ప్రకటనల ఆదాయం 50% క్షీణించిందని మార్చిలో మస్క్ చెప్పారు. బ్రాండ్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించడానికి అతను ఇటీవల NBC యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ అయిన లిండా యాకారినోను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకున్నారు.