కారు కంటే విలువైన ఐఫోన్..!

బాగా ఖరీదైన మొబైల్స్ పేర్లు చెప్పగానే సామ్ సంగ్ గెలాక్సీ 23, పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్ 14 ప్రోమాక్స్ గుర్తొస్తాయి. ఐఫోన్ ప్రో మాక్స్ 14 అనే ఫోన్ ఫెరారీ కంటే విలువైందంటే నమ్ముతారా? అవును దీంట్లో డైమండ్ స్నో ఫ్లేక్ ఉంది. అందుకే ఈ ఫోన్ ఖరీదు ఐదు కోట్లుగా ఉంది.  ఈ ఫోన్ ఎందుకు ఖరీదైనది?: ఈ ఫోన్ వెనక ప్లాటినం,గోల్డ్ పెండెంట్ ఉంటుంది, చుట్టూ డైమండ్స్ ఉంటాయి వీటి ఖరీదు 62 లక్షలు. దీని […]

Share:

బాగా ఖరీదైన మొబైల్స్ పేర్లు చెప్పగానే సామ్ సంగ్ గెలాక్సీ 23, పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్ 14 ప్రోమాక్స్ గుర్తొస్తాయి. ఐఫోన్ ప్రో మాక్స్ 14 అనే ఫోన్ ఫెరారీ కంటే విలువైందంటే నమ్ముతారా? అవును దీంట్లో డైమండ్ స్నో ఫ్లేక్ ఉంది. అందుకే ఈ ఫోన్ ఖరీదు ఐదు కోట్లుగా ఉంది. 

ఈ ఫోన్ ఎందుకు ఖరీదైనది?:

ఈ ఫోన్ వెనక ప్లాటినం,గోల్డ్ పెండెంట్ ఉంటుంది, చుట్టూ డైమండ్స్ ఉంటాయి వీటి ఖరీదు 62 లక్షలు. దీని బ్యాక్ సైడ్ మొత్తం డైమండ్స్ ఉంటాయి. ఈ డైమండ్స్ వల్ల దీని ఖరీదు భారీగా పెరిగింది. దీని విలువ సుమారు 5 కోట్లు ఉంటుంది. ఈ మొబైల్ లిమిటెడ్ వెర్షన్. ఇది కెవియర్ అఫీషియల్ సైట్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కి కెవియర్ వారంటీ కూడా ఉంది. 128 జిబి బేస్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఖరీదు 1,39,900గా ఉంది. ఇది ఆపిల్ రీసెంట్ మోడల్. త్వరలోనే ఐఫోన్ 15 విడుదల అవుతుందని అంటున్నారు. 

ఆపిల్ ఫోన్ ప్రత్యేకత ఏంటి:

మార్కెట్లో చాలా రకాల ఫోన్లు ఉన్నా ఆపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజే వేరు. ఆపిల్ ఫోన్ ఉందంటే వాళ్లు రిచ్ అనే రేంజ్ ఆపిల్ ఫోన్ ది. సామ్ సంగ్, వన్ ప్లస్ లాంటి ఎన్ని ఫోన్లు వచ్చినా ఆపిల్ కి ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో ప్రతి ఒక్కరు ఆపిల్ ఫోన్ కొనాలనుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఆపిల్ ఫోన్ లో ఫోటో క్లారిటీ చాలా బాగుంటుంది. ఇంకా దీంతో షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయొచ్చు. పిక్సెల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలామంది ఆపిల్ ఫోన్ ఉపయోగించి షార్ట్ ఫిలిమ్స్ తీశారు అంటే దీని క్వాలిటీ అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆపిల్ ఫోన్ వాడి సినిమాలు కూడా తీశారు. ఆపిల్ ఫోన్ క్వాలిటీ అనేది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంది. దీనికి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని ఆపిల్ బ్రాండ్స్ విడుదలైనా దీనికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. వేరే మొబైల్ బ్రాండ్లలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ విడుదల చేసినా కూడా ఆపిల్ ఫోన్ కి వచ్చినంత డిమాండ్ వాటికి రావట్లేదు. ఇవి చాలా ఖరీదైన అయినప్పటికీ చాలామంది వీటినే కొంటున్నారు. వీటికి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారంటే వీటి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ ఫోన్ కొత్తగా విడుదల చేసిన 14 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ 1,39,900 ఉంది. 

దీని అప్గ్రేడెడ్ మోడల్ లిమిటెడ్ వెర్షన్. దీని ఖరీదు ఫెరారీ కార్ కంటే ఎక్కువ. దీని ఖరీదు సుమారు 5 కోట్లు ఉంటుంది. లిమిటెడ్ వెర్షన్ అంటే కొన్ని ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అర్థం. ఇప్పుడు మార్కెట్లో ఆపిల్ ఫోన్ కు కాంపిటీషన్ ఇచ్చే ఫోనే లేదు. ముందు ముందు రోజుల్లో దీనికి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ వస్తుందేమో చూద్దాం. వన్ ప్లస్ లాంటి కంపెనీ దీనికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ముందు ముందు ఆపిల్ రేంజ్ ఇంకా ఎంత పెరుగుతుందో చూద్దాం.