సత్తా చాటిన NRI…

ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో భారతీయుల గుట్టు నిరంతరం మోగుతూనే ఉంది. ట్విటర్, ఫేస్‌బుక్ తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి సీఈఓ వంటి ముఖ్యమైన స్థానం లభించింది. నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పదోన్నతి పొందారు. యూట్యూబ్ సీఈఓ సుసన్ వోజ్‌కికీ రాజీనామా చేసిన తర్వాత, ఆ బాధ్యతను ఇప్పుడు నీల్ మోహన్ స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. NRIలు ప్రపంచంలో ఉన్న చాలా టాప్ కంపెనీలకు సీఈవోలుగా […]

Share:

ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో భారతీయుల గుట్టు నిరంతరం మోగుతూనే ఉంది. ట్విటర్, ఫేస్‌బుక్ తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి సీఈఓ వంటి ముఖ్యమైన స్థానం లభించింది. నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పదోన్నతి పొందారు. యూట్యూబ్ సీఈఓ సుసన్ వోజ్‌కికీ రాజీనామా చేసిన తర్వాత, ఆ బాధ్యతను ఇప్పుడు నీల్ మోహన్ స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది.

NRIలు ప్రపంచంలో ఉన్న చాలా టాప్ కంపెనీలకు సీఈవోలుగా సేవలందిస్తున్నారు. వారు సీఈవోలుగా ఉన్న కంపెనీలు టాప్​లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి అనేక కంపెనీలు NRIలను సీఈవోలుగా నియమించుకోగా.. ఇప్పుడు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్​ యూట్యూబ్ వంతు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఒక ఇండియన్ మూలాలున్న వ్యక్తికే పగ్గాలప్పగించింది. దీంతో NRIలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మన సత్తా ప్రపంచానికి తెలిసిందని వారు కామెంట్లు చేస్తున్నారు.

ఇక యూట్యూబ్ కూడా..

ఇప్పటికే ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ తన భవిష్యత్​ను ఒక ఇండియన్ చేతిలో పెట్టింది.. అమెరికాకు చెందిన గూగుల్​కు భరోసానిచ్చేందుకు ఒక భారతీయుడే కనబడ్డాడు. అలాగే మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలు కూడా ఇప్పటికే ఇండియన్స్​ను నియమించుకున్నాయి. ఇక తాజాగా యూట్యూబ్​ కూడా తమ కంపెనీ సీఈవోగా నీల్​ మోహన్​‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత సీఈవో అయిన సూసన్ వొజిసికి స్థానంలో మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారని యూట్యూబ్ ప్రకటించింది. వరల్డ్​లోనే అత్యధిక మంది చూస్తున్న వీడియో స్ట్రీమింగ్ యాప్​గా యూ ట్యూబ్​కు పేరుంది.

ఎవరీ నీల్ మోహన్

ప్రముఖ కంపెనీ యూట్యూబ్ తన కంపెనీకి నీల్ మోహన్​ అనే NRIని సీఈవోగా నియమించిందనే వార్త తెలియగానే.. అసలెవరీ నీల్ మోహన్ అని అంతా వెతకడం ప్రారంభించారు. ఆయన ఇండియన్ సంతతికి చెందిన వ్యక్తి. నీల్ మోహన్​ స్టాన్​ఫోర్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. 2008లోనే గూగుల్​లో చేరారు. ఆయన ప్రస్తుతం యూ ట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ కంపెనీకే సీఈవో అయి కూర్చున్నారు. ఇక నుంచి యూ ట్యూబ్​లో మొత్తం నీల్ మోహన్ చెప్పినట్లే నడవనుంది. 

25 సంవత్సరాలుగా..

గడిచిన 25 సంవత్సరాల నుంచి యూట్యూబ్​లో వివిధ హోదాల్లో పని చేసిన సూసన్ వొజిసికి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో యాజమాన్యం నీల్ మోహన్​ను సీఈవోగా నియమించింది. సూసన్ సీఈవోగా తప్పకుంటున్నట్లు ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్​లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక సూసన్ హయాంలోనే యూట్యూబ్ ప్రపంచంలోనే నెం.1 వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​గా అవతరించింది. ఆయన గత 25 సంవత్సరాల నుంచి యూట్యూబ్​లో పని చేస్తున్నారు. ఆయన గడిచిన 9 సంవత్సరాల నుంచి యూట్యూబ్ సీఈవోగా ఉన్నారు. ఆయన సారథ్యంలో గతేడాది యూట్యూబ్ 29.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని యాడ్స్ ద్వారా ఆర్జించడం విశేషం. మరి కొత్త బాస్ అయిన మన NRI నీల్ మోహన్ కంపెనీ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి. అతడు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కానీ అంత పెద్ద సంస్థ ఇండియన్ మూలాలున్న వ్యక్తిని సీఈవోగా నియమించుకోవడం హర్షించదగ్గ విషయం.