యూట్యూబ్‌లోనూ లైవ్ లిరిక్స్‌..!

‘యూట్యూబ్ మ్యూజిక్’ మరో కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. పాట ప్లే అవుతున్నప్పుడు లైవ్ లిరిక్స్ వచ్చేలా మార్పులు చేసింది. అయితే ప్రస్తుతం అన్ని పాటలకు ఇంకా లైవ్ లిరిక్స్ రావడం లేదు. త్వరలోనే అన్నింటికీ లిరిక్స్ వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్.. వీడియో షేరింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగదారులు ఉన్న ప్లాట్‌ఫామ్. వీడియోలు చూసే వాళ్లకు కాలక్షేపం, వీడియోలు చేసే వాళ్లకు కలెక్షన్లు. కేవలం యూట్యూబ్ వీడియోలతోనే కోటీశ్వరులు అయిన వాళ్లు ఉన్నారు. […]

Share:

‘యూట్యూబ్ మ్యూజిక్’ మరో కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. పాట ప్లే అవుతున్నప్పుడు లైవ్ లిరిక్స్ వచ్చేలా మార్పులు చేసింది. అయితే ప్రస్తుతం అన్ని పాటలకు ఇంకా లైవ్ లిరిక్స్ రావడం లేదు. త్వరలోనే అన్నింటికీ లిరిక్స్ వచ్చే అవకాశం ఉంది.

యూట్యూబ్.. వీడియో షేరింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగదారులు ఉన్న ప్లాట్‌ఫామ్. వీడియోలు చూసే వాళ్లకు కాలక్షేపం, వీడియోలు చేసే వాళ్లకు కలెక్షన్లు. కేవలం యూట్యూబ్ వీడియోలతోనే కోటీశ్వరులు అయిన వాళ్లు ఉన్నారు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. కాలం గడుస్తున్న కొద్దీ యూట్యూబ్ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తూ ఉంది. కొన్నేళ్ల కిందట యూట్యూబ్ షాట్స్‌ను తీసుకొచ్చింది టక్‌టాక్ వంటి వాటి పోటీ నేపథ్మంలో చిన్న వీడియోలను రూపొందించేందుకు షాట్స్‌ను పెట్టింది. ఇటీవల మ్యూజిక్‌ యాప్‌లు పెరిగిపోయిన నేపథ్యంలో యూట్యూబ్ మ్యూజిక్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్‌లోనూ కొత్త ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. 

పాటతో పాటు లిరిక్స్ వచ్చేలా..

యూట్యూబ్ మ్యూజిక్ తమ యూజర్ల కోసం మరిన్ని అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు లైవ్ లిరిక్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు యూట్యూబ్ మ్యూజిక్‌లో పాటను ప్లే చేసినప్పుడు.. కింద లైవ్ లిరిక్స్‌ కూడా వస్తుంటాయి. ప్రస్తుతం ‘స్పాటిఫై’ లాంటి మ్యూజిక్ యాప్స్‌లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. యూట్యూబ్ మ్యూజిక్‌లోని ఈ ఫీచర్ తొలిసారిగా ఏప్రిల్‌లో కనిపించింది. ప్రస్తుతం యూజర్లకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ కొన్ని పాటలకు లైవి లిరిక్స్ ఇంకా అందబాటులోకి రాలేదు.

లిరిక్స్‌ కోసం ఆప్షన్

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం యూట్యూబ్ మ్యూజిక్ లైవ్ లిరిక్స్‌ ఫీచర్‌‌ను అందజేస్తోదని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. లైవ్‌ లిరిక్స్‌ ఫీచర్‌‌తో ప్లే అవుతున్న లైన్ తెలుగు రంగులో హైలైట్ అయి ఉంటుంది. లైవ్ లిరిక్స్‌ను యాక్సెస్ చేయడానికి.. యూజర్లు ఈ మేరకు లిరిక్స్‌ జోడించిన పాటలను ప్లే చేయవచ్చు. ప్లే అవుతున్న పాటకు సంబంధించిన లిరిక్స్ కోసం ‘లిరిక్స్’ ట్యాబ్‌కు వెళ్లి క్లిక్ చేస్తే వస్తాయి. ఆండ్రాయిడ్ 6.15, ఐవోఎస్ యాప్‌లో వర్షెన్ 6.16లో యూట్యూబ్ మ్యూజిక్ లివ్ లిరిక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని పాటలకు లైవ్ లిరిక్స్ అందుబాటులో లేవు. అన్ని పాటలకు రావాలంటే మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.

భారీగా మ్యూజిక్ యాప్స్

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో భారీగా మ్యూజిక్ యాక్స్ అందుబాటులో ఉన్నాయి. కరోనా తర్వాత వీటి హవా మరింతగా పెరిగింది. ప్రస్తుతం స్పాటిఫై, గానా, జియోసావన్, గూగుల్ పాడ్‌కాస్ట్స్‌, యాపిల్ పాడ్‌కాస్ట్స్‌, అమెజాన్ మ్యూజిక్, వింక్ మ్యూజిక్ వంటి ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఇక విపరీతమైన పోటీ నేపథ్యంలో తమ వినియోగదారులకు మరింత మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్స్‌ను ఆయా యాప్స్‌ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే లైవ్‌ లిరిక్స్‌ కాన్సెప్ట్‌ పుట్టుకొచ్చింది. తొలిసారిగా లైవ్ లిరిక్స్‌ ఫీచర్‌‌ను 2020 జూన్‌లో మ్యూజిక్ సంస్థ ‘స్పాటిఫై’ తీసుకొచ్చింది. భారతదేశంతో సహా కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో లైవ్ లిరిక్స్ ఫీచర్‌‌ను ప్రారంభించింది. 2021 నవంబర్‌‌ నాటికి మరిన్ని మార్కెట్లకు విస్తరించింది. ఇంకొన్ని యాప్స్‌ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. లేదంటే రేసులో వెనకుబడిపోయే ప్రమాదం ఉంది కదా. అందుకే ప్రఖ్యాత గూగుల్‌ సంస్థ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ కూడా స్పాటిఫై దారిలోకి వచ్చింది. లైవ్ లిరిక్స్‌ను ప్రారంభించింది. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో.. పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.