టెలిగ్రామ్ లో పవర్ సేవింగ్ మోడ్, ఆటో సెండ్ ఇన్వైట్ లింక్స్‌తో పాటు మరికొన్ని ఫీచర్స్

ఆటో సేవ్ మోడ్ వాట్సాప్ మాదిరిగానే.. ఈ మధ్యకాలంలో యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న మరొక యాప్ టెలిగ్రామ్. రోజురోజుకీ టెలిగ్రామ్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆ మధ్య వాట్సాప్ బ్యాన్ చేసినప్పుడు అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్లు పెరిగాయి. ఇక టెలిగ్రామ్ యాజమాన్యం కూడా వాట్సాప్ మాదిరిగానే అనేక రకాల ఫీచర్స్ ను వారి యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు టెలిగ్రామ్ లో ఎన్నో సేవలు అందించారు.  తాజాగా మరికొన్ని ఫీచర్స్ అదనంగా […]

Share:

ఆటో సేవ్ మోడ్


వాట్సాప్ మాదిరిగానే.. ఈ మధ్యకాలంలో యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న మరొక యాప్ టెలిగ్రామ్. రోజురోజుకీ టెలిగ్రామ్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆ మధ్య వాట్సాప్ బ్యాన్ చేసినప్పుడు అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్లు పెరిగాయి. ఇక టెలిగ్రామ్ యాజమాన్యం కూడా వాట్సాప్ మాదిరిగానే అనేక రకాల ఫీచర్స్ ను వారి యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు టెలిగ్రామ్ లో ఎన్నో సేవలు అందించారు.  తాజాగా మరికొన్ని ఫీచర్స్ అదనంగా తీసుకువచ్చారు..

తాజాగా టెలిగ్రామ్ యాప్ లో పవర్ సేవింగ్ మోడ్, ఆటో సెండ్ ఇన్వైట్ లింక్స్ ఆప్షన్, రీడ్ టైం ఇన్ స్మాల్ గ్రూప్స్ అండ్ మోర్ ఆప్షన్స్ ను.. వారి యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది టెలిగ్రామ్ మెసెంజర్ యాప్. వీటితో పాటుగా చాట్ లోని వీడియోల కోసం కొత్త ప్లే బ్యాక్ స్పీడ్ కంట్రోలర్, యానిమేటెడ్ ఎమోజీలు, ఇంటరాక్టివ్ రియాక్షన్ లు, అనువాద బాట్ వివరణలు, ఐఓఎస్ లో మెరుగైన ఫోల్డర్ సపోర్ట్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ ప్రోత్సహిస్తుంది. 

పవర్ సేవింగ్ మోడ్:

పవర్ సేవింగ్ మోడ్ బ్యాటరీ నిర్దిష్ట శాతాన్ని చేరుకున్నప్పుడు, మోడ్ ఆటో ప్లేయింగ్ వీడియోలు, గిఫ్టులు, స్టిక్కర్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ వంటి రిసోర్స్ ఇంటెన్సివ్ ఫీచర్లను ఆఫ్ చేస్తుంది. పవర్ సేవింగ్ మోడ్ ను టోగుల్ చేయవచ్చు. లేదంటే సెట్టింగ్స్ లో పవర్ సేవింగ్ లో ఆటో ప్లే యానిమేషన్స్ ఎఫెక్ట్ల కోసం మీ పర్సనల్ సెట్టింగ్స్ ను మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

టెలిగ్రామ్ కంపెనీ 2000 కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్లను పరీక్షించిన తరువాత వినియోగదారుల కోసం ఆప్తమైజ్ డిఫాల్ట్ సెట్టింగ్ లను తీసుకువచ్చిందని స్పష్టం చేసింది. బ్యాటరీ సేవ్ మోడ్ కాకుండా టెలిగ్రామ్ స్వయంచాలకంగా పంపే ఇన్వైట్ లింక్ ల ఫీచర్ ని కూడా ప్రవేశపెట్టింది. యూజర్స్ వారి గ్రూపులకు జోడించడానికి ఎవరిని అనుమతించాలో నియంత్రించడానికి ఇది అనుమతి ఇస్తుంది. మీరు ఇన్విటేషన్ లింకును ఎవరికైనా పంపించవచ్చని టెలిగ్రామ్ కంపెనీ తెలిపింది. 

టెలిగ్రామ్ యాప్ లో చిన్న చిన్న గ్రూప్స్ లో రీడ్ టైమ్ ఫీచర్ ను కూడా విడుదల చేసింది. 100 మంది గ్రూప్ సభ్యుల కంటే తక్కువ మంది సభ్యులతో కూడిన ప్రతి గ్రూప్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ప్రతి వ్యక్తి వారు పంపిన మెసేజ్ ను ఎప్పుడు చదివారు అనే సమయాన్ని ఇది చూపిస్తుంది.