Twitter: X కొత్త సబ్స్క్రిప్షన్ కు ఫీజు మోత

ప్రస్తుతం ట్విట్టర్ (Twitter) ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ఏడాది ట్విట్టర్ (Twitter) యజమాని ఎలోన్ మస్క్ (Elon Musk), తన హయాంలో ట్విట్టర్ (Twitter) లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. అయితే కొత్తగా సబ్స్క్రైబ్ (Subscribe) చేసుకునే వారికి తప్పకుండా అన్యువల్ ఛార్జ్ అనేది పెట్టనున్నట్లు అదే విధంగా లైక్ చేయడానికి పోస్ట్ చేయడానికి, షేర్ చేయడానికి కూడా చార్జీలు వర్తిస్తాయని ట్విట్టర్ (Twitter) అనౌన్స్ చేయబోతోంది.  అన్యువల్ ఫీజ్ తప్పనిసరి:  […]

Share:

ప్రస్తుతం ట్విట్టర్ (Twitter) ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ఏడాది ట్విట్టర్ (Twitter) యజమాని ఎలోన్ మస్క్ (Elon Musk), తన హయాంలో ట్విట్టర్ (Twitter) లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. అయితే కొత్తగా సబ్స్క్రైబ్ (Subscribe) చేసుకునే వారికి తప్పకుండా అన్యువల్ ఛార్జ్ అనేది పెట్టనున్నట్లు అదే విధంగా లైక్ చేయడానికి పోస్ట్ చేయడానికి, షేర్ చేయడానికి కూడా చార్జీలు వర్తిస్తాయని ట్విట్టర్ (Twitter) అనౌన్స్ చేయబోతోంది. 

అన్యువల్ ఫీజ్ తప్పనిసరి: 

సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్ X, మంగళవారం ఇది కొత్త సబ్‌స్క్రిప్షన్ (subscription) మోడల్‌ను తీసుకురానున్నట్లు అంతేకాకుండా, దీని కింద లభించే ఫీచర్ (Feature)ల కోసం $1 వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది.

“నాట్ ఎ బాట్” అని పిలవబడే కొత్త సబ్‌స్క్రిప్షన్ (subscription) ప్లాట్‌ఫారమ్ వెబ్ వెర్షన్‌లో, లైక్‌లు, రీపోస్ట్‌లు లేదా ఇతర ఖాతాల పోస్ట్‌లను మరియు బుక్‌మార్కింగ్ పోస్ట్‌లను కోట్ చేయడం కోసం, వినియోగదారుల నుండి కొంత ఛార్జి అయితే వసూలు చేస్తుంది.

కొత్త సబ్‌స్క్రిప్షన్ (subscription) మోడల్‌ను పరిచయం చేయడం యొక్క ఉద్దేశ్యం బాట్‌లు మరియు స్పామర్‌లను ఎదుర్కోవడమే, ఎక్స్ఛేంజ్ రేటు ఆధారంగా సబ్స్క్రిప్షన్  (subscription) చార్జి అనేది, ప్రతి దేశానికి మారుతుందని పేర్కొంది.కొత్త పద్ధతి మొదట న్యూజిలాండ్ మరియు ఫిలిప్పీన్స్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని X తెలిపింది. అయితే ఈ కొత్త ఫీచర్ (Feature) ప్రకారం, ఇప్పటికే ట్విట్టర్ (Twitter) లో ఉన్న వినియోగదారులు ఎటువంటి ప్రభావం ఉండదు. 

Read More: IPhone 15 pro Max: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య

ట్విట్టర్ ఆప్ లో ఇప్పటికే అనేక మార్పులు: 

సోషల్ మీడియా (Social Media)లో ట్విట్టర్ (Twitter) హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలోన్ మస్క్ (Elon Musk). అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ (Twitter) లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్ (Twitter)లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ (Twitter) బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ (Twitter) పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్ (Twitter)లో రాసుకొచ్చాడు మస్క్ (Elon Musk).  అన్నట్టుగానే నెక్స్ట్ రోజు నుంచి ట్విట్టర్ (Twitter) లోగోలో X అనే ఆకారం కనిపించింది.

Twitter ప్రైవేటీకరణ చేయడమే కాకుండా, X Corp అనే కొత్త సంస్థలో విలీనం అయింది. ట్విట్టర్ (Twitter)‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ (Elon Musk) తక్షణమే మునుపటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను ఎవరూ ఊహించని విధంగా విధుల నుంచి తొలగించారు. మస్క్ (Elon Musk) ట్విట్టర్ (Twitter)‌కు అనేక కొత్త మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించాడు మరియు కంపెనీ (Company)లో సగం మందిని తొలగించాడు.”అత్యంత హార్డ్‌కోర్” పనికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ మస్క్ (Elon Musk) అల్టిమేటం జారీ చేయడంతో వందలాది మంది ఉద్యోగులు మానేసి కంపెనీ (Company)కి రాజీనామా చేశారు.

గత సంవత్సరం ట్విట్టర్ (Twitter) యజమానిగా మస్క్ (Elon Musk) మారినప్పటి నుంచి, ఆయన ట్విట్టర్ (Twitter) ఆప్ లో తీసుకువచ్చిన మార్పులలో ఇదే చాలా పెద్ద మార్పు అని అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ (Twitter) సీఈవోగా ఉన్న లిండ యాకరినో తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను కంపెనీ (Company)లో లోగో X ట్విట్టర్ (Twitter) ఆప్ లో స్థానాన్ని పొందుకునేందుకు ఆమె హస్తం ఎంతో ఉన్నట్లు చెప్పాడు మస్క్ (Elon Musk). అంతేకాకుండా తన ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ (Twitter) ఆప్ ని ఒక ప్రత్యేకమైన సూపర్ ఆప్ గా చేయాలని అంతేకాకుండా చైనాలో ప్రావీణ్యం పొందిన ‘wechat’ మాదిరిగ మార్చాలనేదే తన నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకొచ్చాడు మస్క్ (Elon Musk).