Aadhaar: ఆధార్ స్కాం.. తస్మాత్ జాగ్రత్త

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు ఎక్కువగా అయిపోతున్నాయి. గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం, జాబు పేరు మీద సైబర్ నేరాలు ఎక్కువ అవడం. చూసుకుంటూ పోతే, అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మన స్కాం(Scam)లో నుంచి డబ్బులు కాజేయడానికి అనేకమైన ప్లాన్స్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆధార్ (Aadhaar) కార్డు నెంబర్ ఉంటే చాలు.. మీ అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి.  తస్మాత్ జాగ్రత్త:  సైబర్ కేటుగాళ్ల నేరాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. సామాన్యుల […]

Share:

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు ఎక్కువగా అయిపోతున్నాయి. గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం, జాబు పేరు మీద సైబర్ నేరాలు ఎక్కువ అవడం. చూసుకుంటూ పోతే, అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మన స్కాం(Scam)లో నుంచి డబ్బులు కాజేయడానికి అనేకమైన ప్లాన్స్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆధార్ (Aadhaar) కార్డు నెంబర్ ఉంటే చాలు.. మీ అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. 

తస్మాత్ జాగ్రత్త: 

సైబర్ కేటుగాళ్ల నేరాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి ధనికుల వరకు, వారి అకౌంట్లో ఉన్న డబ్బుని కాచేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ సక్సెస్ అయిపోతున్నారు. ఈ మధ్య ఇటువంటి ఆధార్ (Aadhaar) స్కాం (Scam) ద్వారా అకౌంట్ లో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అందుకే మన ఆధార్ (Aadhaar) నెంబర్ ఎవరికైనా ఇచ్చేముందు ఎంతో ఆలోచించడం ఉత్తమం. ఈ స్కాం (Scam) ప్రకారం, సైబర్ నేరగాళ్లకు మన ఆధార్ (Aadhaar) నెంబర్, మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ నెంబర్ కూడా అవసరం లేదు. ఏ బ్యాంకు అనేది తెలిస్తే చాలు, ఈ రెండు ఆధారాలతో మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఎలా అంటే.. మన బయోమెట్రిక్ (biometric) సంబంధిత డీటెయిల్స్ చోరీ చేస్తున్నారు. దీని కారణంగా, కేవలం సగటు మనిషి ఆధార నెంబర్, బ్యాంకు పేరు ఉంటే చాలు మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఈ స్కాము (Scam) ద్వారా మన అకౌంట్ లో డబ్బులు పోయినట్లు మనకి మెసేజ్ కూడా రాదు. 

అందుకే తస్మాత్ జాగ్రత్త, ఇటువంటి ఆధార్ (Aadhaar) స్కాము (Scam)ల నుంచి తప్పించుకోవడానికి ఈ రోజే మీ ఆధార్ (Aadhaar) కి సంబంధించిన బయోమెట్రిక్ (biometric) డీటెయిల్స్ లాక్ (Lock) చేసుకోండి. 

Read More: Twitter: X కొత్త సబ్స్క్రిప్షన్ కు ఫీజు మోత

బయోమెట్రిక్ డీటెయిల్స్ లాక్ చేసుకోండి ఇలా..:

mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

1. మీ మొబైల్‌లో Google Play Storeని తెరిచి, mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఐఫోన్‌ల కోసం, యాప్ స్టోర్‌ని ఉపయోగించండి.

2. డౌన్‌లోడ్ కోసం mAadhaar యాప్‌కు అవసరమైన అనుమతిని యాక్సెప్ట్ చేయండి.

3. ఒకసారి, మీ ఫోన్‌లో mAadhaar ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, యాప్ కోసం పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి. 

పాస్వర్డ్ 4 అంకెలు ఉండాలని గమనించండి.

mAadhaar యాప్ ద్వారా బయోమెట్రిక్ లను లాక్ చేయడం ఎలా: 

1. mAadhaar యాప్‌ని తెరిచి, యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

2. ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి

3. యాప్ లోని కుడి చేతి పైన మెనూ ఆప్షన్పై క్లిక్ చేయండి.

4. ‘బయోమెట్రిక్ (biometric) సెట్టింగ్‌లు’పై క్లిక్ చేయండి.

5. ‘ఎనేబుల్ బయోమెట్రిక్ (biometric) లాక్ (Lock)’ ఆప్షన్‌పై టిక్ చెయ్యండి.

6. ‘సరే’పై నొక్కండి మరియు ఆధార్ (Aadhaar)‌లో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది

OTPని నమోదు చేసిన వెంటనే, బయోమెట్రిక్ (biometric) వివరాలు వెంటనే లాక్ అయిపోతాయి.

mAadhaar యాప్ ద్వారా బయోమెట్రిక్ లను అన్‌లాక్ చేయడం ఎలా: 

1. mAadhaar యాప్‌ని తెరిచి, మెనుపై క్లిక్ చేయండి

2. డ్రాప్-డౌన్ నుండి, ‘బయోమెట్రిక్ (biometric) సెట్టింగ్‌లు’పై క్లిక్ చేయండి.

3. మెసేజ్ రీడింగ్ – “మీ బయోమెట్రిక్ (biometric)స్ తాత్కాలికంగా అన్‌లాక్ (UnLock) చేయబడుతుంది” మీ ఫోన్ స్క్రీన్‌లపై ఫ్లాష్ అవుతుంది.

4.‘అవును’పై నొక్కండి. ఈ పద్ధతి ద్వారా మీ బయోమెట్రిక్ (biometric) వివరాలు 10 నిమిషాల పాటు అన్‌లాక్ (UnLock) కావడం జరుగుతుంది.