IISc (ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)తో జట్టుకట్టిన శాంసంగ్.. అందుకోసమేనట..

ఈ స్మార్ట్ ఫోన్ దునియాలో శాంసంగ్ కంపెనీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎన్ని రకాల కంపెనీలు వచ్చినా, అవి ఎన్ని కొత్త ఫీచర్లతో మొబైల్స్ రిలీజ్ చేస్తున్నాకానీ.. శాంసంగ్ కంపెనీ తట్టుకుని నిలబడింది. వాటన్నింటికి ధీటుగా కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూనే ఉంది. అందుకోసమే టెక్ ప్రియుల దగ్గరి నుంచి సామాన్య ప్రజల వరకు శాంసంగ్ అంటే అదో రకమైన అభిమానం చూపిస్తారు. శాంసంగ్ కంపెనీ కేవలం స్మార్ట్ ఫోన్ల […]

Share:

ఈ స్మార్ట్ ఫోన్ దునియాలో శాంసంగ్ కంపెనీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎన్ని రకాల కంపెనీలు వచ్చినా, అవి ఎన్ని కొత్త ఫీచర్లతో మొబైల్స్ రిలీజ్ చేస్తున్నాకానీ.. శాంసంగ్ కంపెనీ తట్టుకుని నిలబడింది. వాటన్నింటికి ధీటుగా కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూనే ఉంది. అందుకోసమే టెక్ ప్రియుల దగ్గరి నుంచి సామాన్య ప్రజల వరకు శాంసంగ్ అంటే అదో రకమైన అభిమానం చూపిస్తారు. శాంసంగ్ కంపెనీ కేవలం స్మార్ట్ ఫోన్ల విపణికే పరిమితం కాలేదు. టెక్నాలజీతో సంబంధమున్న ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎల్​ఈడీ టీవీలు, ల్యాండ్​ లైన్లు, ఫీచర్డ్ ఫోన్లు ఇలా టెక్నికల్ రంగాల్లో దూసుకుపోతుంది. నేటికీ శాంసంగ్ కంపెనీకి ఆదరణ తగ్గలేదు. కంపెనీ హై ఎండ్ బడ్జెట్​ ఫోన్లతో పాటుగా లో ఎండ్ బడ్జెట్​ ఫోన్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

అందుకోసమే జట్టు… 

శాంసంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ (SSIR) ఆన్-చిప్ ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ (ESD) రక్షణ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)తో జత కట్టింది. దీనిపై శాంసంగ్ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అధునాతన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు (IC) మరియు సిస్టమ్-ఆన్-చిప్ (SoC) ఉత్పత్తులలో అల్ట్రా-హై-స్పీడ్ సీరియల్ ఇంటర్‌ఫేస్‌లను రక్షించడానికి అత్యాధునిక ESD పరికర పరిష్కారాలను రూపొందించడానికి తమ కలయిక తోడ్పాటునందిస్తుందని కంపెనీ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలియజేసింది. ఈ భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేసింది. దీనికి సంబంధించిన పరిశోధనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ (DESE), IIScలో ప్రొఫెసర్ మయాంక్ శ్రీవాస్తవ బృందం చేపడుతోంది. ఈ పరిశోధన నుంచి ఉత్పన్నమయ్యే పరిష్కారాలు శాంసంగ్ అధునాతన ప్రక్రియ నోడ్‌లలో అమలు చేయబడతాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ICలు, SoCలు ఆచరణాత్మకంగా మన చుట్టూ కనిపించే చిన్న నుంచి పెద్ద వరకు ఏ సిస్టమ్‌కైనా అవసరం, కానీ అవి ESD వైఫల్యాలకు చాలా సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా అధునాతన నానోస్కేల్ CMOS (కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్) సాంకేతికతలను ఉపయోగించి అభివృద్ధి చేయబడినవిగా ఇవి ఉంటాయి. 

ఆ పరిశోధనలో భాగంగానే.. 

తక్కువ శక్తి, అధిక వేగంతో పనిచేసే అత్యంత విశ్వసనీయమైన ఇంటర్‌ఫేస్‌లు మరియు SoCల కోసం ESD సాంకేతికతలో R&D సెమీకండక్టర్ ఆవిష్కరణ ప్రయత్నంలో అంతర్భాగమే ఈ కలయిక అని శాంసంగ్ ప్రకటించింది. అంతే కాకుండా IISc అనేది ప్రపంచంలోని ప్రముఖ ESD పరికర పరిశోధనలో ఉన్న కొన్ని సంస్థలలో ఒకటని కూడా కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. కావున తాము ఇలా జట్టు కట్టడం వల్ల భవిష్యత్​లో తమకు ఎంతో మేలు జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ ఆవిష్కరణను పెంచేందుకు IIScలో అందుబాటులో ఉన్న నైపుణ్యంతో పాటు ESD పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి IIScతో భాగస్వామ్యం అయ్యామని శాంసంగ్ ప్రతినిధి శౌరీరాజన్ తెలిపారు. ఇందుకు తాము ఎంతో సంతోషిస్తున్నట్లు ప్రకటించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాల ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశాలను మెరుగుపర్చడం ఇక సులభం అవుతుందని, అంతే కాకుండా యువ పరిశోధకుల ద్వారా వ్యవస్థాపక వెంచర్‌లను ప్రోత్సహించడం కూడా తమ లక్ష్యమని శౌరీరాజన్ వెల్లడించారు. 

గణనీయమైన ప్రభావం

ఇక ప్రొఫెసర్ రంగరాజన్ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపగలదనే విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశ్రమ-అకాడెమియా ఎంగేజ్‌మెంట్‌లను బలోపేతం చేసేందుకు తమ భాగస్వామ్యం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అధునాతన నానోఎలక్ట్రానిక్స్ సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమలతో విస్తృతంగా సహకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ESD రక్షణ పరికరాలపై ప్రాథమిక, అనువర్తిత పరిశోధనలు రెండింటినీ నిర్వహించామని తెలిపారు.సెమీకండక్టర్ పరిశ్రమ కోసం సాంకేతిక నోడ్‌ల శ్రేణిలో ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించడంపై బలమైన ప్రాధాన్యతనిచ్చామని ప్రొఫెసర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.