ఫ్లిప్‌‌కార్ట్ నుంచి విడిపోయిన ఫోన్ పే

త్వరలో ఐపీవోను లాంచ్ చేయనున్న ఫ్లిప్‌‌కార్ట్ పూర్తిస్థాయి భారతీయ కంపెనీగా ఫోన్ పే.. మెజారీటి వాటాదారుగా వాల్ మార్ట్ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే, ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ నుండి విడిపోయే ప్రక్రియను పూర్తి చేసింది. ఇకపై రెండు కంపెనీలు అమెరికన్ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్ కింద కార్యకలాపాలు కొనసాగిస్తాయి. ఈ మేరకు ఇటీవల సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు తెలిపాయి. అక్టోబర్‌లో సింగపూర్ నుంచి భారత్‌కు తన వ్యాపారాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఫోన్ పే […]

Share:

త్వరలో ఐపీవోను లాంచ్ చేయనున్న ఫ్లిప్‌‌కార్ట్

పూర్తిస్థాయి భారతీయ కంపెనీగా ఫోన్ పే.. మెజారీటి వాటాదారుగా వాల్ మార్ట్

డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే, ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ నుండి విడిపోయే ప్రక్రియను పూర్తి చేసింది. ఇకపై రెండు కంపెనీలు అమెరికన్ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్ కింద కార్యకలాపాలు కొనసాగిస్తాయి. ఈ మేరకు ఇటీవల సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు తెలిపాయి. అక్టోబర్‌లో సింగపూర్ నుంచి భారత్‌కు తన వ్యాపారాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఫోన్ పే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోన్ పేని 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్‌ల ప్రస్తుత వాటాదారులు నేరుగా ఫోన్‌పే ఇండియాలో వాటాలను కొనుగోలు చేశారు. వాల్‌మార్ట్ రెండు సంస్థల్లో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. దీంతో ఫోన్ పే పూర్తి భారతీయ కంపెనీగా మారే ప్రక్రియ పూర్తయింది. ఈ వ్యాపారాలను వేర్వేరు సంస్థలుగా సెటప్ చేయడం వల్ల ఇద్దరూ తమ సొంత వృద్ధి కోసం పని చేయవచ్చు. ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేయడం వల్ల భారతీయ టెక్ ఎకోసిస్టమ్‌లో ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు కొత్త అవకాశాలను అందిస్తుందని, రెండు కంపెనీల వాటాదారులకు ఎంటర్‌ప్రైజ్ విలువను అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుందని ఫోన్ పే వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ అన్నారు. రెండు సంస్థలు ఒక్కొక్కటి 400 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నారు. తదుపరి బీమా, రుణ వ్యాపారం వంటి కొత్త వ్యాపార రంగాలలో పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన అన్నారు. ఫోన్ పే వచ్చే ఏడాది IPO తీసుకురాబోతోంది. దీని కోసం కంపెనీ 8-10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను పరిశీలిస్తోంది. IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో, UPI ఆధారిత చెల్లింపుల కార్యకలాపాలు, బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలని కంపెనీ చూస్తోంది. మన దేశంలో ఫోన్ పేను వాడే వారు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. చాలా రకాల పేమెంట్లకు ఫోన్ పేను వాడుతున్నారు. తమ పోటీ కంపెనీల కంటే ఎక్కువ ఆఫర్లు ఇస్తూ సంస్థ కూడా రిటైలర్ల వద్ద కూడా తమ క్యూ ఆర్ కోడ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటోంది. క్యూ ఆర్ బిజినెస్​లో చాలా మంది కంపెనీలు ఉన్నా కానీ ఫోన్​ పేను మాత్రం క్రాస్ చేయలేకపోతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకు వస్తూ ఫోన్ పే ముందుకు దూసుకుపోతుంది. ఇంతకు ముందు ఫ్లిప్​కార్డ్ సూపర్ కాయిన్స్​తో ఫోన్ పేలో చెల్లించే వెసులు బాటు ఉండేది. మరి ఈ ప్రకటన తర్వాత ఆ ఫీచర్​ను అలాగే కంటిన్యూ చేస్తారో లేక ఆ ఫీచర్​ను తీసేస్తారో వేచి చూడాలి. ఇక ఫోన్ పేకు పోటీదారైన ఓ కంపెనీ మాజీ సీఈవో, ఫౌండర్ ఆ కంపెనీ మీద పలు ఆరోపణలు చేయడం కూడా ఫోన్ పేకు కలిసి వస్తోంది.