యాపిల్‌ నుంచి కొత్త లెదర్ కేసు..!

స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజే వేరు. కొత్త సిరీస్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్‌ చేతికి మరో వారం రోజుల్లో కొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 10:30 గంటలకు విడుదల చేసేందుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో వండర్ లస్ట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి […]

Share:

స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజే వేరు. కొత్త సిరీస్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్‌ చేతికి మరో వారం రోజుల్లో కొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 10:30 గంటలకు విడుదల చేసేందుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో వండర్ లస్ట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఇప్పటి నుండి కొత్త కేస్

అయితే, యాపిల్ ఐఫోన్ 15 నుంచి యూజర్లు కొత్త కేస్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెదర్ కేసును యాపిల్ తొలగించనుందన్నది తాజా సమాచారం. పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ కేసును తీసుకురానుంది. ఇందుకు సంబంధించి కొన్ని లీకైన ఇమేజ్ లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. యాపిల్ కొత్తగా తీసుకురాబోయే కేస్ మెటీరియల్ కూడా చూడ్డానికి, తాకితే అచ్చం లెదర్ మాదిరే ఉంటుంది. కాకపోతే దీన్ని జంతు చర్మంతో తయారు చేయరు.

ప్రస్తుతం ఉన్న లెదర్ కేసును యాపిల్ 2013లో ఐఫోన్ 5ఎస్ తో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిజైన్, రంగుల పరంగా పలు మార్పులు చేశారు. పర్యావరణ అనుకూల మెటీరియల్ తో కొత్త కేస్ ను తయారు చేసినట్టు సమాచారం. కాకపోతే ఎలాంటి మెటీరియల్స్ ను తయారీలోకి వినియోగించారన్న వివరాలు లేవు. మరి యాపిల్ తీసుకొచ్చే కొత్త కేస్ ఎలా ఉంటుందో చూడాలంటే పది రోజులు ఆగాల్సిందే. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న ఆవిష్కరించొచ్చని తెలుస్తోంది.

అయితే, యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంతకుముందు సిరీస్‌ల మాదిరిగానే నాలుగు ఫోన్లు ఉంటాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం, యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం ఐదు మోడల్స్ లాంఛ్ కానున్నాయి. టిప్‌స్టర్ మజిన్ బు ట్విట్టర్లో ఈ ఏడాది కనీసం ఐదు ఐఫోన్లను విడుదల చేస్తుందని వెల్లడించింది.

ఐఫోన్ 15 సిరీస్..

యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కొత్త నివేదికల ప్రకారం, ఈ ఏడాది అదనంగా ఐఫోన్ అల్ట్రా మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే సరికొత్త ఫీచర్లతో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

ఐఫోన్ 15 అల్ట్రా

ఐఫోన్ 15 ప్రో మాక్స్ 6GB RAM, 1TB స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఐఫోన్ 15 అల్ట్రా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. టిప్‌స్టర్ ప్రకారం, 8GB RAM, 2TB స్టోరేజీ ఛాయిస్‌తో వస్తుంది. ఐఫోన్ 15 అల్ట్రా మోడల్ కూడా ప్రో మోడల్ కంటే మెరుగైన కెమెరా ఫీచర్లతో వస్తుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ కంటే అల్ట్రా మరింత ఖరీదైన మోడల్. దీని ధర ప్రో మాక్స్ మోడల్ కంటే దాదాపు $100 డాలర్లు ఎక్కువ.

ధరల వివరాలిలా..

ఐఫోన్ 15 ప్రో మాక్స్ గత ఏడాది ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్ కంటే ఖరీదైనదిగా ఉంటుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. గతేడాద ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ ధర $1,099. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర $1,299గా ఉండొచ్చని లీకైన నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో కొత్త ప్రో మాక్స్ మోడల్ ధర దాదాపు 1,59,900 ఉండొచ్చు. ఆ కంపెనీ భారత్‌లో ఒక్క డాలర్ ధరను రూ.100గా నిర్ణయించింది.

భారతదేశంలో ఐఫోన్ ధరలిలా..

పైన చెప్పినట్లుగా, ఐఫోన్ 15 Ultra మోడల్‌ను భారతదేశంలో విడుదల చేస్తే దాని ధర ఒక డాలర్‌కు రూ.100 పెరిగితే ప్రో మాక్స్ కంటే 8 వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి యాపిల్ కొత్త అల్ట్రా మోడల్ ధర రూ.1,67,900 వరకు ఉండొచ్చు.

ఐఫోన్ 15 ప్రో మోడల్ భారతదేశంలో 1,39,900 వరకు ఉండొచ్చని లీకైన నివేదికల ద్వారా తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్, ప్లస్ వర్షన్ కొన్నిసార్లు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ ధరలతో పాటే లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. యాపిల్ పాత ధర వద్ద ప్రామాణిక మోడల్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకుంటే, ఐఫోన్ 15 రూ.79,900 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.