ఇప్పుడు, ఈ యాప్‌తో మీ వాచ్ నుండే ChatGPT [చాట్ జీపీటీ] ని యాక్సెస్ చేయండి

టెక్నాలజీ ఎలా డెవలప్ అయ్యిందంటే ఏదైనా చిటికెలో జరిగిపోతోంది!  ఇప్పుడు  స్మార్ట్‌వాచ్‌లో చాట్ జీపీటీ నుండి నేరుగా ఆన్సర్ వస్తుంది. ఈ రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ఎక్కువగా విన్పిస్తున్న పేరు చాట్ జీపీటీ ఇంకా చాట్ బాట్. ఈ పేరు వినని టెక్ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు మీరందరూ చాట్ జీపీటీ గురించి ఎన్నో వార్తలు, విషయాలు విని, లేదా చదివి ఉంటారు. ఇప్పటివరకు చాట్ జీపీటీని దాని అధికారిక […]

Share:

టెక్నాలజీ ఎలా డెవలప్ అయ్యిందంటే ఏదైనా చిటికెలో జరిగిపోతోంది! 

ఇప్పుడు  స్మార్ట్‌వాచ్‌లో చాట్ జీపీటీ నుండి నేరుగా ఆన్సర్ వస్తుంది.

ఈ రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ఎక్కువగా విన్పిస్తున్న పేరు చాట్ జీపీటీ ఇంకా చాట్ బాట్. ఈ పేరు వినని టెక్ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు మీరందరూ చాట్ జీపీటీ గురించి ఎన్నో వార్తలు, విషయాలు విని, లేదా చదివి ఉంటారు. ఇప్పటివరకు చాట్ జీపీటీని దాని అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే యాక్సెస్ చేయవచ్చని మనకు తెలుసు. మొబైల్‌లో Chat GPTని యాక్సెస్ చేయడానికి, వెబ్ బ్రౌజర్ సహాయం తీసుకోవాలి. అయితే మీరు Apple స్మార్ట్‌వాచ్‌ని గనక వాడుతున్నట్లయితే, ఇప్పుడు మీరు ఒక క్లిక్‌తో స్మార్ట్‌వాచ్‌లోని Chat GPT నుండి మీ ప్రశ్నలకు సమాధానాలను పొందుతారు. అవును.. Apple యాప్ స్టోర్‌లో WatchGPT అనే యాప్ ఉంది. ఇది స్మార్ట్ వాచ్‌లోనే మీ ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది.

మీరు మీ యాపిల్ స్మార్ట్ వాచ్ లో ChatGPT [చాట్ జీపీటీ]ని యాక్సెస్ చేయవచ్చు. దీనిద్వారా స్మార్ట్ వాచ్‌లోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చూడండి.

ChatGPT [చాట్ జీపీటీ]ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌గా మారుస్తుంది watchGPT. దీనిని యాపిల్ వాచ్ నుండి త్వరగా యాక్సెస్ చేయవచ్చు.

కొంతమంది ChatGPT [చాట్ జీపీటీ]ని ఎంత తరచుగా ఉపయోగిస్తున్నప్పటికీ, దాని వెబ్‌సైట్ దీనికి ఏకైక అధికారిక గేట్‌వేగా ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ని యాక్సెస్ చేయాల్సిన ప్రతిసారీ బ్రౌజర్‌ని తెరిచి, వెబ్ చిరునామాను అడ్రస్ బార్‌లో టైప్ చేయడం అంత సౌకర్యవంతంగా ఉండదు.

కానీ ఆపిల్ వాచ్ వినియోగదారుల కోసం, కొత్త సాధనం ఈ ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తుంది. మీ స్మార్ట్ వాచ్ లో ChatGPT [చాట్ జీపీటీ] శక్తిని అందించే watchGPT అనే కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు Apple యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

ఒక డెమో వీడియో.. యాపిల్ వాచ్ హోమ్ స్క్రీన్‌లో ఈ యాప్ సెట్‌ను అర్థమయ్యేలా  చూపుతుంది. ట్యాప్ చేసిన వెంటనే చాట్‌బాట్ తన పని  ప్రారంభిస్తుంది. అయితే, మీరు మీ ప్రశ్నలను టైప్ చేయాల్సిన అధికారిక ChatGPT [చాట్ జీపీటీ] ఇంటర్‌ఫేస్‌లా కాకుండా, watchGPT వాయిస్ ఇన్‌పుట్ సపోర్ట్ లేయర్‌ని జోడిస్తుంది. దీనిద్వారా ప్రశ్నలను మాటలలో చెప్పడానికి అవకాశం వస్తుంది. అయితే, మన ప్రశ్నలను టైప్ కూడా చేయవచ్చు.

అవుట్‌పుట్ కూడా మాటల రూపంలోనే వస్తుంది.  తర్వాత దాన్ని టెక్స్ట్, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.

Apple వాచీలులేని వినియోగదారుల కోసం  కూడా ChatGPT [చాట్ జీపీటీ]ని యాక్సెస్ చేయడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి గూగుల్ క్రోమ్ [Google Chrome]. ఇప్పుడు కస్టమర్లు తమ వీలును బట్టి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను ఉపయోగించడానికి అనుమతించే ఎక్స్టె‌టెన్షన్లు ఎన్నో ఉన్నాయి.