జుక‌ర్‌బ‌ర్గ్, మ‌స్క్ ఫైట్.. Xలో ప్ర‌సారం

ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. స్పేస్ ఎక్స్, టెస్లా, ట్విట్టర్ సంస్థలకు అధినేత . మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ, . ఇక వీరిద్దరు వ్యాపారంలోనే కాదు నిజజీవితంలోనూ పోటీపడబోతున్నారు..  మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్,  టెస్లా అధినేత  ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారు. ఈ విషయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించారు.   ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ట్వీట్ చేశారు. ‘జుకర్, మస్క్ […]

Share:

ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. స్పేస్ ఎక్స్, టెస్లా, ట్విట్టర్ సంస్థలకు అధినేత . మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ, . ఇక వీరిద్దరు వ్యాపారంలోనే కాదు నిజజీవితంలోనూ పోటీపడబోతున్నారు.. 

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్,  టెస్లా అధినేత  ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారు. ఈ విషయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించారు. 

 ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ట్వీట్ చేశారు. ‘జుకర్, మస్క్ మధ్య జరిగే ఫైట్ ఎక్స్‌లో  లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళ్తాయి, అని మస్క్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

అంతకు ముందు ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో తాను రోజంతా బరువులు ఎత్తుతున్నానని, పోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పారు . వర్కవుట్ చేయడానికి సమయం దొరకడం లేదని, అందుకే అవి అన్ని ఇంటికి తెప్పించుకొని చేస్తున్న  అని ఒక సందర్భం లో ఆయన తెలిపారు .

ఎక్స్‌లో ఒక యూజర్ దీని గురించి ‘అసలు ఈ ఫైట్‌కు సంబంధించిన పాయింట్ ఏంటి  లేకపోతే వర్కవుట్ కోసం నువ్వు మోటివేట్ అవ్వడానికి ఇలా చేస్తున్నావా అని అడిగినప్పుడు  ఎలాన్ మస్క్ ఇది పోరాటానికి సంబంధించిన నాగరిక రూపం. పురుషులు యుద్ధాన్ని ఇష్టపడతారు.అని  సమాధానం ఇచ్చారు  . 

కొన్నాళ్ల క్రితం మార్క్ జుకర్‌బర్గ్ కూడా తను ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేశాడు జియుజిట్సులో శిక్షణ పొందుతున్న జూకర్‌బర్గ్‌తో కేజ్ మ్యాచ్‌కు తాను సిద్ధమని జూన్ 20న మస్క్ పోస్ట్‌ ద్వారా చెప్పడంతో వివాదం మొదలైంది. 

ఇక ఈ ఇద్దరు, వ్యాపారవేత్తల నడుమ కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పాలిటిక్స్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు  సంబంధించి కూడా చాలా విషయాల్లో వాల్ల అభిప్రాయాలూ బిన్నంగా ఉంటాయి .. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు..   ఇక ఇటీవల ఇవి తారస్థాయికి చేరాయి. మస్క్ ట్విట్టర్‌కు కి పోటీగా.. మెటా థ్రెడ్స్ అనే యాప్ లాంఛ్ చేసింది. దీనిపై మస్క్ విమర్శలు చేశారు. తన ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్ డిజైన్ చేశారని  మార్క్ జుకర్‌బర్గ్ పై  ఆరోపించారు.

ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రెడీ అంటే ఆయనతో కేజ్ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై ప్లేస్ ఎక్కడో చెప్పాలంటూ.. సవాల్‌కు విసిరారు  మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. దీనికి బదులిచ్చిన మస్క్.. వెగాస్ ఆక్టాగాన్ దగ్గరికి రా చూసుకుందాం అంటూ రెచ్చగొట్టారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కేజ్ ఫైట్‌లో తలపడబోతున్నారంటూ ప్రచారం స్టార్ట్ అయింది. ఇదంతా కేవలం ప్రచారం కోసమేనని తొలుత చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు అది నిజమనేలానే కనిపిస్తోంది.

కేజ్ ఫైట్ అంటే ఏంటి?

కేజ్ ఫైటింగ్ గురించి తెలుసు కదా.. ఇద్దరు ఫైటర్లను ఒక కేజ్‭లో వేస్తారు, అనంతరం వారు కొట్టుకుంటారు. . కానీ ఈ ఫైట్ కోసం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు పోటీ పడుతున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X  యజమాని ఎలోన్ మస్క్, టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ మధ్య చాలా కాలంగా కేజ్ ఫైట్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే జూకర్‌బర్గ్, తనకు మధ్య కేజ్ ఫైట్ ఉండబోతోందని, పోరాటానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనిపై ఫేస్‌బుక్ నుంచి కానీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి జుకర్‌బర్గ్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.