టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఫీచర్స్ తో BS6 ఫేజ్ 2 ట్రాన్సిషన్ వాహనాలు

టాటా మోటార్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన BS6 ఫేజ్ 2 RDE, E20 రేంజ్ మెసెంజర్ శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. టనుంచి ఏ కారు వచ్చినా అది ప్రత్యేకమే. కస్టమర్లకు అనుగుణంగా వారి డిజైన్లు, ఫీచర్లు ఉంటాయి. తాజాగా టాటా మోటార్స్ వారి కస్టమర్లకు శుభవార్త తీసుకొచ్చింది. మార్కెట్లోకి సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టింది.. BS6 2 RDE, E20: టాటా మోటార్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన  […]

Share:

టాటా మోటార్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన BS6 ఫేజ్ 2 RDE, E20 రేంజ్ మెసెంజర్ శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది.

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. టనుంచి ఏ కారు వచ్చినా అది ప్రత్యేకమే. కస్టమర్లకు అనుగుణంగా వారి డిజైన్లు, ఫీచర్లు ఉంటాయి. తాజాగా టాటా మోటార్స్ వారి కస్టమర్లకు శుభవార్త తీసుకొచ్చింది. మార్కెట్లోకి సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టింది..

BS6 2 RDE, E20:

టాటా మోటార్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన  BS6 ఫేజ్ 2 RDE, E20 రేంజ్ మెసెంజర్ శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ ఈ వెహికల్ కి సంబంధించిన మొత్తం పోర్ట్ఫోలియోను తాజా ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది. ఈ వెహికల్స్ ను సరికొత్త ఫీచర్స్ తో డిఫరెంట్ వేరియేషన్స్ తో వారి కస్టమర్స్ కి అందిస్తుంది. 

BS6 2 RDE, E20 వెహికల్స్ ను పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్రేడ్స్ లో అప్గ్రేడ్ చేసింది. అంతే కాకుండా.. ప్రయాణికుల భద్రత సౌకర్యార్థం కోసం స్మార్ట్ ఫీచర్ లను, సేఫ్టీ ఫీచర్లను కూడా యాడ్ చేసింది. ప్రామాణిక వారంటీని రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు, 75 వేల కిలోమీటర్ల నుంచి లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించింది. స్లో స్పీడ్ తో మరింత సాఫీ డ్రైవింగ్ అనుభవం కోసం అట్రోజ్, పంచ్ కారులలో ఐడల్ స్టాప్ స్టార్ట్ ఫ్యూచర్ లను యాడ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ అన్ని వేరియంట్లలోనూ లభిస్తుంది. 

నయా ఫీచర్స్..

ఆల్ రోజ్, నెక్సన్ రెండింటికి రేవో టార్క్ డీజిల్ ఇంజనీరింగ్ ను కూడా అప్డేట్ చేసింది. అదనంగా నెక్సా డీజిల్ ఇంజన్.. మరింత మెరుగైన పనితీరును అందించేందుకు చేసినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఆర్డిఇ ఇంజన్లను ఇంధనాన్ని పొదుపు చేసేలాగా ట్యూన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ నిర్దేశించిన ప్రామాణికాల ఆధారంగా ఇంజన్ ను తక్కువ ఖర్చు అయ్యేలాగా చేసుకోవచ్చు. అది మీ డ్రైవింగ్ లో కొన్ని మార్పులు చేసుకోవడంతో సాధ్యం అవుతుంది. 

ఒత్తిడి లేని డ్రైవింగ్: 

ఒత్తిడి లేని డ్రైవింగ్ కోసం టియాగో కార్లకు టాటా మోటార్స్ టిపిఎంఎస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అంతే కాకుండా నూతన శ్రేణి కార్లను తక్కువ ఎన్ వి హెచ్ స్థాయిలలో మెరుగుపంచినట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా మాట్లాడుతూ.. వాహన కాలుష్యాన్ని తగ్గించాలనే ప్రభుత్వ సదుద్దేశం మిషన్ లో భాగంగా.. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ క్రియాశీల భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. ఉద్గారాలను అదుపులో ఉంచడమే కాకుండా, అసమానమైన డ్రైవింగ్ కారు యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచే సాంకేతికతలను నిరంతరం ఆవిష్కరిస్తూ, వాటిని పరిచయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్స్ ఆలోచన విధానానికి, వారి డ్రైవింగ్ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కారులను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు, వారికి ఆత్యాధునిక భద్రత, డ్రైవలిటి, అప్గ్రేడ్ చేసిన ఫీచర్లను, మెరుగైన రైడ్ అనుభవం, అత్యంత ముఖ్యమైన అంశాలతో కూడిన మెరుగైన పోర్టుఫోలియోను అందిస్తున్నట్లు తెలిపారు. టాటా మోటార్స్ కార్స్ అందుకే ఎప్పటికీ కస్టమర్ ప్రత్యేకం. సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకుంటుంది.