ఇండియాలో లాంచ్ కానున్న రియల్‌మీ నార్జో N55

తమ కొత్త ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని రియల్‌మీ ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులో ఉంచినట్టు రియల్‌మీ పేర్కొంది. రియల్‌మీ నార్జో N55 ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. ఇది 33 watt Super VOOC ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీనివల్ల కేవలం 29 నిమిషాల్లో 50% బ్యాటరీ ఫుల్ అవుతుంది. […]

Share:

తమ కొత్త ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని రియల్‌మీ ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులో ఉంచినట్టు రియల్‌మీ పేర్కొంది.

రియల్‌మీ నార్జో N55 ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. ఇది 33 watt Super VOOC ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీనివల్ల కేవలం 29 నిమిషాల్లో 50% బ్యాటరీ ఫుల్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మిరుమిట్లుగొలిపే ఆకృతిని కలిగి ఉంటుందని మరియు ఇది ప్రైమ్ బ్లూ కలర్‌, ప్రైమ్ బ్లాక్‌లో రంగులలో లభ్యమవుతుందని రియల్‌మీ పేర్కొంది. రియల్‌మీ నార్జో N55 7.89mm మందంతో, ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

4GB, 6GB, 8GB మరియు 10GB అనే నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో రియల్‌మీ నార్జో N55 వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.

Realme ఇప్పుడే డైనమిక్ ఐలాండ్ లాంటి మినీ క్యాప్సూల్ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో 6.72 అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్‌ ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌‌తో పని చేస్తుంది. Mali G52 2EEMC2 GPUతో యాడ్ చేయబడిన MediaTek Helio G88 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుంది. ఇక దీని ధర రూ. 10,999 ఉంటుందని తెలుస్తోంది. 

Realme మే 4, 2018న స్థాపించబడింది. దానికి ముందు ఇది Oppoకి సబ్ బ్రాండ్‌గా ఉండేది. ఇది BBK ఎలక్ట్రానిక్స్ యొక్క అనుబంధ సంస్థ. మే 2018లో రియల్‌మీ తమ మొదటి రియల్‌మీ 1 ఫోన్‌ని విడుదల చేసింది. జూలై 30, 2018న Oppo నుండి విడిపోయిన తరువాత నవంబర్ 15, 2018న రియల్‌మీ కొత్త లోగోను విడుదల చేసింది.

నవంబర్ 22, 2018 న రియల్‌మీ భారతీయ మార్కెట్లో కొత్త బ్రాండ్‌గా వచ్చింది. అప్పటి నుండి, భారతదేశంలో రియల్‌మీ డివైస్ అమ్మకాలు Oppoని అధిగమించాయి. Xiaomi, Samsung మరియు Vivo తర్వాత 2019 నాటికి భారతదేశంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ అని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, భారతదేశపు మొట్టమొదటి 5G ప్రారంభించబడిన స్మార్ట్‌ఫోన్ గా రికార్డ్ సృష్టించింది రియల్‌మీ

.

మే 15, 2019న రియల్‌మీ X, రియల్‌మీ X లైట్ మరియు రియల్‌మీ X మాస్టర్ ఎడిషన్‌లను పరిచయం చేస్తూ.. చైనీస్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇక జూన్ 2019లో యూరోపియన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది రియల్‌మీ.

జూన్ 26, 2019న రియల్‌మీ 64 మెగా పిక్సెల్ కెమెరాతో తీసిన మొదటి ఫోటోను పోస్ట్ చేసింది. జూలై 2019 నాటికి రియల్‌మీ చైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా మరియు యూరప్‌తో సహా వివిధ మార్కెట్‌లలోకి ప్రవేశించింది. ఆగస్ట్ 2019 నాటికి రియల్‌మీ 10 మిలియన్ల వినియోగదారులను పొందింది.

జూన్ 2021లో C11 – 2021 ప్రారంభించబడింది. మే 16, 2022న రియల్‌‌మీ యూరప్‌కు ఫ్రాన్సిస్ వాంగ్ CEO అయ్యారు. మే 18, 2022 రియల్‌మీ నార్జో 50 – 5G మరియు 50 Pro – 5Gలని ప్రకటించింది.