చాట్ జిపిటి మీద సరికొత్త విప్లవం ని తీసుకొని రాబోతున్నాము అంటూ టాటా గ్రూప్స్ అధినేత చంద్రశేఖరన్ సంచలన వ్యాఖ్యలు

సాఫ్ట్ వేర్ రంగం ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ రంగంలో పని చేసే ఎవ్వరైనా ఎప్పటికప్పుడు తమకి తాము అప్డేట్ అవుతూ ఉండాలి, లేకపోతే మనుగడ సాగించడం కష్టం. ఒకప్పుడు జావా, డాట్ నెట్ వంటి కోడింగ్ లాంగ్వేజ్ హవా తారాస్థాయిలో ఉండేది. ఇంజనీరింగ్ పూర్తి అవ్వగానే విద్యార్థులు జావా లేదా డాట్ నెట్ కోర్సులు నేర్చుకొని ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉండేవారు. ఇప్పటికీ అవి మంచి డిమాండ్ […]

Share:

సాఫ్ట్ వేర్ రంగం ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ రంగంలో పని చేసే ఎవ్వరైనా ఎప్పటికప్పుడు తమకి తాము అప్డేట్ అవుతూ ఉండాలి, లేకపోతే మనుగడ సాగించడం కష్టం. ఒకప్పుడు జావా, డాట్ నెట్ వంటి కోడింగ్ లాంగ్వేజ్ హవా తారాస్థాయిలో ఉండేది. ఇంజనీరింగ్ పూర్తి అవ్వగానే విద్యార్థులు జావా లేదా డాట్ నెట్ కోర్సులు నేర్చుకొని ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉండేవారు. ఇప్పటికీ అవి మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ లేటెస్ట్ గా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఐటీ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది అనే చెప్పాలి. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐటీ రంగం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ హవానే నడుస్తుందని, ఈ టెక్నాలజీ మీద బోలెడన్ని జాబ్స్ ఉన్నాయని, గొప్ప కెరీర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. బిజినెస్ టుడే నిర్వహించిన BT మైండ్ రష్ అనే ప్రోగ్రాంలో నటరాజన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి ఉన్న ప్రాధాన్యత, అలాగే టాటా గ్రూప్స్ భవిష్యత్తులో చెయ్యబోతున్న కార్యాచరణ గురించి చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘AI ఇప్పుడు ఐటీ రంగం లో ఒక విపవం లాంటిది, ప్రస్తుతం ప్రతీ రోజు ఇప్పుడు ఇంటర్నెట్ ని ఉపయోగించే వాళ్లకు చాట్ జిపిటి వాడకం చాలా కామన్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ప్రతీ విషయంపై మనం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి యువకులందరూ AI ని నేర్చుకోండి, కచ్చితంగా ఇందులో గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మన దేశంలో పనిచేసే ప్రభుత్వాలు సైతం ఇప్పుడు AI మీదనే ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. ఈ టెక్నాలజీకి ప్రస్తుతం ఉన్న డిమాండ్ మరియు ప్రాముఖ్యత అలాంటిది. త్వరలోనే మా టాటా గ్రూప్స్ ద్వారా AI మీద ఒక సరికొత్త ఫ్రేమ్ వర్క్ తో మీ ముందుకు రాబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మా సంస్థల ద్వారా ఒక చిన్న కంపెనీ మీద పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నామని, ఇది సక్సెస్ అయితే చాట్ జిపిటి విషయంలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పై పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

తమ దగ్గర అత్యంత ప్రతిభావంతులతో కూడిన ఒక టీం ఉందని, ఆ టీం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీద ఎన్నో విన్నూతనమైన ప్రాజెక్ట్స్ చేయబోతున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీనిపై మరిన్ని పైలట్ ప్రాజెక్ట్స్ చేసి మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన కలిగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. చాట్ GPT టెక్నాలజీ ని డెవలప్ చేసింది టాటా గ్రూప్స్ సంస్థ వాళ్ళే,  చాట్ GPT అనేది మనతో స్నేహపూర్వకంగా ఉండే ఒక రోబోట్ లాంటిది, మనం రోజు వారి చేసే ఆన్లైన్ కార్యకలాపాలు , అంటే ఉదాహరణకి మెయిల్స్ పంపడం, వ్యాసాలు రాయడం ఇలాంటి ఎన్నో పనులను చాట్ GPT ద్వారా చాలా తేలికగా చెయ్యగలం. ఇలాంటి టెక్నాలజీలను రాబొయ్యే రోజుల్లో మరిన్నీ మన ముందుకు తీసుకొని రాబోతున్నామని నటరాజన్ చంద్ర శేఖరన్ చెప్పుకొచ్చాడు. చూడాలి మరి AI టెక్నాలజీ మీద ఈయన చెయ్యబోతున్న అద్భుతాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని మనం ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, యూట్యూబ్ లో దీని మీద ఎన్నో ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి, ఇంకా లోతు గా నేర్చుకోవాలంటే యూ డెమ్మీ లో ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి, అక్కడ నేర్చుకోవచ్చు, భవిష్యత్తులో మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేధావులు.