మగ గర్భనిరోధక మాత్రలు

పురుషుల కోసం తయారు చేసిన గర్భనిరోధక మాత్రలుఅధ్యయనంలో మంచి ఫలితాలు.. త్వరలోనే మార్కెట్‌లోకి అవాంఛిత గర్భధారణను నివారించడానికి మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. మగవాళ్ల కోసం ఇలాంటి గర్భనిరోధక మాత్రలు వచ్చాయా.. వస్తే ఎలా ఉంటుందో అనుకున్నారా? అయితే తర్వలోనే ఈ ఆలోచన నెరవేరబోతోంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు అలాంటి మాత్రలను పరీక్షిస్తున్నారు, ఇది పురుషులలో స్పెర్మ్‌ను ప్రభావితం చేసి గర్భధారణ కాకుండా చేస్తుంది. అలాగే గర్భం వచ్చిందేమో అన్న ఆందోళన […]

Share:

పురుషుల కోసం తయారు చేసిన గర్భనిరోధక మాత్రలు
అధ్యయనంలో మంచి ఫలితాలు.. త్వరలోనే మార్కెట్‌లోకి

అవాంఛిత గర్భధారణను నివారించడానికి మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. మగవాళ్ల కోసం ఇలాంటి గర్భనిరోధక మాత్రలు వచ్చాయా.. వస్తే ఎలా ఉంటుందో అనుకున్నారా? అయితే తర్వలోనే ఈ ఆలోచన నెరవేరబోతోంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు అలాంటి మాత్రలను పరీక్షిస్తున్నారు, ఇది పురుషులలో స్పెర్మ్‌ను ప్రభావితం చేసి గర్భధారణ కాకుండా చేస్తుంది. అలాగే గర్భం వచ్చిందేమో అన్న ఆందోళన నుండి స్త్రీలకు విముక్తి కల్పిస్తుంది. ఈ గర్భనిరోధక మాత్రలు పూర్తిగా సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. ఇప్పుడు పురుషులు కూడా ప్రతిరోజూ గర్భనిరోధక మాత్రలు తీసుకోవచ్చు. పురుషుల కోసం రూపొందించిన గర్భనిరోధక మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాత్రలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా టెస్టోస్టిరాన్‌‌ను ఎఫెక్టివ్‌‌గా తగ్గిస్తాయని ప్రయోగాల్లో తేలింది.

మగ గర్భనిరోధక మాత్ర అంటే ఏమిటి?

లాస్ ఏంజిల్స్ బయోమెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పుడు పురుషులు కూడా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించగలరని పేర్కొన్నారు. నిజానికి ఈ మాత్రలు పురుషులలో స్పెర్మ్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల పురుషులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు.

ముఖ్యంగా స్త్రీల కోసం తయారు చేయబడిన గర్భనిరోధక మాత్రలు వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలా సార్లు కేవలం ఒక టాబ్లెట్ తీసుకోవడం ద్వారా వారి హార్మోన్ల సమతుల్యత కూడా క్షీణిస్తుంది.

గర్భనిరోధక మాత్రలు ఎలా పని చేస్తాయి?

మేల్ బర్త్ కంట్రోల్ మెడిసిన్స్ రావడంతో స్త్రీ, పురుషుల్లో కొత్త ఆశ చిగురించింది. చాలా సార్లు మహిళలు దీనిని తీసుకోలేరు. అటువంటి పరిస్థితిలో వారి లైంగిక జీవితం కూడా ప్రభావితమవుతుంది. పాపులేషన్ కౌన్సిల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ పరిశోధకులు కలిసి పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించే మొదటి జనన నియంత్రణ జెల్‌ను రూపొందించారు. దీని తర్వాత ఇప్పుడు ఈ గర్భనిరోధక మాత్రలు అభివృద్ధి చేయబడ్డాయి.

జనన నియంత్రణ మాత్రలు ప్రొజెస్టోజెనిక్ ఆండ్రోజెన్ అని పిలువబడే ఔషధాల తరగతిలో భాగం. ఈ మందులు స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్‌ను బ్లాక్ చేస్తాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడం సాధారణంగా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. అయితే అధ్యయనంలో చాలా మంది పురుషులు ఔషధాలను ఉపయోగించడం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. దుష్ప్రభావాలు ఆమోదయోగ్యమైనవని సూచిస్తున్నారు.

త్వరలో బర్త్ కంట్రోల్ జెల్

బర్త్ కంట్రోల్ జెల్ ఆడ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్, మగవారిలో కనిపించే టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క సింథటిక్ వెర్షన్‌ను కలిగి ఉంటుంది. పురుషులు ఈ జెల్‌ను వారి భుజాలు, నడుముపై పూయాలి. ఆ తర్వాత ఆ జెల్‌లో ఉన్న హార్మోన్లను చర్మం గ్రహించి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది ఇప్పటికీ క్లినికల్ ట్రయల్‌లో ఉంది. ఈ కొన్ని రోజుల్లో దాని ఫలితాలు వెల్లడి కావచ్చని చెబుతున్నారు.

ఈ గర్భనిరోధక మాత్రలు పూర్తిగా సురక్షితమైనవి

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, పురుషులకు గర్భనిరోధక మాత్రలు పూర్తిగా సురక్షితం. ఇది స్త్రీల అండాశయాలలో కనిపించే పురుష హార్మోన్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ రెండింటిపై ఒకే ప్రభావాన్ని చూపుతుంది. పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల గర్భం దాల్చే అవకాశాలు చాలా తగ్గుతాయి.