మైక్రోసాఫ్ట్ ‘బింగ్’ నుండి మన డేటా ని కాపాడుకోవడం ఎలా..?

ప్రస్తుతం మనం బ్రౌజింగ్ చేస్తున్న యాప్స్ లో మన డేటా సేఫ్ గా ఉంటుంది అనే నమ్మకం ఉండడం లేదు, ముఖ్యంగా మైక్రో సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం అప్లికేషన్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎదో ఒక కారణం చేత మన హిస్టరీని డిలీట్ చెయ్యడం మర్చిపోతాం, ఆ సమయంలో మనం వాడే కంప్యూటర్ ని ఎవరైనా వాడినప్పుడు మన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉంటుంది. […]

Share:

ప్రస్తుతం మనం బ్రౌజింగ్ చేస్తున్న యాప్స్ లో మన డేటా సేఫ్ గా ఉంటుంది అనే నమ్మకం ఉండడం లేదు, ముఖ్యంగా మైక్రో సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం అప్లికేషన్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎదో ఒక కారణం చేత మన హిస్టరీని డిలీట్ చెయ్యడం మర్చిపోతాం, ఆ సమయంలో మనం వాడే కంప్యూటర్ ని ఎవరైనా వాడినప్పుడు మన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన డేటా ఆ విధంగా లీక్ అయ్యి మన ప్రైవసీ కి భంగం కలిగిస్తుంది. ఇది ప్రతీ కంప్యూటర్ వాడే వ్యక్తికి కామన్ గా ఉండే సమస్య. ముఖ్యంగా బింగ్ యాప్ లో మనం చూసే ప్రతీ సైట్, ప్రతీ లింక్ తో సహా హిస్టరీ లో దొరికిపోతుంది. మనం లాగిన్ అయ్యే పాస్ వర్డ్స్ కూడా బింగ్ కి ఇచ్చేస్తున్నాం.

అయితే మన డేటా మొత్తం మైక్రో సాఫ్ట్ బింగ్ కి వెళ్లకుండా చెయ్యడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాము. ముందుగా బింగ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్ లోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపు ప్రైవసీ, సెర్చ్ & సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ని మనం ఎంచుకోవాలి. ఆ తర్వాత సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సజెషన్స్ టూ ఫాలో అనే బటన్ ‘ఆన్’ అయ్యి ఉంటుంది, దానిని ‘ఆఫ్’ చెయ్యాలి. అప్పుడు మనం గూగుల్ లో ఏమి వెతికినా హిస్టరీ లోకి రాకుండా ఉంటుంది, మన ఇష్టమొచ్చినట్టు కావలసిన వీడియోస్ చూసుకోవచ్చు, కావాల్సిన సోషల్ మీడియా మాధ్యమాలలో లాగిన్ అవ్వొచ్చు, మన డేటా ఎట్టి పరిస్థితిలోను బింగ్ బ్రౌజర్ కి వెళ్ళదు. ఇది ఇప్పుడు కచ్చితంగా అందరూ అనుసరించండి. ఇది మనకి ఎంతో మేలు చేస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆన్లైన్ ని అడ్డం గా పెట్టుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు, మన డేటా మొత్తాన్ని దొంగలించి మన బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బులు కాజెయ్యడం వంటివి ఎన్నో చూసాము. రాత్రి పగలు అని తేడా లేకుండా కస్టపడి సంపాదించిన డబ్బులను ఇలాంటి సైబర్ నేరగాళ్లు రెప్పపాటు సమయం లో కాజేస్తున్నారు. అంతే కాదు కొంతమంది దగ్గర ఉన్న ముఖ్యమైన సమాచారం మరియు వ్యక్తిగత ఫోటోలను దొంగలించి బ్లాక్ మెయిల్ చెయ్యడం వంటివి కూడా చేస్తున్నారు. ఇందువల్ల సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి ఆగడాలను అరికట్టాలంటే మన డేటాని సాధ్యమైనంత వరకు సురక్షితంగా ఉంచుకునేలా ప్రయత్నం చెయ్యాలి, అందుకు పైన  చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అవ్వడం తప్పనిసరి, అంతే కాదు ఇంటర్నెట్ ఉంది కదా అని, ఏ సైట్ పడితే ఆ సైట్ ని ఓపెన్ చెయ్యడం కూడా మంచిది కాదు, ఎందుకంటే స్పాం లింక్స్ ద్వారా మన డేటా మొత్తాన్ని దొంగిలించే ఛాన్స్ ఉంది, మనల్ని ఊరించే ప్రకటనలు, ఇష్టమైన సినిమా హీరోలు మరియు హీరోయిన్ల ఫోటోలు పెట్టి ఇలాంటివి చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త, ప్రస్తుతం సైబర్ నేరాలు ఒక రేంజ్ లో పెరిగిపోయినందున కచ్చితంగా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రైవసీ మైంటైన్ చెయ్యాలి. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తే మీ ప్రయివసీ ఎప్పటికీ మీ చేతిలోనే ఉంటుంది.