Elon Musk: Xలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు తావులేదు అంటున్న ఎలాన్ మస్క్

ప్రతి విషయానికి తనదైన శైలిలో స్పందించే ట్విట్టర్ అధినేత, ఎలాన్ మస్క్(Elon Musk) ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయిల్ యుద్ధ(War) పరిస్థితుల గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉగ్రవాదులకు సంబంధించి తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా కార్యకలాపాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా, తమ ట్విట్టర్(X) ఫ్లాట్ ఫామ్ లోని కొన్ని అకౌంట్లను(Accounts) నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంది.  (X) ఫ్లాట్ ఫామ్ నిర్ణయం:  ఇజ్రాయెల్‌(Israel)పై ఇటీవల హమాస్ దాడుల తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌(Platform) […]

Share:

ప్రతి విషయానికి తనదైన శైలిలో స్పందించే ట్విట్టర్ అధినేత, ఎలాన్ మస్క్(Elon Musk) ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయిల్ యుద్ధ(War) పరిస్థితుల గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉగ్రవాదులకు సంబంధించి తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా కార్యకలాపాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా, తమ ట్విట్టర్(X) ఫ్లాట్ ఫామ్ లోని కొన్ని అకౌంట్లను(Accounts) నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంది. 

(X) ఫ్లాట్ ఫామ్ నిర్ణయం: 

ఇజ్రాయెల్‌(Israel)పై ఇటీవల హమాస్ దాడుల తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌(Platform) X,”ఉగ్రవాద సంస్థలకు Xలో చోటు లేదు” అని పేర్కొంటూ హమాస్ అనుబంధిత వందల కొద్దీ అకౌంట్లను(Accounts) తొలగించింది. ప్రత్యేకించి ఇలాంటి క్లిష్టమైన క్షణాలలో, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌(Platform) ద్వారా వ్యాప్తి చెందే ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అర్థం చేసుకుని, దాన్ని శాశ్వతంగా నిర్మూలించే పరిష్కారాన్ని ఎంచుకునే క్రమంలో.. తీవ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాద సమూహాలకు X లో స్థానం లేకుండా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు.. సోషల్ మీడియా ట్విట్టర్ X CEO, లిండా యాకారినో అన్నారు.

X ద్వారా ఎటువంటి చెడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. కొత్త EU ఆన్‌లైన్ కంటెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరుతూ ఎలాన్ మస్క్ (Elon Musk)కు యూరోపియన్ యూనియన్ పరిశ్రమ చీఫ్ థియరీ బ్రెటన్ జారీ చేసిన 24 గంటల అల్టిమేటం తర్వాత.. X చాలా చురుకుగా తన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. యూరోపియన్ యూనియన్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్ మరియు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేందుకు కానీ సోషల్ మీడియా వినియోగంపై బ్రెటన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ప్రకారం, X అదే విధంగా Meta’s Facebook (META.O) వంటి పెద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ ఫామ్‌ (Platform)లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి, మరి చాలా ముఖ్యంగా ప్రజా భద్రత మరియు పౌర చర్చలకు ముప్పులను పరిష్కరించడానికి మరింత కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు. 

Read More: Operation Ajay: ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక ఫ్లైట్

సాగుతున్న యుద్ధం: 

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్ భారీ రాకెట్లతో దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఎంతో మంది ఇజ్రాయెల్‌(Israel) వాసులు చనిపోగా సుమారు, 3,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు.  లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్(Israel) స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్ ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 

ఇజ్రాయెల్‌(Israel)కు దాడి జరిగిన రోజు “బ్లాక్ డే” అని చెప్పి, దానికి ప్రతీకారం తీర్చుకుంటానని, బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశాడు. హమాస్ సామర్థ్యాలను నాశనం చేయడానికి IDF సైన్యం తన శక్తినంతా ఉపయోగించబోతోందని.. వారిని తీవ్రంగా తిప్పికొట్టి, వారు ఇజ్రాయెల్(Israel) ప్రజలపై తెచ్చిన ఇటువంటి బాధాకరమైన చీకటి రోజుకు ప్రతిగా.. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అతను చెప్పాడు. ఆకస్మిక దాడి తరువాత దాని రహస్య స్థావరాలను “శిధిలాలు”గా మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన అనంతరం.. గాజాలోని హమాస్ సైట్ల సమీపంలో నివసిస్తున్న పాలస్తీనియన్లను విడిచిపెట్టమని, బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించాడు. 

Read More: Isreal: ఇజ్రాయిల్ మాజీ ప్రధాని మంత్రి సమాధానానికి మండిపడ్డ యాంకర్

 ఏడు ఇజ్రాయెల్(Israel) హత్య ప్రయత్నాల నుండి బయటపడిన వ్యక్తి యుద్ధం(War) వెనక ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అతను నిజానికి చాలా అరుదుగా మాట్లాడతాడు మరియు ఎప్పుడూ బహిరంగంగా ఈ వ్యక్తి కనిపించడు. కాబట్టి అతను గత శనివారం మాట్లాడబోతున్నట్లు హమాస్ టీవీ ఛానెల్ ప్రకటించినప్పుడు, ఏదో ముఖ్యమైన సంఘటన జరగబోతుందని పాలస్తీనియన్లకు పరోక్షంగా తెలిపినట్లు అర్థమైంది. డీఫ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఒకటి అతని 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, మరొకటి అతను మాస్క్ వేసుకుని ఉన్నప్పుడు. డీఫ్ ఆచూకీ ఇప్పటివరకు తెలియనప్పటికీ, ఎక్కువగా గాజాలో ఉంటున్నాడని.. దాడికి సంబంధించిన ప్రణాళిక మరియు కార్యాచరణ అంశాల్లో డీఫ్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఇజ్రాయెల్(Israel) భద్రతా వర్గాలు తెలిపాయి.