భారత్ గౌరవ రైలులో శ్రీరామాయణ యాత్ర.. ప్రత్యేకతలు ఏమిటంటే..

భారత్ గౌరవ డీలక్స్ ఏసీ పర్యాటక రైలు ను ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కానుందని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి “శ్రీ రామాయణ యాత్ర” భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించనున్నారు. భారత్ గౌరవ డీలక్స్ ఏసీ పర్యాటక రైలు ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కానుందని.. కేంద్ర రైల్వే శాఖ […]

Share:

భారత్ గౌరవ డీలక్స్ ఏసీ పర్యాటక రైలు ను ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కానుందని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి తెలిపారు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి “శ్రీ రామాయణ యాత్ర” భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించనున్నారు. భారత్ గౌరవ డీలక్స్ ఏసీ పర్యాటక రైలు ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కానుందని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్, నేపాల్ మధ్య నడిచే మొట్టమొదటి పర్యాటక రైలు ఇదే. 3500 కోచ్ లతో భారత్ గౌరవ్ పేరిట ప్రైవేటు పర్యాటక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం.

18 రోజుల యాత్ర..

గత ఏడాది షిరిడి యాత్ర పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది. ఇప్పుడు శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ.. శ్రీరామాయణ యాత్ర పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది. 18 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర.. ఢిల్లీ లోని సర్దార్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. అయోధ్య, బక్సర్, సీతామర్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, నాసిక్ , హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం వంటి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి ఢిల్లీతో ముగుస్తుంది. యాత్రికులకు 18 రోజుల యాత్రలో వసతి, భోజనాలు సదుపాయాలతో పాటు ప్రయాణ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, గైడ్స్ వంటి సౌకర్యాలను కూడా ఈ యాత్రలో భాగం చేశారు. 

ఏప్రిల్ 7 ప్రారంభం..

 శ్రీరామాయణ యాత్రను ఏప్రిల్ 7న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీలోని సర్దార్ జంక్షన్ నుంచి ఏప్రిల్ 7న రైలు ప్రారంభమవుతుంది. ఆ తరువాత శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు జరిగిన ప్రాంతాల మీదుగా ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 26 భారత్ గౌరవ్ ఏసీ పర్యాటక రైల్లు నడుస్తున్నాయి. తాజా యాత్రకు ఆ రైలునే కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు మొదటి గమ్యం అయోధ్య. అక్కడ శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. బీహార్ లోని సీతామర్హి, వారణాసి, ప్రయాగ్ రాజ్ ఇలా పలుచోట్లతో మహారాష్ట్రలోని నాగపూర్ లో రైలు తిరుగు ప్రయాణం అవుతుంది.

టికెట్ ధరలు..

 ఈ యాత్రలో యాత్రికులు మొత్తం 7500 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. శ్రీ రామాయణ యాత్ర టికెట్ ధరల విషయానికి వస్తే..  సెకండ్ ఏసి కోచ్ లో ఒక్కొక్కరికి రూ. 1.14 లక్షలు, ఫస్ట్ ఏసీలో రూ. 1.46 లక్షలు, మరో ఏసీకు రూ. 1.68 లక్షలు మేరా ఖర్చవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు..

ట్రైన్ బయట ప్రత్యేకమే..

ఈ రైలులో మొత్తం 14 కోచ్ లు ఉంటాయి. 600 మంది సామర్థ్యం ఉన్న ఈ రైలులో.. మొదటి ప్రయాణంలో 500 మంది యాత్రికులు ప్రయాణం చేస్తున్నారు. యాత్రకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక మార్పులు ట్రైన్ లో చేశారు. ఈ రైలు బయట వైపున సుసంపన్నమైన భారతీయ సంస్కృతి, వైభవాన్ని ప్రతిబింబించేలా వివిధ చిత్రాలను, పురాతన కట్టడాలను, ఆలయాలను, నృత్య రూపాలు , వంటకాలు, వస్త్రాదరణ, యుద్ద కళలు, జానపద కళలు వంటి వాటిని ప్రదర్శించడం జరిగింది. రైలు కోచ్ లపై శతాబ్దాల కాలం కిందట సారనాథ్ లో నిర్మించిన దమేక్ స్తూపం మొదలుకొని ఇటీవలే న్యూఢిల్లీలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ వరకు వివిధ కట్టడాలను ప్రదర్శించడం జరిగింది.