సిమ్ కార్డులతో ఇక అలా చేస్తామంటే కుదరదు

సిమ్ కార్డులతో ప్రస్తుతం ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. ఎవరు పడితే వారు కొత్త సిమ్స్ ను విచ్చలవిడిగా తీసుకుంటూ వాటిని కీడు చేసేందుకు ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని కఠిన చట్టాలు చేసినా కానీ సిమ్స్ తో చేసే ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అందుకోసమే కేంద్రం కొత్త పన్నాగం పన్నింది. సిమ్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. కేవలం ఈ పరీక్షలు వినియోగదారులకు మాత్రమే పెడితే నేరాలు ఆగడం లేదనే ఉద్దేశంతో […]

Share:

సిమ్ కార్డులతో ప్రస్తుతం ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. ఎవరు పడితే వారు కొత్త సిమ్స్ ను విచ్చలవిడిగా తీసుకుంటూ వాటిని కీడు చేసేందుకు ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని కఠిన చట్టాలు చేసినా కానీ సిమ్స్ తో చేసే ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అందుకోసమే కేంద్రం కొత్త పన్నాగం పన్నింది. సిమ్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. కేవలం ఈ పరీక్షలు వినియోగదారులకు మాత్రమే పెడితే నేరాలు ఆగడం లేదనే ఉద్దేశంతో ఇక మీదట సిమ్స్ ను విక్రయించే డీలర్స్ కు కూడా కొత్త నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనల ప్రకారం… కొత్తగా సిమ్ తీసుకునే వారు ఇక వెరిఫికేషన్ పూర్తైన డీలర్స్ వద్ద మాత్రమే కొత్త సిమ్స్ ను కొనుగోలు చేయగలరు.

సైబర్ ఫ్రాడ్ కట్టడే లక్ష్యంగా 

రోజురోజుకూ దేశంలో సైబర్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో సైబర్ ఫ్రాడ్స్ నమోదవుతున్నాయి. ఈ సైబర్ ఫ్రాడ్స్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఇవి కట్టడి కావడం లేదు. అందుకోసమే ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కేవలం వినియోగదాలరులకు మాత్రమే కాకుండా సిమ్స్ విక్రయించే డీలర్లకు కూడా పోలీస్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఫ్రాడ్స్ అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

ఆ కనెక్షన్స్ అన్నీ రద్దు చేస్తున్నాం: మంత్రి

దేశ వ్యాప్తంగా మోసపూరిత పద్ధతులను ఉపయోగించి పొందిన 52 లక్షల కనెక్షన్లను తొలగిస్తున్నట్లు కేంద్ర టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతే కాకుండా ఈ అక్రమ కనెక్షన్లకు బాధ్యులైన 67వేల మంది డీలర్స్ ను బ్లాక్ లిస్ట్ చేశామని పేర్కొన్నారు. సైబర్ మోసాలకు పాల్పడిన వారిపై 300 ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు చేశామని తెలిపారు. 

అమ్మేవారికి ధృవీకరణ తప్పనిసరి

ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ డీలర్స్ అందరూ వెరిఫికేషన్ తో పాటు పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. సిమ్ కార్డ్ డీలర్ల ధృవీకరణ టెలికాం ఆపరేటర్ల ద్వారా చేయబడుతుంది. ఒక వేళ ఈ ధృవీకరణను పూర్తి చేయడంలో సంబంధిత డీలర్లు ఏవైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది. 

వెరిఫికేషన్ కోసం 12 నెలలు

ఇప్పటికే ఉన్న సిమ్ కార్డ్ డీలర్స్ కొత్త నిబంధనలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వారికి 12 నెలల గడువును ఇచ్చింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మోసాలకు చెక్ పడుతుందని, సైబర్ నేరాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మోసం చేసే వ్యక్తులను బ్లాక్ లిస్ట్ చేయడం ద్వారా ఈ మోసాలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ గడువు 12 నెలల లోపు సిమ్ కార్డ్ డీలర్లు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి డీలర్ షిప్ క్యాన్సిల్ అవుతుంది. 

కొత్త సిమ్ కావాలంటే.. ఇలా వెరిఫై

ఇకమీదట కొత్త సిమ్ కావాలని మనం షాప్ కు వెళ్తే ముందుగా అక్కడ ఉన్న డీలర్ మన ఆధార్ కార్డును తీసుకుని అందులో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తాడు. కొత్త సిమ్ తీసుకునే వారి KYC కూడా అక్కడే పూర్తి చేయబడుతుంది. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డ్ మీద తొమ్మిది వరకు సిమ్స్ తీసుకునే సౌలభ్యం ఉంటుంది. మనం తీసుకున్న నెంబర్ డిస్ కనెక్ట్ అయిన 90 రోజుల తర్వాత ఇంకో వ్యక్తికి కేటాయించబడుతుంది. కొత్త వ్యక్తులు సబ్ స్క్రైబర్ KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా అన్ని వివరాలు సేకరించబడతాయి.