ఎలోన్ మస్క్ vs మార్క్ జుకర్‌బర్గ్ మధ్య యుద్ధం?

సోషల్ మీడియా విస్తరించే కొద్దీ ప్రముఖులు ఆన్లైన్‌లో ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకోవడం డైలీ రొటీన్ గా మారిపోయింది. అయితే ఈ సవాళ్లు శృతిమించడంతో ప్రస్తుతం విషయం కేజ్ మ్యాచ్ వరకు వెళ్ళింది. ఎక్కడ ఎవరి మధ్య అనుకుంటున్నారా? మనం రోజు విపరీతంగా వాడే ఫేస్బుక్ మరియు ట్విట్టర్ యొక్క యజమానులైన మార్క్ జుకర్‌బర్గ్ మరియు ఎలోన్ మాస్క్‌లు ఆన్లైన్ సాక్షిగా సరికొత్త వివాదానికి తెర లేపారు. ఎలోన్ మాస్క్‌ ఇచ్చిన కేజ్ మ్యాచ్ ఇన్విటేషన్‌కు […]

Share:

సోషల్ మీడియా విస్తరించే కొద్దీ ప్రముఖులు ఆన్లైన్‌లో ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకోవడం డైలీ రొటీన్ గా మారిపోయింది. అయితే ఈ సవాళ్లు శృతిమించడంతో ప్రస్తుతం విషయం కేజ్ మ్యాచ్ వరకు వెళ్ళింది. ఎక్కడ ఎవరి మధ్య అనుకుంటున్నారా? మనం రోజు విపరీతంగా వాడే ఫేస్బుక్ మరియు ట్విట్టర్ యొక్క యజమానులైన మార్క్ జుకర్‌బర్గ్ మరియు ఎలోన్ మాస్క్‌లు ఆన్లైన్ సాక్షిగా సరికొత్త వివాదానికి తెర లేపారు.

ఎలోన్ మాస్క్‌ ఇచ్చిన కేజ్ మ్యాచ్ ఇన్విటేషన్‌కు లొకేషన్ పంపించు అని జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి  ట్విట్టర్‌కు కాంపిటీషన్ గా ఒక ఆప్ ని ఫేస్బుక్ సంస్థ డెవలప్ చేస్తుంది అన్న వార్తల గురించి ఎలోన్ మస్క్ ప్రతిస్పందన తరువాత అసలు గొడవ మొదలైంది.

ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్….

ట్విట్టర్ కు పోటీగా యాప్ డెవలప్మెంట్ పై ఎలోన్ మస్క్     ” ప్రపంచం పూర్తిగా జుక్ యొక్క బొటనవేలు కింద బతకడానికి వేచి ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కొంచెం అన్న తెలివి అనేది ఉంటుంది కదా. ఇక ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆందోళన చెందాను.” అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్ట్ కి రెస్పాండ్ అయిన ఒక ట్విట్టర్ యూజర్ “మిస్టర్ మస్క్ జాగ్రత్తగా ఉండండి, ఫేస్బుక్ ఫౌండర్ జియు-జిట్సును నేర్చుకుంటున్నాడు. అతను ఇటీవలే జియు-జిట్సు టోర్నమెంట్‌ను కూడా గెలుచుకున్నాడు.”అని మస్క్‌‌కు ఓ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

వెంటనే ఈ మెసేజ్ కి స్పందించిన మస్క్‌‌ ” మార్క్ జుకర్‌బర్గ్ రెడీ అయితే నేను కేజ్ ఫైట్ మాచ్‌కు సిద్ధంగా ఉన్నాను” అని  రిప్లై ఇచ్చాడు. అయితే ఈ మెసేజ్ కి ట్విట్టర్ యూజర్ బదులు ఏకంగా మార్క్ జుకర్‌బర్గ్ స్పందించడమే కాకుండా ఛాలెంజ్ కి రెడీ అని కన్వే చేస్తూ “లొకేషన్ ఎక్కడో పంపించు” అని రిప్లై పెట్టారు. దీంతో అసలు వివాదం మొదలైంది.

ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్‌బర్గ్‌ జియు-జిట్సు టోర్నీలో కాకుండా విన్నర్ గా నిలిచాడు. అతను ఎంతో కాలంగా యుద్ధ విద్యలను నేర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే మస్క్ ట్విట్టర్ యూజర్ కి ఇచ్చిన రిప్లై ని జుకర్‌బర్గ్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు అతను పెట్టిన మెసేజ్ చెప్పకనే చెబుతుంది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య నిజంగానే కేజ్ ఫైట్ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది.

ఎలోన్ మస్క్ vs మార్క్ జుకర్‌బర్గ్

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జుకర్‌బర్గ్ నిజంగా

మస్క్ తో రింగ్‌లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెండ్ మీ లొకేషన్ అని జుకర్‌బర్గ్ పెట్టిన ఇంస్టాగ్రామ్ స్టోరీ గురించి అడిగినప్పుడు ” ఎంతో స్పష్టంగా ఉన్నా విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు”అని మెటా ప్రతినిధి సమాధానమిచ్చారు.

జుకర్‌బర్గ్ పోస్ట్ కు రిప్లై గా “వెగాస్ ఆక్టగొన్..” అని మస్క్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ” ‘ది వాల్రస్’అని ఒక ప్రత్యేకమైన ఫైటింగ్ స్కిల్ నాకు బాగా తెలుసు. నా అకౌంట్ ని నేను స్కిల్ తో ఈజీగా ఓడించగలను” అని మస్క్ పేర్కొన్నారు. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఫైట్ జరుగుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి మాటల ఫైట్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది.

జుకర్‌బర్గ్ మరియు మస్క్ మధ్య జరిగే పోరులో ఎవరు గెలుస్తారు? సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అందరికీ ఏదో ఒక రూపంలో మంచిని పరిచయం చేయాల్సిన వీరు తమ మాటల యుద్ధం ద్వారా ప్రస్తుతం సమాజానికి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది