మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే అత్యంత సాధారణ సంకేతాలు ఇవే!

స్మార్ట్ ఫోన్లు అత్యద్భుతమైన సాంకేతికను కలిగి ఉండడమే కాకుండా.. ప్రతి విషయాన్ని కూడా మనకు చిటికెలో పూర్తి చేస్తున్నాయి. స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది.  ఈ స్మార్ట్ ఫోన్లు అత్యద్భుతమైన సాంకేతికను కలిగి ఉండడమే కాకుండా.. ప్రతి విషయాన్ని కూడా మనకు చిటికెలో పూర్తి చేస్తున్నాయి. మనం దేనినైనా తెలుసుకోవాలన్నా.. లేదా ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచానికి చూపించాలన్నా సరే.. క్షణాల్లో జరిగిపోతోంది.  సోషల్ మీడియా పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ […]

Share:

స్మార్ట్ ఫోన్లు అత్యద్భుతమైన సాంకేతికను కలిగి ఉండడమే కాకుండా.. ప్రతి విషయాన్ని కూడా మనకు చిటికెలో పూర్తి చేస్తున్నాయి.

స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది.  ఈ స్మార్ట్ ఫోన్లు అత్యద్భుతమైన సాంకేతికను కలిగి ఉండడమే కాకుండా.. ప్రతి విషయాన్ని కూడా మనకు చిటికెలో పూర్తి చేస్తున్నాయి. మనం దేనినైనా తెలుసుకోవాలన్నా.. లేదా ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచానికి చూపించాలన్నా సరే.. క్షణాల్లో జరిగిపోతోంది.  సోషల్ మీడియా పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సాధ్యపడుతోంది. డిజిటల్ ప్రపంచాన్ని ఈ చిన్న స్మార్ట్ ఫోన్ లో నిల్వ చేయవచ్చు. ఇలాంటి స్మార్ట్ ఫోన్ లను  కొంతమంది హ్యాక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆన్లైన్ దాడి చేసేవారు మీ వ్యక్తిగత డేటాను దొంగలించి.. మీ వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఇకపోతే మీ ఫోన్ ను  ఎవరైనా హ్యాక్ చేశారని తెలుసుకోవడానికి ఎలాంటి సంకేతాలు మన మొబైల్లో కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ హ్యాక్ 

ఉదాహరణకు మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందా?  ఒకవేళ అలా అయితే మీ మొబైల్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు హ్యాక్ అయినట్టు మీరు అనుమానించాల్సిందే. మీ స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఎలా పనిచేస్తుందో?  ఇప్పుడు అలాగే పని చేస్తుందా? పర్ఫామెన్స్ లో చిన్న చిన్న మార్పులు కాకుండా.. పెద్ద తేడాలు కనిపిస్తున్నాయా? ఇలాంటివి గమనించాలి. ఒకవేళ ఇలాంటివి గమనించినట్లయితే తప్పకుండా మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేసి మరెవరో ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. సాధారణంగా ఒక్కొక్కసారి స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినప్పుడు పర్ఫామెన్స్ లో చాలా తేడాలు ఉంటాయి. అవి యూజర్లకు మొబైల్ హ్యాక్ అయిందని అర్థం కాదు.

మొబైల్ హ్యాక్ యాప్స్ 

స్మార్ట్ ఫోన్ లోనే ఏదైనా సమస్య ఉందేమో అనుకుంటారు.  కానీ హ్యాక్ అయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం, ప్లేస్టోర్ లోని యాప్స్ లో యాడ్ వేర్, మాల్వేర్ లాంటి హానికరమైన వైరస్లు ఉండడం వల్ల మీ ఫోన్ ను  ఇతరులు హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు వాట్స్అప్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా లింక్స్ పంపించి మీ స్మార్ట్ ఫోన్లు హ్యాక్ చేసే అవకాశం ఉంది. అలాగే మీ బ్యాంకు వివరాలు,  ఇతర ముఖ్యమైన సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అంతేకాదు.. మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎక్కువగా యాడ్స్ కనిపిస్తున్నట్లయితే మీ ఫోన్లో ఏదైనా మాల్వేర్ లేదా యాడ్ వేర్ ఉండొచ్చని గుర్తించాలి.

అంతేకాదు ఏవైనా లింక్స్ క్లిక్ చేసినప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది.  మీరు ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు సడన్ గా ఆ యాప్ కనిపించకుండా పోతుంది. అప్పుడు మీరు మీ ఫోన్ ప్రమాదంలో ఉందని గుర్తించాలి. అంతేకాదు బ్యాటరీ త్వరగా అయిపోవడం, డేటా త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొబైల్ బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ ఏమైనా రన్ అవుతున్నట్టయితే దానిని వెంటనే తొలగించాలి. అయినా కూడా ఈ సమస్య వస్తున్నట్లయితే మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని గుర్తించాలి. తెలియని నెంబర్ ల నుంచి మిస్సేడ్ కాల్స్ వస్తే.. ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. మీరు వాడే యాప్స్ సడన్ గా క్లోజ్ అవ్వడం, పదేపదే ఎర్రర్స్ రావడం లాంటివి కూడా మీ ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పడానికి సంకేతాలు. కాబట్టి ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ ఫోన్ ను ఇతరులు చూడకుండా జాగ్రత్తపడాలి.