ఇండియాలో Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ సేల్.. ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్లు

ఇటీవల విడుదలైన Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో సేల్ చెయ్యనున్నట్టు శాంసంగ్ తెలిపింది.  కొత్తగా విడుదల చేసిన F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Galaxy F14 5G ఇప్పుడు భారతదేశంలో సేల్ చేయయ్యనున్నారు. స్మార్ట్‌ఫోన్ Exynos 1330 చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 6.6-అంగుళాల ఫుల్ HD+ 90Hz డిస్‌ప్లే మరియు 13 5G బ్యాండ్‌లతో వస్తుంది. ఇది మూడు రంగులలో అంటే OMG బ్లాక్, గోట్ గ్రీన్ మరియు BAE పర్పుల్  లభ్యం అవుతుంది. SAMSUNG GALAXY […]

Share:

ఇటీవల విడుదలైన Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో సేల్ చెయ్యనున్నట్టు శాంసంగ్ తెలిపింది. 

కొత్తగా విడుదల చేసిన F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Galaxy F14 5G ఇప్పుడు భారతదేశంలో సేల్ చేయయ్యనున్నారు. స్మార్ట్‌ఫోన్ Exynos 1330 చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 6.6-అంగుళాల ఫుల్ HD+ 90Hz డిస్‌ప్లే మరియు 13 5G బ్యాండ్‌లతో వస్తుంది. ఇది మూడు రంగులలో అంటే OMG బ్లాక్, గోట్ గ్రీన్ మరియు BAE పర్పుల్  లభ్యం అవుతుంది.

SAMSUNG GALAXY F14 5G వేరియంట్స్ ధర, ఆఫర్‌లు

Samsung Galaxy F14 5G 4GB+128GB వేరియంట్ ధర రూ.14,490 కాగా, 6GB+128GB వేరియంట్ ధర రూ. 15,990 లకు అందుబాటులో ఉంది. అయితే కార్డ్ ఆఫర్‌లతో కలిపి, మొదటి డివైజ్‌ని రూ.12,990, రెండవ డివైజ్‌ని  రూ.14,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ  ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లు, అదే విధంగా సామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా నేటి నుండి విక్రయించబడుతుంది.

SAMSUNG GALAXY F14 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy F14 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఇన్ఫినిటీ-V నాచ్‌ని కలిగి ఉంది, అదే విధంగా గొరిల్లా గ్లాస్ 5తో రక్షించబడింది. స్మార్ట్‌ఫోన్ Exynos 1330 చిప్‌సెట్ ద్వారా తయారు చెయ్యబడింది, ఇక ఇది 5 nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. రెండు వేరియంట్‌లలో లభిస్తుంది, ఒకటి 4GB కాగా.. మరొకటి 6GB RAMతో..  ఈ  రెండూ 128GB స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి.

ఇక స్టోరేజ్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు RAMని 12GB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు. ఇక ఆప్టిక్స్ కోసం, Galaxy F14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. – f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా మరియు సెకండరీ 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం.. ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.

ఇందులో అదనంగా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో  6000mAh బ్యాటరీని పొందుపరిచారు. Galaxy F14 5G ఒక UI కోర్ 5.1ని కలిగి ఉంది. ఇది Android 13 ఆధారంగా రూపొందించబడింది. అదే విధంగా రెండు ప్రధాన Android OS అప్‌డేట్‌లు, నాలుగు సెక్యూరిటీ  అప్‌డేట్‌లను అందుకోనుంది.

ఇది 13 5G బ్యాండ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది పవర్ బటన్‌లో ఇంటిగ్రేట్ చేయబడిన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇక డివైజ్ Samsung Walletకి కూడా సపోర్ట్ చేస్తుందని, ఇది డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేస్తుందని శాంసంగ్ తెలిపింది.Samsung Electronics Co., Ltd అనేది దక్షిణ కొరియాలోని ఒక బహుళజాతి ఎలక్ట్రానిక్స్ సంస్థ. 2019 నాటికి, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ రాబడి ద్వారా ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాంకేతిక సంస్థగా ఉంది. ఇక దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ US$520.65 బిలియన్‌లుగా ఉంది. ఇది ప్రపంచంలో 12వ అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది.