వన్ ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. వ‌న్‌ ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ ఫీచర్స్..

చైనీస్ టెక్ దిగ్గజం వన్ ప్లస్ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది..  ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. గతంలో ఫోన్స్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే వారు.. ఇప్పుడు ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది.. ఫోన్స్ కొనేవారు కెమెరా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.. అలాంటి టాప్ క్వాలిటీ ఫొటోలు వచ్చేలా వన్‌ ప్లస్ ఫోన్లు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది వన్ ప్లస్ ఫోన్స్‌ […]

Share:

చైనీస్ టెక్ దిగ్గజం వన్ ప్లస్ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది.. 

ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. గతంలో ఫోన్స్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే వారు.. ఇప్పుడు ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది.. ఫోన్స్ కొనేవారు కెమెరా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.. అలాంటి టాప్ క్వాలిటీ ఫొటోలు వచ్చేలా వన్‌ ప్లస్ ఫోన్లు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది వన్ ప్లస్ ఫోన్స్‌ కొనుగోలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా వీటి ధర కాస్త ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలకు వన్‌ ప్లస్ ఫోన్లు అందని ద్రాక్షగానే మారాయి. మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ కంపెనీ నార్డ్ సిరీస్‌లో ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా నార్డ్ సీఈ సక్సెస్ కావడంతో ఆ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ నార్డ్ సీఈను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో.. ప్రస్తుతం నార్డ్ సీఈ 3ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ పేరుతో లాంచ్ చేస్తున్నామని కంపెనీ టీజర్ పేజీలో వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌ లో స్పష్టం చేశారు..

 భార‌త్ మార్కెట్‌లోకి వ‌న్‌ ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ రానుంది. ఏప్రిల్ 4న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. అంతేకాకుండా వ‌న్‌ ప్ల‌స్ నార్డ్ బ‌డ్స్‌-2 కూడా రిలీజ్ చేయనున్నారు. ఒక్కసారి వ‌న్‌ ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.. 

వ‌న్‌ ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ ఫీచర్స్..

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్ ఆధారంగా ప‌ని చేస్తుంది. 1800 x 2,400 పిక్సెల్స్ రిజొల్యూష‌న్‌ తోపాటు ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగ‌న్ 695 5జీ ఎస్వోసీ చిప్‌ సెట్ , 8జీబీ రామ్ విత్ 128 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఆప్ష‌న్‌లో యూజ‌ర్ల‌కు తీసుకు రానుంది కంపెనీ.. 

కెమెరా ఫీచర్స్..

వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెట‌ప్. 108- మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/1.8 అపెర్చ‌ర్ లెన్స్‌తో వ‌స్తుంది. ప్రైమ‌రీ కెమెరా 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్‌, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్స‌ర్‌ తో మ‌రో కెమెరా వ‌స్తుంది. ఇక సెల్పీల కోసం 16- మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎఫ్/2.5 అపెర్చ‌ర్ లెన్స్ (హోల్ పంచ్ క‌టౌట్‌)తో అందుబాటులో ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. న్యూ లెమ‌న్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. 

బ్యాటరీ..

వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ స‌పోర్ట్ 67 వాట్స్ సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో వ‌స్తోంది. ఇది 5జీతోపాటు బ్లూ టూత్ 5.1, వై-ఫై, జీపీఎస్‌, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

ధర..

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుందని టెక్ నిపుణులు అంచనా. ఈ ఫోన్ ధర కూడా రూ.21,999గా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే స్టోరేజ్ వివరాలు ఇంకా వెల్లడించకపోయినప్పటికీ ఈ ఫోన్ 8 జీబీ+128 జీబీ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.