జూలైలో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచింగ్.. పూర్తి వివరాలు ఇవే

అత్యాధునిక ప్రపంచంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి టెక్ సంస్థలు రకరకాల అత్యాధునిక టెక్నాలజీని అవలంబిస్తూ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన టెక్నాలజీ తో స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అవుతూ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోని జూలై అనగా వచ్చే నెలలో భారతదేశంలో కూడా కొన్ని టెక్ స్మార్ట్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఆ 5Gస్మార్ట్ […]

Share:

అత్యాధునిక ప్రపంచంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి టెక్ సంస్థలు రకరకాల అత్యాధునిక టెక్నాలజీని అవలంబిస్తూ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన టెక్నాలజీ తో స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అవుతూ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోని జూలై అనగా వచ్చే నెలలో భారతదేశంలో కూడా కొన్ని టెక్ స్మార్ట్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఆ 5Gస్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎక్కడ చూసినా 5G  స్మార్ట్ ఫోన్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చాలా టెక్ కంపెనీలు కూడా ఇప్పుడు 5G  ఫోన్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశ పెట్టడానికి ముందుకు వచ్చాయి అందులో భాగంగానే జూలై నెలలో భారత మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ 3, రియల్ మీ నార్జో 60 సిరీస్, ఐ క్యు ఓఓ నియో 7 ప్రో తో పాటు పలు రకాల 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇకపోతే సామ్సంగ్ గెలాక్సీ M34 జూలై 7వ తేదీన ప్రారంభం అవుతుంది అని సాంసంగ్ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది .అలాగే నథింగ్ ఫోన్ 2 జూలై 11వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది.ఇక ఎవరైతే ఉత్తమమైన 5జి ఫోన్ కోసం వెతుకుతుంటారో అలాంటి వినియోగదారుల కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు

 ఇక వీటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వన్ ప్లస్ నార్డ్ 3:

తాజాగా లీకైన ఫీచర్స్ విషయానికి వస్తే 1.5 కే రెజల్యూషన్ తో 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో 6.74 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇక్కడ వన్ ప్లస్ నార్డ్ 3 హై అండ్ చిప్ సెట్ తో అమర్చబడి ఉంటుంది.  ఇక వినియోగదారులు అద్భుతమైన పనితీరును ఈ మొబైల్ నుంచి ఆశించవచ్చు.  ఇక మార్కెట్లో దీని ధర రూ.30 వేల కంటే తక్కువగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

రియల్ మీ నార్జో 60 సిరీస్:

ఇందులో విశేషమైన 1టి బి స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుందని సమాచారం. జూలైలో లాంచింగ్ కు సిద్ధంగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రెండు లక్షల 50 వేల కంటే ఎక్కువ ఫోటోలను నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని రియల్ మీ స్పష్టం చేసింది. ఇక ఈ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నథింగ్ ఫోన్ 2:

హై ఎండ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 క్వాల్కమ్ చిప్ సెట్ తో అమర్చబడిందని.. 4700ఎంఈహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందని సమాచారం అలాగే 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండటం గమనార్హం . ఇక ఇండియన్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ .45 వేల వరకు పలకవచ్చు అని నిపుణులు చెబుతున్నారు

సామ్సంగ్ గెలాక్సీ m34:

6.6 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.

ఐ క్యు ఓ ఓ నియో సెవెన్ ప్రో:

120Hz రీఫ్రెష్ రేటు ను కలిగి ఉంటుందని తాజా సమాచారం. ఇక ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ.45 వేల లోపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.