హెచ్చరిక జారీ చేసిన ఆపిల్ సంస్థ

ఆపిల్ తన ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో కొత్త హెచ్చరిక నోటీసును జారీ చేసింది, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను పట్టుకుని నిద్రపోయే వాళ్ల గురించి అదే విధంగా, ఐఫోన్ ఛార్జింగ్ ప్రాసెస్ గురించి హెచ్చరికలో పేర్కొంది. టెక్ దిగ్గజం చేసిన హెచ్చరిక ప్రకారం, ఐఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్లను కచ్చితంగా ఒక ఫ్లాట్ టేబుల్ మీద, వెంటిలేషన్ ఉన్న ఏరియాలో చేయవలసిందిగా కోరింది. దుప్పట్లు, దిండ్లు వంటి మృదువైన వాటిమీద లేదా నేరుగా శరీరంపై మొబైల్ ఫోన్లను పట్టుకొని ఛార్జింగ్ […]

Share:

ఆపిల్ తన ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో కొత్త హెచ్చరిక నోటీసును జారీ చేసింది, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను పట్టుకుని నిద్రపోయే వాళ్ల గురించి అదే విధంగా, ఐఫోన్ ఛార్జింగ్ ప్రాసెస్ గురించి హెచ్చరికలో పేర్కొంది. టెక్ దిగ్గజం చేసిన హెచ్చరిక ప్రకారం, ఐఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్లను కచ్చితంగా ఒక ఫ్లాట్ టేబుల్ మీద, వెంటిలేషన్ ఉన్న ఏరియాలో చేయవలసిందిగా కోరింది. దుప్పట్లు, దిండ్లు వంటి మృదువైన వాటిమీద లేదా నేరుగా శరీరంపై మొబైల్ ఫోన్లను పట్టుకొని ఛార్జింగ్ చేయకూడదని కంపెనీ స్పష్టంగా చెప్పడం జరిగింది

హెచ్చరిక: 

ఆపిల్ వినియోగదారులు తమ మొబైల్ ఛార్జింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది ఆపిల్ సంస్థ. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు చార్జింగ్ పెట్టి నిద్రపోవడం లాంటివి చేయకూడదని, పరుపులు మీద దిండ్లు మీద మొబైల్ ఛార్జింగ్ పెట్టకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టి మన శరీరం మీద మొబైల్ పెట్టుకోకూడదని గుర్తు చేసింది. ఒకవేళ ఇలాంటివి జరిగినట్లయితే ఫైర్ ఆక్సిడెంట్ వంటివి జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అందుకే తప్పనిసరిగా చార్జింగ్ పెట్టేటప్పుడు ఒక టేబుల్ మీద, వెంటిలేషన్ బాగా ఉన్న చోటులో మాత్రమే ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని ఆపిల్ సూచిస్తుంది. 

ఆపిల్ ఫోన్ ప్రత్యేకత ఏంటి: 

మార్కెట్లో చాలా రకాల ఫోన్లు ఉన్నా ఆపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజే వేరు. ఆపిల్ ఫోన్ ఉందంటే వాళ్లు రిచ్ అనే రేంజ్ ఆపిల్ ఫోన్ ది. సామ్ సంగ్, వన్ ప్లస్ లాంటి ఎన్ని ఫోన్లు వచ్చినా ఆపిల్ కి ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో ప్రతి ఒక్కరు ఆపిల్ ఫోన్ కొనాలనుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఆపిల్ ఫోన్ లో ఫోటో క్లారిటీ చాలా బాగుంటుంది. ఇంకా దీంతో షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయొచ్చు. పిక్సెల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలామంది ఆపిల్ ఫోన్ ఉపయోగించి షార్ట్ ఫిలిమ్స్ తీశారు అంటే దీని క్వాలిటీ అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆపిల్ ఫోన్ వాడి సినిమాలు కూడా తీశారు. 

ఆపిల్ ఫోన్ క్వాలిటీ అనేది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంది. దీనికి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని ఆపిల్ బ్రాండ్స్ విడుదలైనా దీనికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. వేరే మొబైల్ బ్రాండ్లలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ విడుదల చేసినా కూడా ఆపిల్ ఫోన్ కి వచ్చినంత డిమాండ్ వాటికి రావట్లేదు. ఇవి చాలా ఖరీదైన అయినప్పటికీ చాలామంది వీటినే కొంటున్నారు. వీటికి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారంటే వీటి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ ఫోన్ కొత్తగా విడుదల చేసిన 14 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ 1,39,900 ఉంది. 

దీని అప్గ్రేడెడ్ మోడల్ లిమిటెడ్ వెర్షన్. దీని ఖరీదు ఫెరారీ కార్ కంటే ఎక్కువ. దీని ఖరీదు సుమారు 5 కోట్లు ఉంటుంది. లిమిటెడ్ వెర్షన్ అంటే కొన్ని ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అర్థం. ఇప్పుడు మార్కెట్లో ఆపిల్ ఫోన్ కు కాంపిటీషన్ ఇచ్చే ఫోనే లేదు. ముందు ముందు రోజుల్లో దీనికి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ వస్తుందేమో చూద్దాం. వన్ ప్లస్ లాంటి కంపెనీ దీనికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ముందు ముందు ఆపిల్ రేంజ్ ఇంకా ఎంత పెరుగుతుందో చూద్దాం.