భారత్ లో లాంచ్ కాబోతున్న Oppo Reno 10 

Oppo భారతదేశంలో Oppo Reno 10 సిరీస్ లాంచ్‌ను గురించి స్పష్టం చేసింది, కీలకమైన స్పెసిఫికేషన్‌లు మరియు కెమెరా ఫీచర్లను గురించి మరిన్ని వివరాలు వెల్లడించింది. భారత్ లో లాంచ్ చేసిన అనంతరం ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. Oppo త్వరలోనే భారతదేశంలో తన Oppo Reno 10 సిరీస్ లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది మరియు కెమెరా సామర్థ్యాలపై మెయిన్ ఫోకస్ ఉండబోతోంది, రాబోయే రెనో 10 ప్రో మోడల్‌ల యొక్క […]

Share:

Oppo భారతదేశంలో Oppo Reno 10 సిరీస్ లాంచ్‌ను గురించి స్పష్టం చేసింది, కీలకమైన స్పెసిఫికేషన్‌లు మరియు కెమెరా ఫీచర్లను గురించి మరిన్ని వివరాలు వెల్లడించింది. భారత్ లో లాంచ్ చేసిన అనంతరం ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.

Oppo త్వరలోనే భారతదేశంలో తన Oppo Reno 10 సిరీస్ లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది మరియు కెమెరా సామర్థ్యాలపై మెయిన్ ఫోకస్ ఉండబోతోంది, రాబోయే రెనో 10 ప్రో మోడల్‌ల యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌ల గురించి వినియోగదారుల కోసం కంపెనీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ఫోన్‌లు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటాయి, ఆసక్తి గలవారు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ అద్భుతమైన మొబైల్ను ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతానికి లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, టీజర్‌లలో కొత్త Oppo నుంచి ఒక అద్భుతమైన సరికొత్త ఫీచర్స్ తో ఉన్న మొబైల్ లాంచ్ కాబోతుందని వెల్లడించింది. తేదీ తెలియనప్పటికీ, ఈ అద్భుతమైన మొబైల్ యొక్క ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు ఒకసారి చూద్దాం. 

ఫొటోస్: 

Oppo Reno 10 Pro ఫోన్‌లలో చెప్పుకోదగ్గ ఫీచర్లలో ఒకటి టెలిఫోటో బ్యాక్ కెమెరా. Oppo Reno 10 Pro+ మోడల్ 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే కొత్త పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుందని స్పష్టం చేసింది. ఈ కెమెరా సెటప్ నిజానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌తో ఫోటోగ్రాఫర్స్ కు ఎంతో అనువుగా ఉండే పోర్ట్రెయిట్‌లను అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా చాలా దూరంలో ఉన్న అద్భుతమైన చిత్రాలను కూడా మనం ఫొటోస్ తీయొచ్చు, దూరంగా ఉన్న అద్భుతమైన సీనరీస్ దగ్గరగా ఉన్నట్లు చాలా ఎఫెక్ట్స్ తో మనం ఫొటోస్ అయితే తీయొచ్చు.

మోడల్: 

రెనో 10 ప్రో+ పెరిస్కోప్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకోనంది, ఇది ఇతర డివైసెస్తో పోలిస్తే చాలా స్లిమ్ గా ఉండే కెమెరా మాడ్యూల్‌తో మన ముందుకు రాబోతోంది. బ్యాక్ ప్యానెల్ కెమెరా వల్ల ప్లఫీగా కనిపించకుండా, లెన్స్ మరియు సెన్సార్ ఇచ్చారు. దానివల్ల మొబైల్ చూడ్డానికి చాలా అద్భుతంగా స్లిమ్ గా కనిపిస్తుంది.

కెమెరా:

రెనో 10 ప్రో మరియు ప్రో+ మోడల్‌లు రెండూ ఒకే కెమెరా సెటప్‌తో మన ముందుకు రాబోతున్నాయి. బ్యాక్  కెమెరా కాన్ఫిగరేషన్‌లో 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండగా, నిజానికి ఇదే మొబైల్ చరిత్రలోనే అత్యధిక మెగాపిక్సెల్ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాగా కంపెనీ పేర్కొంది. ఇది 1/2-అంగుళాల ఇమేజ్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతుతో 3x ఆప్టికల్ జూమ్‌ను ఎనేబుల్ చేస్తుంది. సెటప్ ఆకట్టుకునే 120x హైబ్రిడ్ జూమ్‌ను కూడా అందిస్తుంది.

అంతేకాకుండా, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX890 సెన్సార్‌తో రాబోతోంది, ఇది లైట్ ఎఫెక్ట్స్ కోసం పెద్ద 1/1.56-అంగుళాల సెన్సార్ పరిమాణంతో ఉంటుంది. ఇది బెస్ట్ ఫోకస్ అలాగే క్లియర్ పిక్చర్ కోసం OIS మరియు ఆల్-పిక్సెల్ ఓమ్నిడైరెక్షనల్ ఫోకస్‌కు కూడా మద్దతు ఇస్తుంది.బ్యాక్ కెమెరా 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 సెన్సార్‌తో రాబోతోంది, ఇది 1/4-అంగుళాల సెన్సార్‌తో 112-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాగా పనిచేస్తుంది.

సెల్ఫీల కోసం, భారతదేశం అంతటా లాంచ్ అవ్వబోతున్న ఈ హ్యాండ్‌సెట్ 32-మెగాపిక్సెల్ సోనీ IMX709 సెన్సార్‌తో వస్తుంది, ఆటో ఫోకస్ మరియు క్లియర్ ఫేస్ పిక్చర్ రికగ్నైజేషన్తో వస్తుంది కాబట్టి ఇది డల్ గా ఉన్న పిక్చర్స్ ని కూడా బ్రైట్ గా చేస్తుంది. ప్రతి పిక్చర్ క్లియర్ కట్గా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌లోని సెన్సార్‌కు 1/2.47-అంగుళాల సెన్సార్ మద్దతు ఇవ్వబడింది మరియు ఇది విస్తృత సెల్ఫీ షాట్‌ల కోసం 90-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FOV)ని అందిస్తుంది.

ప్రాసెసర్:

Reno 10 Pro+, Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్తో వస్తుండడంతో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, ఇది అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఉపయోగించిన ప్రాసెసర్. ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లు రెనో 10 సిరీస్‌లో స్లిమ్ ప్రొఫైల్, పంచ్-హోల్ డిజైన్‌తో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుందని మరియు రెండు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ డివైస్ కి సంబంధించి మరిన్ని వివరాలు గురించి మనం ప్రస్తుతానికి వేచి ఉండాల్సిందే.