Samsung Galaxy A14 5G భారతదేశంలో ప్రారంభించబడినది: 

కొత్త టెక్నాలజీని తీసుకువస్తూ… కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా తక్కువ ఖరీదులో నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ఎప్పుడూSamsungమొదటి స్థానంలో ఉంటుంది. కొత్త టెక్నాలజీని తీసుకువస్తూ… కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా తక్కువ ఖరీదులో నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ఎప్పుడూ Samsung దే ముందడుగు. ఈ క్రమంలోనే అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న Samsung Galaxy 14 5G మోడల్‌ను విడుదల చేసింది. ఈ Samsung Galaxy A14 5G ధర, ఫీచర్లు, ఇంకా మరి కొన్ని […]

Share:

కొత్త టెక్నాలజీని తీసుకువస్తూ… కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా తక్కువ ఖరీదులో నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ఎప్పుడూSamsungమొదటి స్థానంలో ఉంటుంది.

కొత్త టెక్నాలజీని తీసుకువస్తూ… కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా తక్కువ ఖరీదులో నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ఎప్పుడూ Samsung దే ముందడుగు. ఈ క్రమంలోనే అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న Samsung Galaxy 14 5G మోడల్‌ను విడుదల చేసింది. ఈ Samsung Galaxy A14 5G ధర, ఫీచర్లు, ఇంకా మరి కొన్ని ఇతర వివరాలు ప్రత్యేకంగా మీ కోసం…

Samsung Galaxy A14 5G యొక్క ఫీచర్లు

Samsung Galaxy A14 5G ఫీచర్ల విషయానికొస్తే… ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క పొడవు 167.7 మిల్లీ మీటర్లు, వెడల్పు 78.0 మిల్లీ మీటర్లు, మందం 9.1 మిల్లీ మీటర్లు,  బరువు 202 గ్రాములు. ఫోన్ Android 13 OS ఆధారిత One UI 5.0 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఈ గ్యాడ్జెట్ Exynos 1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 16GB ర్యామ్‌ని కలిగి ఉంది. దీనికి RAM ప్లస్ ఫీచర్ ఉంది కాబట్టి, అదనపు వర్చువల్ RAMని జోడించవచ్చు. అలాగే.. Samsung Galaxy A14 5Gలో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా, కస్టమర్లు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సహాయంతో ఇతర గెలాక్సీ కస్టమర్ల ఫోన్లకు ఫోటోలు, వీడియోలను సురక్షితంగా పంపించుకోవచ్చు. అంతేకాదు.. నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కి సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 2 ఓఎస్ అప్‌గ్రేడ్‌లు రానున్నాయి.

Samsung Galaxy A14 5G కెమెరా:

Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 MP ట్రిపుల్ లెన్స్ వెనుక కెమెరా ఉంది. దీనిలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. Samsung Galaxy A14 5G 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. రెండు రోజుల పాటు ఈ మొబైల్ వాడుకోవచ్చు.

ఇండియాలో Samsung Galaxy A14 5G ధర:

ఈ Samsung Galaxy A14 5G ధరను పరిశీలిస్తే… 4GB RAM-64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499. అలాగే.. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999. 8GB RAM వేరియంట్ ధర రూ. 20,999. ఈ Samsung Galaxy A14 5G ముదురు ఎరుపు, లేత ఆకుపచ్చ, నలుపు రంగులలో అందుబాటులో ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 20 నుండి https://www.samsung.com/ లేదా Samsung ఎక్స్‌క్లూజివ్ పార్ట్‌నర్ స్టోర్‌లు మరియు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇక  Samsung లవర్స్ పండగ చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్​తో ఉన్న బ్రాండెడ్ స్మార్ట్​ ఫోన్​ను కొనాలని చూసేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో ఉన్న ఫీచర్స్ అటువంటి వారికి తప్పనిసరిగా నచ్చుతాయి.